పాకిస్తాన్‌లో లీటర్ పాలు రూ. 140.. పెట్రోలు కంటే ఎక్కువ ధర.. కారణమేంటి?

ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తాన్‌లోని కరాచీలో లీటరు పాల ధర రూ.140కి పైగా పలుకుతోంది.
అంటే, భారత కరెన్సీలో దాదాపు రూ.64.
డిమాండ్ పెరగడంతో నగరంలో ఈ పరిస్థితి నెలకొన్నట్లు పాక్ వార్తా సంస్థలు పేర్కొంటున్నాయి.
నిజానికి కరాచీ కమిషన్ కార్యాలయం నిర్ణయించిన గరిష్ఠ ధర రూ.94 (భారత కరెన్సీలో రూ.43) మాత్రమే అని పాకిస్తాన్‌కు చెందిన 'డాన్' పత్రిక తెలిపింది. ధరను అంతకు మించి పెంచకూడదని నిబంధనలు ఉన్నట్లు వివరించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
కానీ, స్థానిక పాల ఉత్పత్తిదారులు దీనికి అంగీకరించడం లేదని పాకిస్తాన్‌కే చెందిన 'ద న్యూస్' వెబ్‌సైట్ వివరించింది.
కరాచీలో మూడు పాడి రైతు సంఘాలు పాలను సరఫరా చేస్తున్నాయని, ఇవన్నీ కలిసి మూకుమ్మడిగా గత జులైలో పాల హోల్‌సేల్ ధరను లీటర్‌కు రూ.85 నుంచి రూ.96కు పెంచాయని పేర్కొంది.
ఫలితంగా రిటైల్ మార్కెట్‌లో లీటర్ పాల రూ.110 దాటిందని, మోహర్రం పండుగ నేపథ్యంలో డిమాండ్ మరింత పెరగడంతో గరిష్ఠంగా రూ.150 వరకూ వెళ్లిందని పేర్కొంది.
దుకాణాలపై దాడులు చేసి, అధిక ధరలకు పాలను విక్రయిస్తున్నవారిపై చర్యలు తీసుకుంటున్నట్లు కరాచీ కమిషనర్ ఇఫ్తికార్ షాల్వానీ చెప్పారని 'ద న్యూస్' తెలిపింది. అయితే, ఎంతమందిపై చర్యలు తీసుకున్నారనే వివరాలు ఆయన వెల్లడించలేదని వివరించింది.

ఫొటో సోర్స్, Getty Images
ధర పెంపు వెనుకున్న కారణాలపై ప్రశ్నించినప్పుడు.. ''ధరను నిర్ణయించడానికి కమిషనర్ ఎవరు? మేం ఉత్పత్తి చేస్తున్నాం. మేమే ధర నిర్ణయించుకుంటాం'' అని ఓ పాడి సంఘం నేతలు సమాధానమిచ్చారని 'పాకిస్తాన్ టుడే' వెబ్‌సైట్ తెలిపింది.
మొహర్రం జరిగే నెలలో నగరంలో జరిగే మతపరమైన ర్యాలీల్లో పాల్గొనేవారికి పాలు, పళ్ల రసాలు, తాగు నీరు అందించే కేంద్రాలను స్థానికులు ఏర్పాటు చేస్తుంటారు. ఆ స్టాళ్లను సబీల్ అంటుంటారు. వీటి వల్ల పాలకు డిమాండ్ విపరీతంగా పెరిగింది.
''ఏటా సబీల్ పెడుతున్నాం. పాల ధర పెరిగినంత మాత్రాన ఈసారి ఊరుకోలేం కదా. అయితే, నేను జీవితంలో ఇలాంటి ధరలు ఎన్నడూ చూడలేదు'' అని షెహర్యార్ అలీ అనే స్థానికుడు చెప్పినట్లు ద న్యూస్ పేర్కొంది.
జఫారియా డిసాస్టర్ మేనేజ్‌మెంట్ సెల్ చీఫ్ జఫార్ అబ్బాస్ నగరంలో 100 సబీళ్లు ఏర్పాటు చేశారని, పాల ధరలు ఎక్కువగా పొండటంతో ఆయన పాల పొడిని తెప్పించారని వివరించింది.
కరాచీలో పాల డిమాండ్ రోజుకు 5 లక్షల లీటర్లు కాగా, 4 లక్షల లీటర్లు మాత్రమే ఉత్పత్తి అవుతోందని కరాచీ డైరీ, క్యాటిల్ ఫార్మర్స్ అసోసియేషన్ చీఫ్ షాకిర్ ఉమెర్ చెప్పినట్లు తెలిపింది.
ఇవి కూడా చదవండి:
- ‘పాకిస్తాన్‌లో మైనార్టీలకు రక్షణ లేదు.. భారత్‌లో ఉంటా.. ఆశ్రయం ఇవ్వండి’ - ఇమ్రాన్ ఖాన్ పార్టీ మాజీ ఎమ్మెల్యే అభ్యర్థన
- పాక్ పాలిత కశ్మీర్లో ఆందోళనలు, నిరసనకారులను అరెస్టు చేసిన పాక్ పోలీసులు
- పెరుగు తింటే వందేళ్లు జీవిస్తారా?
- వేరుసెనగ పప్పు తింటే చనిపోతారా?
- ఐఫోన్ 11: యాపిల్ కొత్త మోడల్ ఫోన్ ప్రారంభ ధర ఎంతో తెలుసా
- రియల్ లైఫ్ అపరిచితురాలు: ఒక్క మహిళలో 2500 మంది..మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్‌కు లోనైన జెనీ హెయిన్స్ కథ
- బ్యాంకు ఖాతాలో 90 లక్షలు వచ్చాయి.. డ్రా చేశారు, ఖర్చుపెట్టేశారు.. ఆ తర్వాత...
- 'పాకిస్తాన్‌లో ఇద్దరు హిందూ బాలికల కిడ్నాప్, మత మార్పిడి, పెళ్లి'
- చంద్రయాన్-2: సొంత మంత్రినే తిట్టిపోస్తున్న పాకిస్తానీలు
- పాకిస్తాన్ పర్యటనకు వెళ్లడానికి నిరాకరించిన 10 మంది శ్రీలంక క్రికెటర్లు
- చంద్రయాన్-2: విక్రమ్ ల్యాండర్‌తో సంబంధాలు ఇస్రోకు మళ్లీ సాధ్యమేనా
- వేలిముద్రలను సర్జరీతో మార్చవచ్చా.. పోలీసులనే ఆశ్చర్యపరిచిన వాస్తవాలు
- పాకిస్తాన్‌వన్నీ తప్పుడు ఆరోపణలు.. ఐరాస మానవ హక్కుల మండలిలో స్పష్టం చేసిన భారత్
- పాకిస్తాన్‌లో మార్పు వస్తుందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








