సెల్లాఫీల్డ్: దశాబ్దాల అణు కాలుష్యానికి సజీవ సాక్ష్యం
సెల్లాఫీల్డ్.. ఐరోపాలోనే అణు కాలుష్యం అధికంగా ఉన్న పారిశ్రామిక ప్రాంతం. కొన్ని దశాబ్దాల పాటు ఇక్కడ అణుధార్మిక ఇంధనాన్ని శుద్ధి చేశారు.
బ్రిటన్ అణు కార్యక్రమంలో ఎంతో కీలకంగా నిలిచిన సెల్లాఫీల్డ్ ఇప్పుడు ఆ దేశంలోనే అత్యంత ప్రమాదకరమైన ప్రాంతం.
కాలక్రమంలో అణు కాలుష్యం పెరిగి మనుషుల ప్రాణాలను బలితీసుకుంటూ ఉండటంతో కొంత కాలం కిందట దాన్ని మూసివేశారు.
ప్రస్తుతం ఆ కాలుష్యాన్ని తొలగించే పనులు జరుగుతున్నాయి. ఆ ప్రాంతాన్ని సందర్శించి బీబీసీ అందిస్తున్న ప్రత్యేక కథనం.
ఇది తొలితరానికి చెందిన న్యూక్లియర్ రియాక్టర్లను నిల్వచేసిన ప్రదేశం. అణు ఇంధనాన్ని శుద్ధి చేసేముందు ఇక్కడ చల్లబరిచేవారు.
గత 30 ఏళ్ల నుంచి ఇది వినియోగంలో లేదు. అయినా ఇప్పటికీ ఇది విషపూరితమైన రేడియో ధార్మిక పదార్థాలతో నిండి ఉంది. ఈ ప్రాంతాన్ని సురక్షితంగా మార్చడం ఎంతో సవాళ్లతో కూడుకున్నది.
ఈ కేంద్రం శిథిలావస్థకు చేరిందనే విషయం చూడగానే తెలిసిపోతుంది. ఏ ఒక్క నిర్మాణం కూలిపోయినా దాని పర్యవసానం ఎంతో ప్రమాదకరంగా ఉంటుంది.
ప్రత్యేకంగా రూపొందించిన రోబోలతో ఇక్కడి నీటిలోని రేడియో యాక్టివ్ పదార్థాలను తొలగిస్తున్నారు. వీటిని ఆపరేట్ చేసే ఉద్యోగులు సురక్షితమైన దూరంలో ఉంటారు.
కఠినమైన వాతావరణంలోనూ పని చేయడం కోసం అత్యాధునిక సాంకేతికతతో కూడిన యంత్రాలను ఈ కేంద్రంలో వినియోగించాల్సి వస్తోంది.
అయితే సెల్లాఫీల్డ్ అణు కాలుష్యం దాని చుట్టు పక్కల ఉన్న వందలాది కంపెనీలకు వరంగా మారింది.
అణుపరిశ్రమ కోసం ఈ కంపెనీలు తయారు చేసే యంత్రాలను ఇతర చోట్ల కూడా లాభాలకు అవి అమ్ముకోవచ్చు.
ఈ శిథిల కేంద్రాన్ని పూర్తిగా తొలగించడానికి ముందుగా... ఈ శుద్ధి ప్రక్రియ చాలా సంవత్సరాలు సాగే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి:
- సన్నీ లియోని ఇంటర్వ్యూ: 'రోడ్డు మీద నుంచున్న వేశ్యకు - పోర్న్ స్టార్‌కి తేడా ఏమిటి?'
- మీ గర్ల్ ఫ్రెండ్‌కు సారీ ఎలా చెబుతారు?
- తదుపరి ‘యాపిల్’ ఏది? భవిష్యత్తు నంబర్ వన్ కంపెనీ ఇప్పుడు ఎక్కడుంది?
- డైమండ్ నగరంలో 'గోల్డెన్ స్వీట్' - మరి రుచి చూస్తారా?
- ఆస్ట్రేలియా: పెట్రోలు అయిపోతోందా? అయిపోతే బండి నడిచేదెలా?
- ప్లాస్టిక్‌పై నిషేధం: ఆస్ట్రేలియాలో ఆగ్రహం
- పీవీ సింధు: ఆదాయంలో క్రికెట్ స్టార్లను వెనక్కు నెట్టిన బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి
- ఆసియా క్రీడలు: దీక్షా డాగర్.. అద్భుతమైన షాట్స్ కొట్టినా అభిమానుల చప్పట్లేమీ ఆమెకు వినపడవు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)