9/11 దాడులకు 18 ఏళ్లు: తీవ్రవాదంపై పోరాటంలో అమెరికా విఫలం - అభిప్రాయం

ఫొటో సోర్స్, Reuters
18 ఏళ్ల క్రితం సెప్టంబర్ 11న న్యూయార్క్‌లో వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై దాడి జరిగింది. ఆ తర్వాత ప్రపంచ రాజకీయాలు మారిపోయాయి.
అమెరికా వెంటనే అఫ్గానిస్తాన్‌లో మిలిటెంట్లపై యుద్ధం ప్రారంభించింది. తాలిబన్లను అధికారానికి దూరం చేసింది.
కానీ 18 ఏళ్ల తర్వాత అమెరికా అదే తాలిబాన్లతో చర్చలు జరుపుతోంది. వారితో శాంతి ఒప్పందానికి దగ్గరగా వచ్చిన సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హఠాత్తుగా ఆ సమావేశాన్ని రద్దు చేసుకున్నారు.
అయితే అమెరిగా విదేశాంగ విధానం ఇప్పుడు ఏ మలుపులో నిలిచిందో తెలుసుకోడానికి బీబీసీ ప్రతినిధి దిల్‌నవాజ్ పాషా, అమెరికా డెలావేర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ముక్తదర్ ఖాన్‌తో మాట్లాడారు.
ముక్తదర్ ఖాన్ అభిప్రాయం ఆయన మాటల్లో...
2017లో ట్రంప్ ప్రభుత్వం తమ జాతీయ భద్రతా ప్రణాళికను కొనసాగించింది. అందులో అమెరికా విదేశాంగ విధానం తీవ్రవాదానికి వ్యతిరేకంగా 'గ్లోబల్ వార్' నుంచి వెనక్కు తగ్గి మళ్లీ పాత విధానం దగ్గరికే రావడం కనిపించింది. అందులో అది నాలుగు అంతర్జాతీయ ప్రమాదాలను గుర్తించింది. మొత్తం ప్రపంచం దృష్టిలో చైనా, రష్యాల నుంచి ముప్పు, స్వయంగా అమెరికాకు ఉత్తర కొరియా, ఇరాన్ అణు కార్యక్రమాల నుంచి పొంచి ఉన్న ప్రమాదం.

ఫొటో సోర్స్, JASON SCOTT/TEXTFILES
మాట మార్చిన అమెరికా
అంటే, ఇప్పుడు అమెరికా ఈ ప్రమాదాలను దృష్టిలో పెట్టుకునే తమ విదేశాంగ విధానం, బడ్జెట్‌ను సిద్ధం చేస్తోంది. 'తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం' అనే మాటను పక్కకు పెట్టేందుకు ప్రయత్నిస్తోంది.
గత ఏడాదిగా సిరియా, ఇరాక్ ముఖ్యంగా అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా తన సేనలను వెనక్కు పిలిపించే ప్రయత్నాలు చేస్తుండడం కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు ఆ దేశాల్లో, ముఖ్యంగా ఇస్లామిక్ స్టేట్ అంతమైన తర్వాత తమకు పెద్దగా ప్రమాదం లేదని అది భావిస్తోంది.
అందుకే ఆయా దేశాలకు తీవ్రవాదంపై పోరాడ్డానికి అందించిన ఆర్థిక సాయంలో కూడా అమెరికా కోత పెడుతోంది.
అంటే అమెరికా 'తీవ్రవాదానికి వ్యతిరేకంగా యుద్ధం' అనే విధానం ఒక రకంగా ముగింపు దిశగా వెళ్తోంది.

ఫొటో సోర్స్, Reuters
ట్రంప్ పాలనలో దాడులు తక్కువే
అయితే ఒక విషయం చెప్పుకోవాలి. అధ్యక్షుడు ట్రంప్ తన వైపు నుంచి ఎలాంటి యుద్ధం ప్రారంభించలేదు. ఒబామా కూడా కొత్తగా ఏ యుద్ధం ప్రారంభించలేదు. కానీ ఆయన పాత యుద్ధాన్నే మరింత అటాకింగ్‌గా చేశారు. డ్రోన్స్ ఉపయోగించడం పెరిగింది, సామాన్యులు టార్గెట్ కావడం జరిగింది ఆయన పాలనలోనే,
అంటే ఒక విధంగా ట్విటర్, ప్రకటనలతో ట్రంప్ చాలా దూకుడుగా కనిపిస్తారనే మాట నిజమే. కానీ ఆయన పాలనలో విదేశాంగ విధానం మాత్రం అంత దూకుడుగా కనిపించలేదు.
కానీ ఒబామా, బుష్ పాలనలో ఉన్న దుందుడుకు విధానాన్నే ట్రంప్ కూడా కొనసాగించారు. ముఖ్యంగా ఇస్లామిక్ స్టేట్‌ను అంతం చేయాలనే లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. అమెరికా విదేశాంగ శాఖ 1990 నుంచి అంతర్జాతీయ తీవ్రవాద ఘటనలపై ఒక వార్షిక నివేదిక విడుదల చేస్తూ వస్తోంది. మనం దాన్ని చూస్తే 2000-2001 మధ్య ప్రపంచవ్యాప్తంగా 100-150 తీవ్రవాద దాడులు జరిగాయి.
కానీ అమెరికా, బ్రిటన్ ఇరాక్‌పై దాడి చేసిన తర్వాత మిలిటెంట్ దాడుల సంఖ్య 2004లో 70 వేల వరకూ చేరుకుంది. వీటిలో ఎక్కువ దాడులు ఇరాక్‌లోనే జరిగాయి.

