మిస్ యూనివర్స్ 2019 జోజిబిని తుంజీ: ఫైనల్ రౌండ్ ప్రశ్న, సమాధానం ఏంటి?

ఫొటో సోర్స్, Getty Images
"నాలాంటి ముఖ కవళికలు, నా లాంటి చర్మం, నా లాంటి జుట్టున్న మహిళలది అసలు అందమే కాదన్నట్లుగా భావించే ప్రపంచంలో నేను పెరిగాను. ఈ రోజుతో ఆ ఆలోచనా ధోరణికి ముగింపు పడుతుందని నేను అనుకుంటున్నాను."
'విశ్వ సుందరి-2019' కిరీటం దక్కించుకున్న దక్షిణాఫ్రికా మహిళ జోజిబిని తుంజీ ఇచ్చిన సందేశం అది.
అమెరికాలోని అట్లాంటాలో ఆదివారం జరిగిన మిస్ యూనివర్స్-2019 పోటీలో ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన 90 మందికి పైగా మహిళలు పాల్గొన్నారు.
ప్యూర్టో రికోకు చెందిన మాడిసన్ ఆండర్సన్, మెక్సికోకు చెందిన సోఫియా అరగోన్‌లను వెనక్కి నెట్టి 26 ఏళ్ల జోజిబిని కిరీటం కైవం చేసుకున్నారు.
ఫైనల్ రౌండ్‌లో పోటీపడ్డ ముగ్గురిని పర్యావరణ మార్పులు, నిరసనలు, సోషల్ మీడియా సహా వివిధ రకాల ప్రశ్నలు అడిగారు.
ప్రస్తత కాలంలో యువతులకు ఏం నేర్పించాలి? అన్న ప్రశ్నకు... నాయకత్వ లక్షణాలు నేర్పించాలని జోజిబిని సమాధానం చెప్పారు.
"చాలా కాలంగా యువతులు, మహిళల్లో నాయకత్వ లక్షణాల కొరత ఉంది. మహిళలు అలాగే ఉండాలి, ఎదగకూడదన్న ధోరణి సమాజంలో ఉండటమే ఆ కొరతకు కారణం" అని ఆమె వ్యాఖ్యానించారు.
"మనం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వాళ్లం. మనకు కూడా అన్ని అవకాశాలు కల్పించాలి" అని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, EPA
2011లో ఆంగోలియన్ నటి లెయిలా లోపేజ్ విశ్వసుందరిగా ఎంపికయ్యారు. ఆ తర్వాత ఈ కిరీటం దక్కించుకున్న తొలి నల్లజాతి మహిళ జోజిబిని.
"మేము గర్వపడేలే చేశావు అమ్మాయి" అంటూ జోజిబినికి లెయిలా అభినందనలు తెలిపారు.
జోజిబిని తన గెలుపును గుర్తుచేస్తూ "ఈ అద్భుత క్షణాన్ని చూసిన ప్రతి అమ్మాయికీ తన శక్తి పట్ల విశ్వాసం కలుగుతుంది. వారిలో చాలామంది తమ ప్రతిబింబాలను నాలో చూసుకుంటారు. మిస్ యూనివర్స్- 2019 అని నా పేరు చెప్పుకోవడానికి ఎంతో గర్వపడుతున్నాను" అని ఆమె అన్నారు.
జోజిబిని తన సహజమైన జుట్టు, అందంతో విశ్వసుందరి పోటీలో గెలిచిందంటూ పలువురు ప్రశంసించారు.
ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of Instagram ముగిసింది
ఆగస్టులో ఆమె మిస్ సౌతాఫ్రికా కిరీటం కూడా గెలుచుకున్నారు.
ఆమె అందుకున్న బహుమతుల వివరాలను మిస్ యూనివర్స్ పోటీల నిర్వాహకులు వెల్లడించనప్పటికీ, న్యూయార్క్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో ఒక ఏడాది పాటు అద్దె చెల్లించకుండా బస చేసే ఆఫర్‌ను జోజిబిని గెలుచుకున్నట్లు తెలుస్తోంది. దాంతో పాటు లక్ష డాలర్ల విలువైన (రూ.71 లక్షలు) నగదు బహుమతి కూడా అందుకుంటారని అంటున్నారు.
ఇప్పుడు విశ్వసుందరిగా కిరీటం సాధించిన తర్వాత ఆమెకు ప్రపంచ నలుమూలల నుంచీ మీడియా, మోడలింగ్ రంగాల్లో అవకాశాలు రావచ్చు.
ఇవి కూడా చదవండి:
- నల్లజాతి మోడల్‌పై విమర్శలు. క్షమాపణలు చెప్పిన డవ్
- అందం కోసం వాడే క్రీములతో అనర్థాలెన్నో
- చైనా కొత్త విధానం: మొబైల్ ఫోన్ కొని, వాడాలంటే అందులో ముఖాన్ని స్కాన్ చేసుకోవాల్సిందే
- గూగుల్ పిక్సెల్ ఫోన్లలో భద్రతా లోపాన్ని చూపిస్తే భారీ బహుమతి
- భారత ఆర్థిక వ్యవస్థలు సైబర్ దాడుల్ని తట్టుకోగలవా?
- పాస్‌వర్డ్‌లతో భద్రత లేదా? బయోమెట్రిక్స్ సురక్షితమేనా?
- మీకు ఇలాంటి వాట్సాప్ కాల్ ఎప్పుడైనా వచ్చిందా.. వస్తే అనుమానించాల్సిందే
- మీ చేతిలోని స్మార్ట్ ఫోనే మీకు శత్రువుగా మారితే...
- ‘బికినీ’ లేని అందాల పోటీని మీరు వీక్షిస్తారా?
- #100WOMEN: మహిళ 'అందం' అనే భారాన్ని మోయాల్సిన అవసరం ఏముంది: నందితా దాస్
- అక్కినేని అమల: హుందాగా వయసును ఆహ్వానిద్దాం
- కొత్త ఏడాది తీర్మానాలను అమలు చేయడం ఎలా?
- బ్రిటన్ ఎన్నికల్లో కశ్మీర్ అంశం ప్రభావం చూపుతుందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








