మీ నగరం ఎంత వేడిగా ఉంది?

ప్రపంచమంతా వేడెక్కుతోంది. 2019 జులై అత్యంత వేడైన నెలగా రికార్డులకెక్కేలా ఉంది. ఈ గ్లోబులో చూపించినట్లుగా భూమిపై దాదాపు ప్రతిచోటా జులై నెల ఉష్ణోగ్రతలు 1880-1900 మధ్య కాలంతో పోలిస్తే గత పదేళ్లలో ఎక్కువగా నమోదయ్యాయి.

1900 నుంచి ప్రపంచవ్యాప్త ఉష్ణోగ్రతల్లో మార్పులను మ్యాప్ చూపిస్తుంది.

వాతావరణంలో వచ్చే తీవ్ర మార్పులను, దాని దుష్ఫలితాలను అరికట్టేందుకు భూతాపం పెరుగుదలను 1.5 డిగ్రీలకు పరిమితం చేయాలని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. పారిశ్రామికీకరణకు ముందు అంటే 1850-1900 మధ్యకాలంలోని ఉష్ణోగ్రతలతో దీన్ని పోల్చి చూస్తున్నారు.

అప్పటి నుంచి భూమి ఉష్ణోగ్రత 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెరిగింది.

అదేమంత పెద్దగా అనిపించకపోవచ్చు, కానీ అన్ని దేశాలు దీన్ని నియంత్రించేందుకు ప్రయత్నించకపోతే మన ప్రపంచం వినాశకర మార్పులను చూడాల్సి వస్తుందని ఐపీసీసీ హెచ్చరిస్తోంది.

సముద్ర మట్టాలు పెరుగుతాయి, దీంతో లక్షలాది మంది ప్రజలు ఆవాసాలు కోల్పోతారు. కరవు, వేడిగాలులు, భారీ వర్షాలు, పంటలు పండించే సామర్ష్యం తగ్గడం వంటి తీవ్ర వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవాలి.

ప్రస్తుతమున్న వేగంతోనే భూతాపం కొనసాగితే , ఈ శతాబ్దం చివరి నాటికి ఉష్ణోగ్రతల్లో 3-5 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరుగుదల వస్తుంది.

మీ నగరంలో ఏయే ప్రాంతాలు ఇప్పటికే వేడెక్కాయో, ఇక ముందు ఏవి అలా అవుతాయో తెలుసుకోండి

ఈ కథనాన్ని చూసేందుకు దయచేసి మీ బ్రౌజర్‌ను అప్‌డేట్ చేసుకోండి

తెలుసుకోవడానికి కిందకి స్క్రోల్ చెయ్యండి.

దీన్ని కాస్త సరళంగా చేద్దాం. ఈ గీత ప్రతి నెలకు పదేళ్ల సగటును చూపిస్తుంది. కానీ 2100 నాటికి ఉష్ణోగ్రతలు ఎలా ఉండబోతున్నాయి?

అత్యుత్తమ పరిస్థితుల్లో2100 నాటికి అంచనా ఉష్ణోగ్రత

జనవరి: {{temp}}C ({{diff}} 1900 నుంచి)

జులై: {{temp}}C {{diff}} 1900 నుంచి

ఇది ఎలా జరగచ్చు?

గ్రీన్ హౌస్ వాయువు ఉద్గారాలు శతాబ్దం మొదట్లో తీవ్ర స్థాయికి చేరుతాయి. తర్వాత అవి వేగంగా తగ్గడం కనిపిస్తుంది. అది ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ పెరిగేలా చేస్తుంది.

మీడియం-తక్కువ స్థితి2100 నాటికి అంచనా ఉష్ణోగ్రత

జనవరి: {{temp}}C ({{diff}} 1900 నుంచి)

జులై: {{temp}}C {{diff}} 1900 నుంచి

ఇది ఎలా జరగచ్చు?

2040 నాటికి ఉద్గారాలు తీవ్ర స్థాయికి చేరి తర్వాత తగ్గుతాయి. ఈ సమయంలో పర్యావరణ మార్పులను నియంత్రించడానికి ఎన్నో రాజకీయ లక్ష్యాలు రూపొందిస్తారు.

మీడియం-అత్యధిక స్థితి2100 నాటికి అంచనా ఉష్ణోగ్రత

జనవరి: {{temp}}C ({{diff}} 1900 నుంచి)

జులై: {{temp}}C {{diff}} 1900 నుంచి

ఇది ఎలా జరగచ్చు?

ఇది కొంతవరకు మీడియం-తక్కువ స్థితిలాగే ఉంటుంది. కానీ గ్రీన్ హౌస్ వాయువులు 2080 వరకూ తగ్గడం అనేది మొదలవదు.

దారుణమైన స్థితి2100 నాటికి అంచనా ఉష్ణోగ్రత

జనవరి: {{temp}}C ({{diff}} 1900 నుంచి)

జులై: {{temp}}C {{diff}} 1900 నుంచి

ఇది ఎలా జరగచ్చు?

దారుణమైన ఈ స్థితిలో 21వ శతాబ్దం అంతటా ఉద్గారాలను తనిఖీ చేయకుండా ఉండడం కొనసాగుతుంది. ఇది 2100 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 3 నుంచి 5 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరిగేందుకు దారితీస్తుంది.

