మరణశయ్యపై బీరు తాగుతున్న ఈ వృద్ధుడి ఫొటో ఎందుకు వైరల్ అయింది

ఫొటో సోర్స్, Adam Schemm
- రచయిత, ధ్రుతి షా
- హోదా, బీబీసీ న్యూస్, వాషింగ్టన్ డీసీ
మంచం మీద లేవలేని స్థితిలో చావుబతుకుల్లో ఉన్న 87 ఏళ్ల వృద్ధుడు బీరు తాగుతూ ఉండగా చుట్టూ ఆయనకు కావాల్సినవారంతా గుమిగూడి ఉన్న చిత్రం ఒకటి ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ఎందరినో ఆకర్షిస్తోంది.
ఆ ఫొటోలోని వృద్ధుడి పేరు నార్బర్ట్ స్కెమ్. విస్కాన్సిన్‌లోని యాపిల్టన్‌కు చెందిన ఆయన తన చివరి ఘడియలను తనకు ఇష్టమైనవారి మధ్య సంతోషంగా గడపాలని కోరుకున్నారు.
ఆయన కుటుంబసభ్యులంతా దీనిపై మాట్లాడుకుని ఆయనతో ఫొటో దిగగా స్కెమ్ కుమారుడు టామ్ దాన్ని కుటుంబ వాట్సాప్ గ్రూపులో షేర్ చేశారు.
అయితే, ఈ ఫొటో తీసిన కొద్ది గంటల్లోనే స్కెమ్ చనిపోయారు. కొద్దిసేపటికే ఆ ఫొటోను ఆయన మనవడు ఆడమ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
అంతే.. ఆ ఫొటోకు సోషల్ మీడియాలో వచ్చిన స్పందనలు చూసి ఆ కుటుంబసభ్యులు ఆశ్చర్యపోయారు. తమకు ఏమాత్రం పరిచయం లేని వేలాది మంది ఓదార్పు వచనాలు పలుకుతూ, సంతాపం తెలుపుతూ పెట్టిన కామెంట్లకు వారు ఆశ్చర్యపోయారు.
ట్విటర్‌లో దాన్ని 30 వేల మంది రీట్వీట్ చేయగా 4 వేల మంది కామెంట్ చేశారు. 3,17,000 ఫేవరెట్స్ నమోదయ్యాయి.. అంతేకాదు, రెడిట్, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో ఇతరులు షేర్ చేయడంతో అక్కడా అది వైరల్‌గా మారింది.
''మా తాత జీవితకాలమంతా ఆరోగ్యంగానే ఉన్నారు. గత ఆదివారం ఆయన హాస్పిటల్‌లో చేరిన తరువాత ఇక ఆయన ఎన్నో రోజులు బతకరని తెలిసింది. మనవళ్లు, మనవరాళ్లను కలవాలనుకుని సోమవారం అందరినీ పిలిపించారాయన. మంగళవారం రాత్రి ఈ ఫోటో దిగాం. బుధవారం ఆయన చనిపోయారు. క్యాన్సర్ కారణంగా ఆయన మరణించారు'' అని ఆడమ్ చెప్పారు.
''తాతయ్య బీరు తాగాలనుకుంటున్నారని నాన్న చెప్పారు. ఇప్పుడు ఆ ఫొటోలో ఆయన బీరు తాగడం చూస్తుంటే ఓదార్పుగా ఉంటుంది''
''ఈ ఫొటోలో మా తాత నవ్వుతున్నారు. ఆయన ఏం కోరుకున్నారో అది చేశారు. ఇదంతా మేం అనుకుని చేసిన పని కాదు. అప్పటికప్పుడు అలా ఫొటో తీశామంతే..'' అన్నారు ఆడమ్.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
విషాద సమయంలో ఇలాంటి ఫొటో షేర్ చేయొచ్చా లేదా అని తొలుత తటపటాయించానని.. కానీ, ఆ ఫొటోలో తాతతో కలిసి సంతోషంగా గడిపిన క్షణాలను పంచుకోవాలని పోస్ట్ చేశానని ఆడమ్ చెప్పారు.
ఈ ఫొటో మేం దుఃఖం నుంచి బయటపడడానికి ఉపయోగపడిందని, తమ తాత అందరితో ఆనందంగా ఉండడం ఓదార్పు కలిగిస్తుందని చెప్పారు.
''చాలామంది ప్రజలు ఈ ఫొటోతో రిలేట్ అయ్యారు. చాలామంది మంచి కామెంట్లు పెట్టారు. కొందరు ఓదార్పు, సంతాప సందేశాలు పంపించారు. కొందరు మా తాత గౌరవార్థం బీరు బాటిళ్లను కాల్చి ఆ ఫొటోలను కామెంట్లలో పోస్ట్ చేశార''ని చెప్పారు.

