జపాన్: మహిళా సిబ్బంది కళ్లజోడు ధరించడంపై నిషేధం... ఈ వివాదానికి కారణాలేంటి?

ఫొటో సోర్స్, Getty Images
మహిళా ఉద్యోగులు కళ్లజోళ్ళు ధరించొద్దని కొన్ని కంపెనీలు చెప్పడం జపాన్‌లో తీవ్ర దుమారానికి కారణమైంది.
వివిధ కారణాలను చూపుతూ మహిళా సిబ్బంది కళ్లజోళ్ళు ధరించడంపై కొన్ని సంస్థలు 'నిషేధం' విధించాయని స్థానిక మీడియా సంస్థలు కొన్ని తెలిపాయి.
కళ్లద్దాలు ధరించే సిబ్బంది 'హుషారుగా ఉన్నట్లు కనిపించరు' అని కొన్ని రిటైల్ చైన్ సంస్థలు వ్యాఖ్యానించినట్లు వార్తా కథనాలు వచ్చాయి. దాంతో, జపాన్‌లోని సోషల్ మీడియా వేదికల్లో ఈ వ్యవహారం తీవ్ర చర్చకు దారితీసింది.
ఇది పనిచేసే ప్రదేశంలో మహిళల వేషధారణ పట్ల వివక్ష చూపడమే అంటూ అనేక మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వ్యవహారంపై కథనాలు ప్రచురించిన మీడియా సంస్థల్లో నిప్పన్ టీవీ నెట్‌వర్క్, బిజినెస్ ఇన్‌సైడర్ కూడా ఉన్నాయి. మహిళా సిబ్బంది కళ్ల జోళ్ళు ధరించడాన్ని వివిధ రంగాలకు చెందిన సంస్థలు ఎలా అడ్డుకుంటున్నాయో అవి వివరించాయి.
చాలా రంగాలకు చెందిన సంస్థలూ ఈ నిషేధాన్ని అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
విమానయాన సంస్థలు భద్రతాపరమైన కారణాలను చూపుతున్నాయి. సిబ్బంది కళ్లజోళ్లళు ధరిస్తే వినియోగదారులకు వేసే మేకప్‌ను సరిగా చూడలేరని బ్యూటీ పార్లర్ సంస్థలు అంటున్నాయి.
మహిళలకు మద్దతుగా #GLASSESAREFORBIDDEN అనే హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీట్లు వెల్లువెత్తాయి. అనేక మంది మహిళలు కళ్లజోళ్ళు ధరించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
ఇది ముమ్మాటికీ మహిళల పట్ల వివక్షేనని క్యోటో యూనివర్సిటీకి చెందిన సోషియాలజీ ప్రొఫెసర్ కుమికో నెమోటో వ్యాఖ్యానించారు. జపనీయుల పాతకాలపు ఆలోచనలను తాజా కథనాలు ప్రతిబింబిస్తున్నాయని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
పనిచేసే ప్రదేశంలో మహిళలు తప్పనిసరిగా ఎత్తుమడమల చెప్పులు వేసుకోవాలన్న డ్రెస్‌కోడ్ నిబంధన జపాన్‌లో కొన్ని నెలల క్రితం వివాదాస్పదమైంది.
ఆ డ్రెస్‌కోడ్‌ను ఎత్తివేయాలంటూ నటి, రచయిత యూమీ ఇషికావా ఆన్‌లైన్‌లో ఒక ఉద్యమం చేపట్టారు. ఆ ఉద్యమానికి సోషల్ మీడియాలో భారీ ఎత్తున మద్దతు లభించింది.
లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా సాగిన #MeToo ఉద్యమాన్ని ప్రతిబింబించేలా, #KuToo అనే హ్యాష్‌ట్యాగుతో అనేక మంది ట్వీట్లు చేశారు. జపనీస్ భాషలో kutsu అంటే బూట్లు అని, kutsuu అంటే బాధ అని అర్థం. ఈ పదాలతో మహిళలు పెద్దఎత్తున నినాదాలు చేశారు.
తమతో పాటు పనిచేసే పురుష సిబ్బంది సౌకర్యవంతంగా చెప్పులు, బూట్లు వేసుకుంటుంటే, తాము మాత్రం 5 నుంచి 7 సెంటీమీటర్ల హైహీల్స్‌తో ఇబ్బందులు పడాల్సి వస్తోందంటూ వేలాది మంది మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహిళలు ఉద్యోగం చేయాలంటే హైహీల్స్ వేసుకోవడం తప్పనిసరి అన్నట్లుగా అయిపోయిందని ఉద్యమకారులు ఆవేదన వ్యక్తం చేశారు.
హైహీల్స్ తప్పనిసరి చేసే డ్రెస్‌కోడ్‌ను కంపెనీలు కచ్చితంగా అమలు చేయాలంటూ జపాన్ మంత్రి అనడంతో మహిళల్లో ఆగ్రహం మరింత పెరిగింది. దానిపై ఇప్పటికీ చర్చ నడుస్తోంది.
ఇవి కూడా చదవండి:
- ‘పదేళ్ల పిల్లలు కూడా ఆత్మహత్యకు పాల్పడుతున్నారు’
- సెల్లాఫీల్డ్: దశాబ్దాల అణు కాలుష్యానికి సజీవ సాక్ష్యం
- హ్యాపీయెస్ట్ కంట్రీస్‌లో సంతోషం అంతంతేనా?
- మమ్మీ మిస్టరీ వీడింది: తయారీలో తుమ్మ జిగురు పాత్ర
- 500 కిలోల బాంబు... జర్మనీ పట్టణం ఖాళీ
- ఐవీఎఫ్: భర్తలు లేకుండానే తల్లులవుతున్న ఒంటరి మహిళలు
- జపాన్ ఎందుకంత క్లీన్‌గా ఉంటుంది... ఏమిటా రహస్యం?
- జపాన్‌లో భూత్ బంగళాలు... నానాటికీ పెరుగుతున్న సమస్య
- జపాన్ కాకులు కనిపెట్టిన రహస్యమేంటి? నగర జీవనానికి జంతువులు, పక్షులు ఎలా అలవాటుపడుతున్నాయి?
- స్మార్ట్ వ్యవసాయం: భూమి అక్కర్లేదు, కూలీలతో పనిలేదు... అత్యంత వేగంగా పంటలు పండించొచ్చు
- గుండెల్ని పిండేసే వ్యథ: జైలుకు వెళ్లేందుకు పదేపదే నేరాలు చేస్తున్న జపాన్ వృద్ధులు.. ఎందుకంటే...
- తక్కువ పని చేసే కళ... రాణించటమెలా?
- ‘పని ఒత్తిడితో ప్రాణాలు పోతున్నా మనం ఇంకా కళ్ళు తెరవడం లేదు’
- హైదరాబాద్: బడి దగ్గర అన్నం గిన్నెతో చిన్నారి ఫొటో వెనుక నిజాలేమిటి?
- కరసేవకుడి నుంచి ప్రధానమంత్రి వరకు… నరేంద్ర మోదీకి అయోధ్య ఉద్యమం ఎలా ఉపయోగపడింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









