గుండె సమస్యలను గుర్తించే 'కృత్రిమ మేధ' వచ్చేస్తోంది

ఫొటో సోర్స్, SPL
కృత్రిమ మేధస్సు ద్వారా గుండె పనితీరును గుర్తించే కొత్త పద్ధతి వచ్చేస్తోంది.
గుండెకు సంబంధించి వచ్చే ఆట్రియల్ ఫిబ్రిలేషన్ (కర్ణిక దడ) వల్ల ఒక్క ఇంగ్లండ్‌లోనే 10 లక్షల మంది ప్రజలు బాధపడుతున్నారు.
గుండె సాధారణంగా కొట్టుకుంటున్నప్పుడు రోగ నిర్ధారణ చేయడం సులువైన పని. కానీ, గుండె సాధారణ స్థితిలో లేనప్పుడు రోగ నిర్ధారణ చేయడం చాలా కష్టం.
గుండె అసాధారణ స్థితిలో కొట్టుకుంటున్నప్పుడు దాన్ని గుర్తించే కంప్యూటర్ మోడలింగ్ పద్ధతిని అమెరికాలోని మయో క్లినిక్ ఆవిష్కరించింది.
అయితే, ఈ కొత్త పద్ధతి ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని, దీని ద్వారా గుండె సమస్యలను ముందుగానే చాలా సులువుగా నిర్ధారించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.
ఈ పరిశోధన వివరాలను ది లాన్సెంట్‌లో ప్రచురించారు.

ఫొటో సోర్స్, SPL
ఆట్రియల్ ఫిబ్రిలేషన్ (కర్ణిక దడ) లక్షణాలు
- గుండె వేగంగా కొట్టుకోవచ్చు (నిమిషానికి 100 స్పందనలకు పైగానే)
- త్వరగా అలసిపోవడం, ఊపిరి పీల్చడంలో ఇబ్బందులు, కొద్దిగా తలనొప్పి, ఛాతీనొప్పి తదితర లక్షణాలు కనిపిస్తాయి.
- కర్ణిక దడ వల్ల గుండె పనితీరు, సామర్థ్యం దెబ్బతింటుంది.
- దీనివల్ల రక్తపోటు రావడంతో పాటు, గుండె పనిచేయడం ఆగిపోతుంది.
- కర్ణిక దడ వచ్చినప్పుడు ఒక్కోసారి ఎలాంటి లక్షణాలూ కనిపించకపోవచ్చు.
ప్రస్తుతం ఉన్న ఎలక్ట్రోడయాగ్రామ్స్ పరీక్ష గుండె అసాధారణ పనితీరును గుర్తించడం లేదు. కానీ కంప్యూటర్ మోడలింగ్ పరీక్షతో దీన్ని సులభంగా గుర్తించే అవకాశం ఉంది.
1993 నుంచి 2017 మధ్యలో దాదాపు 1,81,000 మంది రోగులపై కంప్యూటర్ మోడలింగ్ విశ్లేషణ పరీక్షలు జరిగాయి.
వీరికి మొదట ఎలక్ట్రోడయాగ్రామ్స్ తదితర పరీక్షలు చేసినప్పుడు సాధారణ ఫలితాలే వచ్చాయి. రోగ నిర్ధారణ జరగలేదు.
కంప్యూటర్ మోడలింగ్ పరీక్ష, సాధారణ పరీక్షల కంటే 83శాతం కచ్చితత్వంతో రోగ నిర్ధారణను గుర్తించింది.
మయో క్లినిక్‌కు చెందిన డాక్టర్ పౌల్ ఇది వాస్తవ ఫలితాలను చూపెడుతోందని అన్నారు. రోగ నిర్ధారణకు దీన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించేందుకు మరింత పరీక్షించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
ఈ ఆవిష్కరణ చాలా కీలకమైందని షెఫీల్డ్ యూనివర్సిటీలోని హృద్రోగ నిపుణుడు ప్రొఫెసర్ టిమ్ చికో తెలిపారు.
''ఈ కృత్రిమ మేధ విప్లవాత్మకమైన పురోగతి. అయితే, ఈ పరిశోధన ఇంకా ప్రారంభ దశలోనే ఉందని గమనించాలి. ఫలితాలను గమనిస్తూ ఉండాలి. సాధారణ ప్రజలను పరీక్షించినప్పుడు అల్గారిథం ఎలా స్పందిస్తుందో చూడాలి'' అని ఆయన వివరించారు.
ఇవి కూడా చదవండి:
- కశ్మీర్ లోయ ఉద్రిక్తం: భారతదేశం క్లస్టర్ బాంబు ప్రయోగించిందని ఆరోపించిన పాకిస్తాన్
- కశ్మీర్ నుంచి తెలుగు విద్యార్థులు ఎందుకు వెనక్కి వస్తున్నారు?
- సౌదీ అరేబియా: మహిళలపై సడలించిన నిబంధనలను ఎలా అర్థం చేసుకోవాలి
- మీ ఎక్స్ మీ 'టైప్' కాదని బ్రేకప్ చెప్పారా... మరి కొత్త లవర్ సంగతేమిటి...
- మీ నగరం ఎంత వేడిగా ఉంది
- సంపూర్ణ సూర్య గ్రహణం అంతరిక్షం నుంచి చూస్తే ఎలా కనిపిస్తుందో తెలుసా...
- అరటి పళ్లపై జీఎస్టీ ఎంత? రెస్టారెంట్లలో తింటే దేనికి పన్ను కట్టాలి? దేనికి అక్కర్లేదు?
- పోలవరం పనుల రివర్స్ టెండరింగ్.. ఇంతకీ రివర్స్ టెండరింగ్ అంటే ఏమిటి
- అక్కడ గ్రహాంతర జీవులున్నాయా? అందుకే ఎవరూ రావద్దని అమెరికా హెచ్చరించిందా...
- రెండు వందల రూపాయల అప్పు తీర్చడానికి 30 ఏళ్ళ తరువాత ఇండియాకు వచ్చిన కెన్యా ఎంపీ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