ఫొటో సోర్స్, Ben Riggs
ఇండియానాపోలిస్‌కు చెందిన బెన్ రిగ్స్ అనే ఓ వ్యక్తి స్పందిస్తూ తన తాత లియాన్ రిగ్స్(86) అంతిమగడియల్లో బీరు తాగుతూ, సిగార్ కాల్చుతూ గడిపిన చిత్రాన్ని పోస్ట్ చేశారు.
బెన్ రిగ్స్ బీబీసీతో మాట్లాడుతూ ఆడమ్ పోస్ట్ చేసిన ఫోటోను ట్విటర్లో చూడగానే 2015లో చనిపోయిన తన తాత చివరికోరిక గుర్తొచ్చిందని చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
తన తాతకు అల్జీమర్స్ ఉండేదని.. ఆయన జ్ఞాపకశక్తి నిలకడగా ఉండేది కాదని, ఆయన చివరి కోరికను నెరవేర్చాలని తాను, తన తండ్రి అనుకున్నామని బెన్ చెప్పారు.
తన తాత చనిపోయిన రోజు పాయంత్రం మరో ఫ్యామిలీ ఫొటో తీసుకున్నామని.. తన తండ్రి, తన సోదరులు అందరం అందులో ఉన్నామని.. ఆ మరుసటి రోజే తండ్రి చనిపోయారని బెన్ చెప్పారు. ఆ రెండు ఫొటోలు తనకు గుర్తుండిపోతాయన్నారు.
మరికొందరు కూడా తమ జీవితంలోని అలాంటి అనుభవాలను అక్కడ పంచుకున్నారు.
''ఇలాంటిది అందరం కోరుకుంటాం. ఈ ఫొటో మనం ఇష్టపడేవారిని మన ఆలోచనల్లోకి తెచ్చింది. అందుకే అంతా స్కెమ్ కుటుంబానికి చెందిన ఆ బరువైన క్షణాలకు అందరూ స్పందించార''ని 'ది గుడ్ డెత్' పుస్తక రచయిత ఆన్ న్యూమన్ అన్నారు.
మన ఇళ్లలోనూ అలా చావుకు దగ్గర్లో ఉన్నవారు, చనిపోయినవారు గుర్తొచ్చి వారి కోసం కన్నీరు కార్చే అవకాశం కల్పించిందీ చిత్రం అంటారు న్యూమన్.
అంతేకాదు... తమ అంతిమ ఘడియల్లోనూ చుట్టూ అందరూ ఉండి అంతే సంతోషంగా ఈ లోకాన్ని వీడాలన్న ఆలోచనా కలుగుతుంది అంటారామె.
''చాలామంది మరణానికి ముందు అచేతనంగా ఉండడం... హఠాత్తుగా చనిపోవడం, తల్లిదండ్రులు, తాత, బామ్మల మరణాల సమయంలో దగ్గర లేకపోవడం వంటివి జరుగుతుంటాయి. గుడ్ బై చెప్పే అవకాశం లేకపోవడమూ బాధాకరమే చాలామందికి. అందుకే.. ఇలా మరణశయ్య నుంచి సంతోషంగా వీడ్కోలు పలుకుతున్న చిత్రాన్ని చూసినవారంతా చావంటే అలా ఉండాలనిపించేలా ఉందన్న భావన వ్యక్తమైంది.
ఇవి కూడా చదవండి
- మోదీ ప్రభుత్వం గణాంకాలను దాచిపెట్టి, ఎవరికి మంచి చేయాలనుకుంటోంది
- మహారాష్ట్ర: నాలుగు రోజులకే సీఎం ఫడణవీస్ రాజీనామా, ఈ రాజకీయాలు చెబుతున్నదేంటి?
- 'ఇడియట్స్' గ్రామం పేరు మార్పు... సంబరాలు జరుపుకొంటున్న గ్రామస్థులు
- వీగర్ ముస్లింలను కట్టుదిట్టమైన జైళ్ళలో బంధించి 'బ్రెయిన్‌వాష్' చేస్తున్న చైనా
- ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటో పెట్టాలని ఈమె 7 లక్షలు అప్పుచేసి డిస్నీలాండ్ వెళ్లారు
- 'రాజుల కోట' నుంచి అమూల్యమైన వజ్రాలను ఎత్తుకెళ్లిన దొంగలు
- పోర్న్ తారల అకౌంట్లను ఇన్‌స్టాగ్రామ్ ఎందుకు తొలగిస్తోంది?
- అబ్బాయిలకు శిక్షణనిస్తే అమ్మాయిలపై వేధింపులు తగ్గుతాయా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








