అమెరికాలో కాల్పులు: టెక్సస్, ఒహాయోలలో 'జాతి విద్వేష దాడులు'... 29 మంది మృతి

ఎల్ పాసో నగరంలోని వాల్‌మార్ట్ వద్ద కాల్పుల ఘటన చూసి దుఃఖిస్తున్న మహిళ

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఎల్ పాసో నగరంలోని వాల్‌మార్ట్ వద్ద కాల్పుల ఘటన చూసి దుఃఖిస్తున్న మహిళ

అమెరికాలోని టెక్సస్ రాష్ట్రంలో భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం సూపర్ మార్కెట్ వద్ద జరిగిన కాల్పున ఘటనలో 20 మంది చనిపోయారు. ఇది జాతి విద్వేష దాడి అయి ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు.

అమెరికా-మెక్సికో సరిహద్దు సమీపంలోని ఎల్ పాసో నగరంలోని వాల్‌మార్ట్ వద్ద ఈ దాడి జరిగింది. దాడి జరిగిన ప్రదేశంలో 21 ఏళ్ళ శ్వేత జాతీయుడిని అదుపులోకి తీసుకున్నారు. డాలస్ ప్రాంతంలోని అలెన్ నగరానికి చెందిన ఆ యువకుడి పేరు పాట్రిక్ క్రూసియస్ అని అమెరికా మీడియా చెబుతోంది.

దాడికి ముందు అదే వ్యక్తి విసిరినట్లుగా భావిస్తున్న ఒక పత్రంలో శ్వేతజాతి ఆధిపత్య భావజాలంతో కూడిన వాక్యాలున్నాయి.

"టెక్సస్‌ మీదకు హిస్పానిక్‌ల దాడికి" ప్రతీకారంగా ఈ దాడి చేసినట్లు ఆ పత్రంలో పేర్కొన్నారు.

ఈ దాడిలో మరో 26 మంది తీవ్రంగా గాయపడ్డారని ఎల్ పాసో పోలీసులు తెలిపారు.

అనుమానితుడు

ఫొటో సోర్స్, AFP

టెక్సస్ చరిత్రలోనే ఇది భయానకమైనదని ఆ రాష్ట్ర గవర్నర్ గ్రెగ్ అబాట్ అన్నారు. కాల్పుల ఘటనను అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ పిరికిపంద చర్యగా అభివర్ణించారు.

అసాల్ట్ తరహా రైఫిల్ పట్టుకుని చెవులకు రక్షక కవచాలు ధరించిన ఓ యువకుడి చిత్రాలు సీసీ టీవీ కెమేరాల్లో రికార్డయ్యాయి.

తొలి కాల్పుల్లో మృతిచెందిన 20 మందిలో ముగ్గురు మెక్సికోవాసులున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు ఆండ్రూస్ మాన్యువల్ లోపెజ్ ఓబ్రడార్ ప్రకటించినట్లు రాయిటర్స్ వార్తాసంస్థ తెలిపింది.

అయితే, అమెరికా ప్రభుత్వ వర్గాలు కానీ, అధికార వర్గాలు కానీ మృతుల పేర్లు, వివరాలు ఇంతవరకు వెల్లడించలేదు.

ఈ ఘటన జరగానికి కొద్దిరోజుల ముందు కూడా కాలిఫోర్నియా ఫుడ్ ఫెస్టివల్ వద్ద ఇదే తరహాలో కాల్పులు జరగ్గా ఆ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. టెక్సాస్‌లో తాజా కాల్పులు నవ అమెరికా చరిత్రలోని 8 అత్యంత భీతావహ ఘటనల్లో ఒకటిగా చెబుతున్నారు.

స్థానిక పోలీసులు, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు ఈ ఘటనలపై విచారణ జరుపుతున్నారు.

టెక్సస్ కాల్పుల ఘటన జరిగిన కాసేపటికే ఒహాయో రాష్ట్రంలో మరో కాల్పుల ఘటన జరిగింది. ఈ ఘటనలో 9 మంది చనిపోయారు.

కియానా లాంగ్, ఆమె భర్త

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, కియానా లాంగ్, ఆమె భర్త

టెక్సస్‌ సిటీలో ఏం జరిగింది?

