INDvNZ భారత్ ఈ మ్యాచ్ గెలవాలంటే కనీసం ఎన్ని పరుగులు చేయాలి? ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయి?

ఫొటో సోర్స్, Getty Images
వర్షం కారణంగా భారత్, న్యూజీలాండ్ జట్ల మధ్య జరుగుతున్న ప్రపంచకప్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఆటకు అంతరాయం కలిగింది.
బ్రిటన్ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు వర్షం ప్రారంభమైంది. (భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6.30 గంటలు)
మూడు గంటలకు అంపైర్లు ఒకసారి పరిస్థితిని సమీక్షించి, ఆటను కొనసాగించాలా? వద్దా? అనేది నిర్ణయించాల్సి ఉండగా.. మూడు గంటలకు కూడా వర్షం పడుతూనే ఉండటంతో అంపైర్లు ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు.
అంపైర్లు నాలుగు గంటలకు తర్వాతి అప్‌డేట్ ఇవ్వాలనుకున్నారు. కానీ, అది కూడా సాధ్యం కాలేదు.
ఐదు గంటలకు కూడా సాధ్యం కాలేదు.
ఆరు గంటలకు (భారత కాలమానం ప్రకారం రాత్రి 10.30 గంటలకు) అంపైర్లు పరిస్థితిని సమీక్షించే అవకాశం ఉంది.
ఆట ఎన్ని ఓవర్లు కొనసాగవచ్చు?
సాయంత్రం నాలుగు గంటలలోపు తిరిగి ప్రారంభం అయితే కనుక మ్యాచ్ 50-50 ఓవర్లపాటు కొనసాగుతుంది.
సాయంత్రం 4 గంటల తర్వాత మ్యాచ్ ప్రారంభమైతే మాత్రం ఓవర్లను కుదిస్తారు.
మ్యాచ్‌లో ఈరోజే ఫలితం తేలాలంటే మాత్రం భారత్ కనీసం 20 ఓవర్లు ఆట ఆడాల్సి ఉంటుంది.
ఒకవేళ భారత జట్టు 20 ఓవర్లు మాత్రమే ఆట ఆడాల్సి వస్తే.. అప్పుడు 148 పరుగులు చేయాల్సి వస్తుంది. అంటే 120 బంతుల్లో 148 పరుగులు.
న్యూజీలాండ్ జట్టు తన ఇన్నింగ్స్‌లో 20 ఓవర్లు ముగిసేటప్పటికి 2 వికెట్ల నష్టానికి 73 పరుగులు మాత్రమే చేసింది.
వికెట్ నెమ్మదిగా ఉండటంతో బ్యాటింగ్ చేయడం కష్టంగా మారిందని విశ్లేషకులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయి?
రెండు గంటల పాటు ఆట నిలిచిపోతే మ్యాచ్ ఓవర్లను కుదిస్తారు.
అంటే, భారత కాలమానం ప్రకారం 8.30 వరకూ ఆట కొనసాగకపోతే అంపైర్లు ఓవర్లను కుదిస్తారు.
రాత్రి 8.30 తర్వాత కూడా వర్షం కొనసాగితే.. ఓవర్లను కుదించడంతో పాటు భారత్ చేయాల్సిన పరుగులను కూడా సవరిస్తారు.
మ్యాచ్ ఫలితం తేలాలంటే ఇరు జట్లు కనీసం 20 ఓవర్ల చొప్పున ఆడాల్సి ఉంటుంది.
న్యూజీలాండ్ ఇప్పటికే 20 ఓవర్ల ఆట ఆడేసినందున భారత్ కూడా కనీసం 20 ఓవర్లు ఆడాలి.
ఒకవేళ భారత జట్టు కనీసం 20 ఓవర్లు ఆడలేకపోతే మ్యాచ్ రేపు కొనసాగుతుంది. అంటే.. మ్యాచ్ ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచే కొనసాగుతుంది.
రిజర్వ్ డే రోజున కూడా వర్షం పడితే.. భారత జట్టు గ్రూప్ దశలో ఎక్కువ పాయింట్లు సాధించినందున ఫైనల్‌కు క్వాలిఫై అవుతుంది.
ఇవి కూడా చదవండి:
- Ind vs NZ Live: వర్షం కారణంగా నిలిచిన మ్యాచ్
- క్రికెట్ ప్రపంచ కప్ 44 ఏళ్ల చరిత్రలోని ఈ రికార్డు కొనసాగితే.. విజేత టీమిండియానే
- ప్రపంచ కప్ 2019: కోహ్లీ సేనపై అభిమానం వీరిని 17 దేశాలు దాటించింది
- రోహిత్ శర్మ ఆడితే.. మేం గెలిచినట్లే: విరాట్ కోహ్లీ
- జిమ్మీ నీషామ్: ప్రపంచకప్ మ్యాచ్లు ఆడుతూనే... డిగ్రీ పరీక్షలు రాస్తున్న ఆల్రౌండర్
- క్రికెట్ వరల్డ్ కప్ 2019: మాంచెస్టర్ నగరానికి భారత పత్తి పరిశ్రమతో చారిత్రక బంధం
- విరాట్ కోహ్లీ vs విలియమ్సన్: ప్రపంచకప్ అండర్ 19 సెమీ ఫైనల్లో ఏం జరిగింది?
- ప్రపంచ కప్ 2019: సెమీస్ ఆడకుండానే టీమిండియా ఫైనల్ చేరుకోవచ్చా
- చర్మం తెల్లగా అవటం కోసం వాడే క్రీములు ఎంత ప్రమాదకరమో తెలుసా?
- అలసిపోతున్నారా? పని చేయాలంటే విసుగొస్తోందా? ఇలా ఎందుకు జరుగుతుంది? పరిష్కారాలేమిటి?
- 124 డిగ్రీల ఉష్ణోగ్రతలో పనిచేయడం ఎంత కష్టమో వీరి కళ్లలోకి చూస్తే తెలుస్తుంది
- క్రికెట్ వరల్డ్కప్ కోసం ఐసీసీ ఇంగ్లాండ్నే ఎందుకు ఎంచుకుంది...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










