కృష్ణ కుమారి కోహ్లి: పాకిస్తాన్ సెనెటర్‌గా ఎన్నికైన హిందూ దళిత మహిళ

ఫొటో సోర్స్, FACEBOOK @AGHA.ARFATPATHAN.7
పాకిస్తాన్ పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో.. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ తరపున కృష్ణ కుమారి కోహ్లీ సెనెటర్‌గా ఎన్నికయ్యారు.
సింధ్ ప్రావిన్సు - పసమంద ప్రాంతంలోని హిందూ వర్గానికి చెందిన కృష్ణ కుమారి సాధించిన విజయం గురించి ఆమె బంధువులకు స్పష్టంగా తెలియటం లేదు.
అయితే, ఆమెకు చాలా పెద్ద పదవి వచ్చిందని, దీంతో ఆమె ఇస్లాబామాద్‌కు వెళ్తుందని మాత్రం వారు చెప్పగలుగుతున్నారు.
ముస్లిం దేశమైన పాకిస్తాన్‌లో ఒక హిందూ దళిత మహిళ సెనెటర్‌గా ఎంపిక కావటం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ సందర్భంగా ఆమె బీబీసీ ఉర్దూతో మాట్లాడుతూ.. సెనెటర్ అంటే ఏంటో కూడా తన తల్లిదండ్రులకు తెలియదని చెప్పారు. తన కుటుంబం, తమ వర్గం ప్రజలంతా చాలా ఆనందంగా ఉన్నారని, స్వీట్లు పంచుకుంటున్నారని తెలిపారు.

సెనెట్‌కు ఎంపిక కావటం పట్ల తన సంతోషాన్ని మాటల్లో చెప్పలేనని ఆమె భావోద్వేగంతో అన్నారు.
‘‘నేను ఇంకా నమ్మలేకపోతున్నా’’ అని ఆమె చెప్పారు. సెనెటర్‌గా ఎన్నికవుతానని కలలో కూడా అనుకోలేదని వెల్లడించారు.
సామాజిక సేవలో ఎంఎ చేసిన ఆమె పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేశారు.
అవకాశం వస్తే (సింధ్ ప్రావిన్సు) శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయాలని, తమ ప్రాంతంలోని పేద ప్రజల కోసం పాటుపడాలని రాజకీయాల్లోకి వచ్చేముందు అనుకున్నట్లు ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, TWITTER @KISHOOLAL
సింధ్ ప్రావిన్సులో హిందూ మైనార్టీలైన భిల్, కోహ్లీ, మేగవర్ తదితర కులాలకు చెందిన ప్రజలు చాలామంది ఉన్నారు. వీరిలో చాలామంది నిరక్షరాస్యులు, పేదలు.
పేదరికం కారణంగా చాలామంది తమ పిల్లల్ని, ముఖ్యంగా ఆడపిల్లల్ని ఉన్నత చదువులు చదివించేందుకు పట్టణాలకు పంపించరు.
ఈ నేపథ్యంలో తాను సెనెటర్‌గా ఈ ప్రాంతంలోని పేద ప్రజలు, మరీ ముఖ్యంగా మహిళల కోసం పనిచేయాలనుకుంటున్నట్లు కృష్ణ కుమారి తెలిపారు.
అయితే, పార్లమెంటులో చట్టాలు చేయటమే సెనెటర్ ప్రధాన విధి. సెనెట్ వేదికగా తనకు చాలాపెద్ద అవకాశం లభించిందని, తన విధులు తనకు తెలుసునని, అయితే.. ఈ వేదికను ఉపయోగించుకుని మహిళల విద్య, వైద్యం వంటి సమస్యలను పరిష్కరించగలనని ఆమె అన్నారు.
తమ వర్గానికి చెందిన 80 శాతం మంది ప్రజల మద్దతు తనకు ఉందని కృష్ణ కుమారి తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- భారత్‌ను ప్రశంసించిన పాకిస్తానీ యాంకర్
- పాకిస్తాన్‌పై ‘ట్రంప్ కార్డ్’తో భారత్‌కు మేలెంత?
- పాకిస్తాన్ శివాలయంపై స్పందించిన సుప్రీంకోర్టు
- పాకిస్తాన్‌లో మార్పు వస్తుందా?
- పాకిస్తాన్‌లో గోవా ఘుమఘుమలు
- 'ముస్లింలు పాకిస్తానీలు, ఉగ్రవాదులా?'
- పాకిస్తాన్‌లో ముస్లింలూ దీపావళి చేసుకుంటారు
- ‘పాకిస్తాన్ ఆందోళన’కు కారణమైన ఇస్రో 100వ స్వదేశీ శాటిలైట్ విశేషాలివే
- #గమ్యం: గేట్ స్కోరుతో మీకు తెలియని ఉపయోగాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








