ఆస్ట్రేలియాvsవెస్టిండీస్: మిచెల్ స్టార్క్‌కు 5 వికెట్లు, వెస్టిండీస్‌పై 15 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా విజయం

ఫొటో సోర్స్, Getty Images
ప్రపంచకప్‌లో భాగంగా గురువారం ఆస్ట్రేలియా-వెస్టిండీస్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా వెస్టిండీస్‌పై 15 పరుగుల తేడాతో విజయం సాధించింది.
289 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 273 పరుగులే చేయగలిగింది.
చివరి ఓవర్లో 32 పరుగులు అవసరం కాగా, వెస్టిండీస్ 16 పరుగులు మాత్రమే చేయగలిగింది.
31 పరుగులకే ఓపెనర్లు అవుట్
బ్యాటింగ్ ప్రారంభించిన వెస్టిండీస్ ఐదు ఓవర్లలో 31 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది.
రెండో ఓవర్లో 7 పరుగుల దగ్గర ఓపెనర్ ఎవిన్ లూయిస్(1) పాట్ కమిన్స్ బౌలింగ్‌లో స్టీవ్ స్మిత్‌కు క్యాచ్ ఇవ్వగా, క్రిస్ గేల్(21) మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో ఎల్‌బిడబ్ల్యు అయ్యాడు.

ఫొటో సోర్స్, Getty Images
తర్వాత వికెట్ కీపర్ షాయ్ హోప్, నికొలస్ పూరన్ స్కోరును వందకు చేరువ చేశారు.
ఆడం జంపా వేసిన 20 ఓవర్లో పూరన్ కొట్టిన షాట్‌ను ఆరోన్ ఫించ్ అద్భుతంగా అందుకున్నాడు. అదే ఓవర్లో విండీస్ వంద పరుగులు పూర్తి చేసింది.
తర్వాత హెట్‌మెయర్, హోప్ స్కోరును ముందుకు నడిపించారు. 149 పరుగుల దగ్గర హెట్‌మెయర్(21) అవుటవడంతో ఈ భాగస్వామ్యానికి తెరపడింది.
రసెల్‌తో కలిసి స్కోరును 190 దగ్గరికి చేర్చిన హోప్(68) పాట్ కమిన్స్ బౌలింగ్‌లో ఉస్మాన్ ఖ్వాజాకు క్యాచ్ ఇచ్చాడు.

ఫొటో సోర్స్, Getty Images
మిచెల్ స్టార్క్‌కు 5 వికెట్లు
38వ ఓవర్లో స్కోరు 200 పరుగులకు చేరింది.
కానీ తర్వాత ఓవర్‌కే రసెల్(15) అవుట్ అయ్యాడు. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో మాక్స్‌వెల్‌కు క్యాచ్ ఇచ్చాడు.
చివరి 30 బంతుల్లో వెస్టిండీస్ 38 పరుగులు చేయాల్సివచ్చింది.
స్కోరు 252 దగ్గర ఉన్నప్పుడు బ్రాత్‌వైట్(16)ను మిచెల్ స్టార్క్ అవుట్ చేశాడు. అదే ఓవర్ చివరి బంతికి హోల్డర్(51) కూడా అవుట్ అవడంతో వెస్టిండీస్ కష్టాల్లో పడింది.
48వ ఓవర్లో 9వ వికెట్ పడింది. షెల్డన్ కొట్రెల్ మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

ఫొటో సోర్స్, Getty Images
చివరి ఓవర్లో వరుస ఫోర్లు
చివరి ఓవర్లో వెస్టిండీస్ విజయానికి 32 పరుగులు అవసరం అయ్యాయి.
యాష్లే నర్స్ చివరి నాలుగు బంతులకు వరసగా ఫోర్లు కొట్టినా అప్పటికే ఆలస్యం అయిపోయింది. మ్యాచ్ ఆస్ట్రేలియా సొంతమైంది.
ఓషానే థామస్(0), నర్స్(19) పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.
ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 5 వికెట్లు పడగొట్టాడు. పాట్ కమిన్స్ 2, ఆడం జంపాకు ఒక వికెట్ దక్కింది.