భవిష్యత్తు అంతా అనిశ్చితులు నిండి ఉంటాయి. వాస్తవికతకు దగ్గరగా ఉండే ఈ పరిస్థితులు ఆయా దేశాలు తీసుకునే చర్యలపై ఆధారపడి ఉంటాయి.

ఇది దేనికి దారితీస్తుంది?

గ్లోబుపై న్యూాయార్కు నగరం
న్యూయార్క్యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా

80 లక్షలకు పైగా జనాభా ఉన్న న్యూయార్క్ ప్రపంచంలోని అతిపెద్ద నగరాల్లో ఒకటి. కానీ తీరం నుంచి వరదలు, తుపాను ముంపులకు ఈ నగరం బలహీనంగా ఉంటుంది. 2012 అక్టోబర్ నుంచి నవంబర్ వరకు వచ్చిన శాండీ హరికేను అలాంటి వరదల్లో ఒకటి. శాండీ సబ్ వేలను, రోడ్ టన్నెళ్లను ముంచెత్తి మన్ హట్టన్లోకి ప్రవేశించింది. బ్లాకవుట్స్ కు కారణమై 50 మందికి పైగా మరణించేలా చేసింది.

పర్యావరణ మార్పులు మరిన్ని జలాలు ముంచెత్తేలా మరింత తీవ్రమైన హరికేన్లకు కారణమవుతుందని భావిస్తున్నారు. అది సముద్ర మట్టం పెరగడానికి కూడా కారణమవుతుంది. న్యూయార్క్ తీరప్రాంతంలో దాదాపు 1500 కిలోమీటర్ల తీరరేఖ ఉంది. ఇది వాతావరణ మార్పుల వల్ల వచ్చే ఇలాంటి ప్రభావాలకు నగరాన్ని బలహీనంగా మార్చింది. యూఎస్ ఎమర్జెన్సీ ఎజెన్సీ అంచనా ప్రకారం ఈ శతాబ్దం మధ్యనాటికి నగరంలో పావు భాగం-దాదాపు పది లక్షల మంది నివసించే ప్రాంతం వరద ముంపు ప్రాంతంలో ఉంటాయి.

గ్లోోబుపై అర్కిటిక్ ప్రాంతం
అర్కిటిక్

వాతావరణ మార్పుల ప్రభావానికి గురవుతున్న అత్యంత సున్నితమైన ప్రాంతం అర్కిటిక్. మిగతా ప్రపంచానికంటే ఇది రెట్టింపు వేగంతో వేడెక్కుతోంది. అందుకే భూతాపం ప్రభావాలను గమనించేందుకు దీనిని 'బొగ్గుగనిలో కానరీ పక్షి'లా చూస్తున్నారు.

ప్రపంచంలోని మిగతా ప్రాంతాల్లాగే అర్కిటిక్ లో కూడా గాలి, నీటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. కానీ అర్కిటిక్ మహాసముద్రం సముద్రపు మంచుతో కప్పి ఉంది. అది వేసవిలో కరిగి శీతాకాలంలో మళ్లీ గడ్డకడుతుంది. గత కొన్ని దశాబ్దాలుగా ఆ మంచు శీతాకాలంలో గడ్డకట్టేదానికంటే వేగంగా కరిగి, అది క్షీణించడానికి కారణమవుతోంది. ఇది మిగతా ప్రపంచంతో పోలిస్తే అర్కిటిక్ లో భారీ ఉష్ణోగ్రత మార్పులకు దోహదపడుతోంది.

గ్లోబుపై జకార్తా
జకార్తాఇండోనేసియా

ఇండోోనేసియా రాజధానిలో కోటి మంది నివసిస్తున్నారు. [వేగంగా మునిగిపోతున్న నగరాలలో ఇది ఒకటి]. నగరంలోని ఉత్తర భాగంలో కొన్ని ప్రాంతాలు ఏడాదికి 25 సెంటీమీటర్లు మునిగిపోతున్నాయి. భూగర్భ జలాలు అతిగా తోడేయడం వల్ల భూమి కుంగుతోంది. పర్యావరణ మార్పుల వల్ల సముద్ర మట్టం పెరుగుతోంది. ఈ నగరాన్ని కాపాడుకునేందుకు 40 బిలియన్ డాలర్ల వ్యయంతో 32 కిలోమీటర్ల ఒక సముద్రపు గోడ, 17 కృత్రిమ దీవులు నిర్మించారు.

కానీ ఇవి తాత్కాలిక చర్యలే అని నిపుణులు చెబుతున్నారు. 2050 నాటికి భూగర్భ జలాలను తోడేయడం పూర్తిగా ఆపేయాలని, రిజర్వాయర్ల నుంచి నగరానికి పైపుల ద్వారా నీటిని సరఫరా చేయాలని వాదన ఉంది. కానీ మిగతా తీర నగరాలలాగే సముద్రమట్టం పెరగడం దీనికి ఇప్పటికీ ఒక సవాలుగా నిలిచింది. వేడి పెరగడం వల్లే నీటిమట్టం పెరుగుతోంది. ధ్రువాల్లో మంచు కరగడం, వేడి పెరుగుతుండడం దీనికి కారణమవుతోంది.