స్థానిక కాలమానం ప్రకారం శనివారం రాత్రి 10.39 గంటలకు ఓ షూటర్ కాల్పులు జరిగినట్లు సమాచారం అందిందని.. ఆ వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారని ఎల్ పాసో పోలీస్ చీఫ్ గ్రెగ్ అలెన్ తెలిపారు.

కాల్పులు జరిగే సమయానికి వాల్‌మార్ట్.. పిల్లల స్కూళ్లకు కావాల్సిన వస్తువులను కొనుగోలు చేస్తున్న వినియోగదారులతో కిటకిటలాడుతోంది.

ఇప్పటివరకు 21 ఏళ్ల యువకుడిని మాత్రమే అనుమానితుడిగా అదుపులోకి తీసుకున్నారని ఆయన తెలిపారు.

'నేను, నా భర్త షాపింగ్ చేస్తున్న సమయంలో కాల్పుల శబ్దం విన్నా'మని కియానా లాంగ్ అనే మహిళ తెలిపారు. వెంటనే అంతా తలోదిక్కు భయంతో పరుగులు తీశారని.. అక్కడో వ్యక్తి తుపాకీతో కాల్పులు జరుపుతున్నాడని అరుస్తూ ప్రాణభయంతో పారిపోవడానికి పరుగులు తీశారని ఆమె రాయిటర్స్ వార్తాసంస్థకు చెప్పారు.

తాను, తన భర్త కూడా ఓ స్టాక్ రూంలోంచి పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నామని చెప్పారు.

గ్లెండన్ ఓక్లే అనే మరో వ్యక్తి సీఎన్ఎన్‌తో మాట్లాడుతూ, 'నేను ఆ పక్కనే ఉన్న మరో మాల్‌లో క్రీడా వస్తువులు కొంటున్నాను. ఆ బాలుడు పరుగులు తీస్తూ నేనున్న మాల్‌లోకి వచ్చి వాల్‌మార్ట్‌లో కాల్పులు జరుగుతున్నాయ'ని చెప్పాడన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

ఆ బాలుడి మాటలను ఎవరూ పట్టించుకోలేదని, ఆ తరువాత నిమిషాల వ్యవధిలోనే తమకు కాల్పులు శబ్దాలు వినిపించాయని గ్లెండన్ చెప్పారు.

ఈ ఘటన నేపథ్యంలో వాల్‌మార్ట్ స్పందిస్తూ ఈ విషాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. విచారణాధికారులకు అన్ని విధాలా సహకరిస్తామని ప్రకటించింది.

కాల్పులు జరిగిన ప్రాంతం

ఫొటో సోర్స్, CBS

ఫొటో క్యాప్షన్, డేటన్‌లో కాల్పులు జరిగిన ప్రాంతం

ఒహాయోలో ఏం జరిగింది?

ఒహాయో రాష్ట్రంలోని డేటన్ పట్టణంలో ఉన్న ఓ బార్ బయట స్థానిక కాలమానం ప్రకారం రాత్రి ఒంటి గంట సమయంలో ఈ కాల్పులు జరిగినట్లు అమెరికా మీడియా వెల్లడించింది.

వెంటనే అక్కడికి చేరుకుని సాయుధుడిని కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు.

ఘటన జరిగిన వెంటనే అక్కడికి చేరుకుని తీవ్రత మరింత పెరగకుండా నిరోధించగలిగామని డేటన్ పోలీస్ శాఖ ట్వీట్ చేసింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

ఘటన జరిగిన ప్రదేశానికి సమీపంలో ఓ ర్యాప్ ప్రదర్శన వద్ద తాను ఉన్నప్పుడు వెంటనే అక్కడి నుంచి అంతా ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించడంతో విషయం తెలిసిందని జే విలియమ్స అనే వ్యక్తి 'బీబీసీ'తో చెప్పారు.

తాను వెంటనే అక్కడి నుంచి కారులో వెళ్లిపోయానని.. ఎటు చూసినా పోలీసులే ఉన్నారని, విచారణ కోసం ఎఫ్‌బీఐ అధికారులూ వచ్చారని తెలిపారు.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)