#BBCArchives: రెండో ప్రపంచ యుద్ధం ముగిసిందని, హిట్లర్ మరణించాడని ప్రపంచానికి వార్తలందించింది ఈ భవనం నుంచే!!

వీడియో క్యాప్షన్, కేవర్షామ్. ఏంటి దీని ప్రత్యేకత?

రెండో ప్రపంచ యుద్ధం ముగిసిందన్న అధికారిక వార్తను ధ్రువీకరించినది అక్కడి నుంచే.. హిట్లర్ మరణం గురించి వార్త అందించిన చోటూ అదే. చెర్నోబిల్‌లో జరిగిన దారుణం గురించి ప్రపంచానికి వార్తనందించినది ఆ భవనం నుంచే.

ఎన్నో చారిత్రక ఘట్టాలకు వేదికైన ఆ బీబీసీ భవనమే కెవర్షామ్. ఇప్పుడు కాలంతో పాటు గతంలోకి వెళ్లిపోయింది. అప్పట్లో ఆ వార్తలను రాసిన వారిని, వాటిని చదివి ప్రపంచానికి వినిపించిన వారిని మరోసారి పలకరించి బీబీసీ అందిస్తున్న జ్ఞాపకాల కథనం ఇది.

కెవర్షామ్‌

కెవర్షామ్‌ను విడిచిపెట్టే సమయంలో కొందరు బ్రిటిష్ ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు కూడా. కానీ బీబీసీ మాత్రం కాలంతో పాటు ముందుకు వెళ్లాల్సిందేనని చెప్పింది. అక్కడితో ఆ శకం ముగిసింది.

వదిలి వెళ్లడం బాధాకరమే. కానీ జీవితం ముందుకు సాగిపోతూనే ఉంటుంది.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)