ఫొటో సోర్స్, Getty Images
తడబడి నిలబడిన ఆస్ట్రేలియా
టాస్ గెలిచిన వెస్టిండీస్ బౌలింగ్ ఎంచుకోవడంతో ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ చేసింది.
ఆస్ట్రేలియా 4 ఓవర్లకే ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది.
15 పరుగుల దగ్గర ఓపెనర్ ఆరోన్ ఫించ్(6) వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా, 4వ ఓవర్లో 26 పరుగుల దగ్గర ఓపెనర్ డేవిడ్ వార్నర్(3) వికెట్ పోగొట్టుకుంది.
తర్వాత ఏడు, ఎనిమిది ఓవర్లలో వరసగా రెండు వికెట్లు కోల్పోవడంతో ఆస్ట్రేలియాకు కోలుకోలేని దెబ్బ తగిలింది.

ఫొటో సోర్స్, Getty Images
స్మిత్, కౌల్టెర్ నైల్ 100 భాగస్వామ్యం
36 పరుగుల దగ్గర ఉస్మాన్ ఖ్వాజా(13) ఆండ్రీ రస్సెల్ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇస్తే, మాక్స్ వెల్(0) కూడా కాట్రెల్ బౌలింగ్‌లో కీపర్ చేతికి చిక్కాడు.
38 పరుగులకే 4 వికెట్లు కోల్పోయినా స్టీవ్ స్మిత్, స్టోయినిస్ కాసేపు విండీస్ బౌలర్లను ఎదుర్కున్నారు. కానీ 17వ ఓవర్లో స్టోయినిస్(19) అవుటవడంతో ఆస్ట్రేలియా ఐదో వికెట్ కోల్పోయింది.
తర్వాత అలెక్స్ కేరీతో కలిసిన స్మిత్ స్కోరును వంద పరుగులు దాటించాడు. 149 పరుగుల దగ్గర కేరీ(45) రసెల్ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు.
తర్వాత క్రీజులోకి వచ్చిన నాదన్ కౌల్టెర్ నీల్, స్టీవ్ స్మిత్ స్కోర్ బోర్డును పరిగెత్తించారు. ఇద్దరూ వంద పరుగుల భాగస్వామ్యం అందించారు.
జట్టు స్కోరు 249 ఉన్నప్పుడు ఒషానే థామస్ బౌలింగ్‌లో స్మిత్(73) కొట్టిన భారీ షాట్‌ను బౌండరీ లైన్ దగ్గర అడ్డుకున్న కోట్రెల్, అద్భుత క్యాచ్ అందుకోవడంతో ఈ భాగస్వామ్యానికి తెరపడింది.

ఫొటో సోర్స్, Getty Images
తర్వాత 92 పరుగులు చేసిన కౌల్టెర్ నైల్ 49వ ఓవర్లో 284 పరుగుల దగ్గర అవుట్ అయ్యాడు.
అదే ఓవర్ చివరి బంతికి మిచెల్ స్టార్క్ కూడా అవుటడంతో ఆస్ట్రేలియా 49 ఓవర్లో 288 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
వెస్టిండీస్ బౌలర్లలో కార్లోస్ బ్రాత్‌వైట్‌కు 3, థామస్, కోట్రెల్, రసెల్‌కు రెండేసి వికెట్లు, జాసన్ హోల్డర్‌కు ఒక వికెట్ దక్కింది.
ఇవి కూడా చదవండి:
- ఇండియాVsదక్షిణాఫ్రికా: రోహిత్ శర్మ సెంచరీ, 6 వికెట్ల తేడాతో భారత్ విజయం
- "ధోనీని చూడాలంటే ఇలాంటివి చేయడంలో తప్పులేదు"
- వరల్డ్ కప్‌లో 10 జట్లే ఉండటానికి బీసీసీఐ అత్యాశే కారణమా
- ఇమ్రాన్ ఖాన్ కొండచిలువ చర్మంతో చేసిన చెప్పులు వేసుకుంటారా
- ఆత్మకు శాంతి కలగాలని చనిపోయిన 17 ఏళ్ల తర్వాత అంత్యక్రియలు
- ఈవిడ షాపింగ్ బిల్లు రూ.140 కోట్లు..
- ప్రతాప్ చంద్ర సారంగి: సాధారణంగా కనిపించే ఈయన గతం వివాదాస్పదమే
- నా కార్టూన్లే నా ప్రాణాలు కాపాడాయి.. కొత్త జీవితాన్ని ఇచ్చాయి.. ఇదీ నా కథ
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








