గడ్డకట్టే చలిలో.. ఆమ్లెట్ ఎలా వేస్తున్నారో చూశారా?

ఫొటో సోర్స్, SOCIAL MEDIA
ఎముకలు కొరికే చలికి అమెరికాలోని పలు ప్రాంతాల్లో ప్రజలు వణికిపోతున్నారు. కొన్ని చోట్ల కనిష్ఠ ఉష్ణోగ్రతలు మైనస్ డీగ్రీల్లోకి పడిపోతున్నాయి. దాంతో, ప్రజలు ఇళ్లల్లోంచి బయటకు రాకుండా ఉంటే మంచిదని అధికారులు సూచిస్తున్నారు.
పలు ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యాలయాలకు, విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వందల సంఖ్యలో విమానాలను రద్దు చేశారు. రోడ్లపై మంచు పేరుకుపోవడంతో రాకపోకలకు ఆటంకం ఏర్పడుతోంది.

ఫొటో సోర్స్, Reuters
ఈ చలి వల్ల ఇళ్లు లేనివారు ఎక్కువగా ఇబ్బందిపడుతున్నారు. దాంతో వారికోసం నగరాల్లో అధికారులు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు.
అనేక మంది అనారోగ్యం బారిన పడుతుండటంతో ఆస్పత్రుల్లో అత్యవసర సేవల విభాగాలు ఏర్పాటు చేశారు. ఈ చలి ప్రభావంతో 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని అంచనా.

ఫొటో సోర్స్, Getty Images
దాదాపు 9 కోట్ల మంది ప్రజలు ఈ చలి ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నారు.
షికాగో, డెట్రాయిట్, మినియాపోలిస్, మిల్వాకీలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. మిన్నెసోటా రాష్ట్రంలోని కాటన్ టౌన్‌షిప్‌లో గురువారం అత్యల్పంగా మైనస్ 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. షికాగో నది గడ్డకట్టింది.
రైలు పట్టాల మీద పేరుకుపోయిన మంచును కరిగించేందుకు గ్యాస్‌తో మంట పెడుతున్నారు.
అయితే, తీవ్రమైన చలిలో అనేకమంది వణికిపోతుంటే.. కొందరు మాత్రం ఈ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- ‘మహిళలపై వారి కుటుంబ సభ్యులతోనే అత్యాచారం చేయించేవారు’
- అత్యాచారానికి గురైన ఓ అబ్బాయి కథ ఇది!
- ఈ నగరంలో అత్యాచారాలు సర్వ సాధారణం.. రేపిస్టుల్ని కొట్టి చంపటం కూడా
- నాగ్‌పూర్ అత్యాచారం: పాతికేళ్ల నా సర్వీసులో.. అంత క్రూరత్వాన్ని ఎప్పుడూ చూడలేదు
- అత్యాచారాల గురించి తల్లిదండ్రులు తమ పిల్లలకు ఏం చెబుతారు? ఎలా చెబుతారు?
- భార్యపై అత్యాచారం చేయించిన భర్త.. స్వలింగ సంపర్కురాలైనందుకు కక్ష
- పదేళ్లుగా కోమాలో ఉన్న మహిళ ప్రసవం... ఆస్పత్రి సిబ్బందికి డీఎన్ఏ పరీక్షలు
- మనం ‘రేప్ కల్చర్’ను పెంచి పోషిస్తున్నామా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









