రెండో ప్రపంచ యుద్ధం నాటి 500 కిలోల బాంబు... జర్మనీ పట్టణాన్ని ఖాళీ చేయించిన అధికారులు

ఫొటో సోర్స్, ludwigshafen_de/twitter
రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి బాంబును నిర్వీర్యం చేసేందుకు జర్మనీలోని ఒక పట్టణాన్ని అధికారులు ఆరు గంటల పాటు ఖాళీ చేయించారు.
మధ్య జర్మనీలోని లుడ్విషఫెన్ పట్టణంలో గతవారం ఈ బాంబు లభ్యమైంది. దీనిని నిర్వీర్యం చేసేందుకుగాను పట్టణంలోని దాదాపు 18,500 మందిని స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అధికారులు వేరే ప్రాంతానికి పంపించారు.
500 కేజీల బరువున్న ఈ వైమానిక బాంబును భవన నిర్మాణ కార్మికులు కనుగొన్నారు.

ఫొటో సోర్స్, AFP
నాజీలకు వ్యతిరేకంగా ఆనాటి మిత్ర రాజ్యాలు చేసిన బాంబు దాడుల్లో పేలకుండా మిగిలిపోయిన బాంబులతో జర్మనీ నిండిపోయింది. ఇప్పటికీ దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈ పేలని బాంబులు ఉన్నాయి.
గత వారం లభించిన ఈ భారీ బాంబు ఫొటోను నగర అధికారులు ట్విటర్‌లో పోస్ట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు అమెరికా దళాలు ఈ బాంబును జర్మనీపై వేసి ఉండొచ్చని భావిస్తున్నారు.
2017 సెప్టెంబర్‌లో ఫ్రాంక్‌ఫర్ట్ నగరంలో కూడా రెండో ప్రపంచ యుద్ధం బాంబు ఒకటి లభించింది. దీంతో దాదాపు 70 వేల మంది ప్రజలను అధికారులు ఖాళీ చేయించారు.
ఈ ఏడాది ఏప్రిల్‌లో జర్మనీ రాజధాని నగరం బెర్లిన్ ప్రధాన రైల్వే స్టేషన్‌ను కూడా ఇదేవిధంగా ఖాళీ చేయించారు. అప్పట్లో సరిగ్గా ఇలాగే 500 కేజీల బరువున్న బాంబును నిర్మాణ కార్మికులు కనుగొన్నారు.
ఇవి కూడా చదవండి:
- రెండో ప్రపంచ యుద్ధం: ఆహారంపై ఆంక్షలు
- మొదటి ప్రపంచ యుద్ధం: శత్రు సేనలను హడలెత్తించిన బుల్లి యుద్ధ ట్యాంక్
- చరిత్రలో ఎప్పటికీ మరచిపోలేని 10 కరచాలనాలు
- భవిష్యత్తులో అన్నీ రసాయన యుద్ధాలేనా?
- ప్రపంచాన్ని ట్రంప్ మరింత ప్రమాదంలోకి నెట్టేశారా?
- ప్రపంచం అంతమైపోతుందా? ఎవరు చెప్పారు?
- హిట్లర్ మరణించాడని ప్రపంచానికి బీబీసీ ఎలా చెప్పింది?
- మహాభారత యుద్ధానికి ద్రౌపది పట్టుదలే కారణమా?
- భారత్తో యుద్ధానికి ముందే ప్లాన్ వేసిన మావో?
- భారత్: ‘ప్రపంచంలో మహిళలకు అత్యంత ప్రమాదకర దేశం‘
- అమీనా: ఈ ఆఫ్రికా రాణి ప్రతి యుద్ధం తరువాత ఓ భర్తను పొందుతారు తర్వాత..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