ఫొటో సోర్స్, AFP/GETTY IMAGES
తీవ్రవాదం పెరిగింది అమెరికా వల్లే
అయితే ఒక విధంగా 9/11 తర్వాత అమెరికా తీసుకున్న చర్యలతో తీవ్రవాదం అంతం కావడానికి బదులు అది మరింత బలోపేతం అయ్యేలా చేసింది. ముఖ్యంగా పశ్చిమాసియా, ఇరాక్, సిరియా, అఫ్గానిస్తాన్‌లో అది మరింత పెరిగింది.
సోవియట్ యూనియన్ అఫ్గానిస్తాన్‌లో ఉన్నంతవరకూ ఎప్పుడూ ఆత్మాహుతి దాడులు జరగలేదు. సద్దాం హుస్సేన్ 20 ఏళ్లు ఇరాక్‌ను అణచివేశాడు. ఎప్పుడూ సూసైడ్ అటాక్స్ జరగలేదు. అమెరికా ఈ రెండు దేశాల్లోకి అడుగుపెట్టగానే, అవి ప్రారంభమయ్యాయి.
అయితే, తీవ్రవాదాన్ని బలోపేతం చేయడంలో అమెరికా పోషించిన ఆ పాత్రను ఇప్పటివరకూ అమెరికా విధాన నిర్ణేతలు ఒప్పుకోవడం లేదు. అందుకే వారి విధానాల గురించి వచ్చే అంచనాల్లో ఎప్పుడూ పొరపాట్లు జరుగుతుంటాయి.

ఫొటో సోర్స్, EPA
జిహాద్ కోసం సిద్ధం
అల్-ఖైదా, ఇస్లామిక్ స్టేట్ సమయంలో సమస్యలకు కారణమైనవి ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ముస్లిం దేశాల్లో భద్రతగానీ, ప్రజాస్వామ్యంగానీ, ఆర్థికాభివృద్ధిగానీ లేదు. సోషల్ మీడియా వల్ల ఆ దేశాల్లో, ప్రపంచంలోని మిగతా దేశాల్లో జీవితాల మధ్య ఉన్న తేడా అందరికీ కనిపిస్తోంది.
అయితే దీనివల్ల పుట్టుకొస్తున్న అసంతృప్తి, ఆగ్రహం, ద్వేషం అనేవి ఇప్పటికీ అలాగే ఉన్నాయి.
మయన్మార్‌లో రోహింగ్యా ముస్లింల అంశమైనా, చైనాలో వీగర్ ముస్లింల సమస్యైనా, కశ్మీర్ గురించి రకరకాల వార్తలు వస్తుంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు వాటిని చూసి తమపై వేధింపులు జరుగుతున్నాయని, తమకు ఎవరూ సాయం చేయడం లేదని అనుకుంటున్నారు.
వాటిని చూసి వచ్చే కోపం, అసంతృప్తి వారిలో జిహాదీ ఆలోచనా ధోరణిని ప్రేరేపిస్తోంది. జనం ఏ కారణంతో జిహాదీ కావాలని అనుకుంటున్నారో, ఆ సమస్యలు ఇప్పటికీ తగ్గడం లేదు.
కానీ, జిహాదీలతో పోరాడే సంస్థలు, దేశాల నైపుణ్యం పెరిగిందని కచ్చితంగా చెప్పచ్చు. వారికి అందే సమాచారం కూడా పెరిగింది. దానివల్ల వాళ్లు ముప్పు రాకముందే దానిని అదుపు చేయగలుగుతున్నారు. కానీ ఆ ప్రమాదాన్ని మాత్రం అంతం చేయలేకపోతున్నారు.
ఇవి కూడా చదవండి:
- ఐఎస్ తీవ్రవాదులు ఇప్పుడేం చేస్తున్నారు?
- ఐఎస్ తీవ్రవాదులు దోచుకున్న కళాఖండాలివి
- ఆ ఊరిలో ఏ ఇంట్లో చూసినా మిసైళ్ళే...
- పాకిస్తాన్లో లీటర్ పాలు రూ. 140.. పెట్రోలు కంటే ఎక్కువ ధర.. కారణమేంటి?
- PUBG ఆడనీయకుండా అడ్డుకున్నాడని తండ్రి తల నరికిన కొడుకు
- ఐఫోన్ 11: యాపిల్ కొత్త మోడల్ ఫోన్ ప్రారంభ ధర ఎంతో తెలుసా
- అమెరికా ఇతర దేశాల నుంచి ఎన్ని భూభాగాలను ఎంత ధరకు కొన్నదో తెలుసా...
- అంతరిక్షంలో అత్యధికంగా చెత్త నింపే దేశం ఏదో తెలుసా...
- అఫ్గానిస్తాన్ కరవు: యుద్ధం కంటే దుర్భిక్షంతోనే ఎక్కువ వలసలు
- నగర జీవితం మీ ఆరోగ్యం, సంతోషం మీద ఎలా ప్రభావం చూపుతోంది?
- కడుపులోని పసికందునూ కబళిస్తోన్న కాలుష్యం
- 6174: ఒక భారతీయ ఉపాధ్యాయుడు కనిపెట్టాడు.. డెబ్బై ఏళ్లుగా గణిత శాస్త్రజ్ఞులు ఆశ్చర్యపోతున్నారు
- కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత అమిత్ షా టార్గెట్ మావోయిస్టులేనా...
- ఆర్ఎఫ్ఐడీ: రోజువారీ జీవితాల్లో భాగమైపోయిన ప్రచ్ఛన్న యుద్ధ కాలపు స్పై టెక్నాలజీ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








