ఇండోనేసియాలో సునామీ విధ్వంసం.. డ్రోన్‌లో చిత్రీకరించిన దృశ్యాలు

ఇండోనేసియాలో సునామీ

ఇండోనేసియాను శుక్రవారం కుదిపేసిన భూకంపం, ఆ తరువాత విరుచుకుపడిన సునామీ సృష్టించిన విధ్వంసలో వేలమంది మరణించారు.

వందలాది మంది ఆచూకీ తెలియకుండా పోయింది. సహాయక చర్యలు కొనసాగుతున్న కొద్దీ ప్రజలు భారీ సంఖ్యలో చనిపోయిన వాస్తవం వెలుగులోకి వస్తోంది.

వీడియో క్యాప్షన్, ఇండోనేసియాపై సునామీ విధ్వంసం

సులవేసి ద్వీపంలో 7.5 తీవ్రతతో వచ్చిన భూకంపం వల్ల పాలూ ప్రాంతాన్ని సునామీ ముంచెత్తింది. తీరంలోని నివాసాలు సునామీ విధ్వంసానికి తుడిచిపెట్టుకపోయాయి.

అనేక మంది తమ ఆప్తులను కోల్పోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. సునామీ తన భార్యను లాక్కెళ్లిపోయిందని, ఆమె ఆచూకీ ఇప్పటికీ దొరకడం లేదని పాలూకి చెందిన వ్యక్తి ఒకరు బీబీసీకి చెప్పారు.

సునామీ తర్వాత తన సోదరుడు కనిపించకుండా పోయారని ఓ యువతి బీబీసీకి తెలిపారు. రాత్రంతా వేచి చూసినా ఆచూకీ దొరకలేదు. అతని కోసం వెతుకుతూనే ఉంటాం అని చెప్పారు.

మరిన్ని వివరాలు పై వీడియోలో..

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)