ఆంధ్రప్రదేశ్: రూ. 2.56 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్, కేటాయింపులు ఇలా...

ఫొటో సోర్స్, AP govt
ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 2022-23 సంవత్సరానికి రూ. 2,56,256 కోట్లతో ఈ బడ్జెట్ రూపొందించారు.
ఇందులో రెవెన్యూ వ్యయం అంచనా రూ. 2,08,261 కోట్లు కాగా మూలధన వ్యయం అంచనా రూ. 47,996 కోట్లు.
రెవెన్యూ లోటు అంచనా రూ. 17,036 కోట్లు, ద్రవ్యలోటు రూ. 48,724 కోట్లు.

ఫొటో సోర్స్, AP Govt
కేటాయింపులు ఇలా
* వ్యవసాయం, మార్కెటింగ్, సహకార శాఖ: రూ. 11,387.69 కోట్లు
* డెయిరీ, యానిమల్ హజ్బెండరీ, ఫిషరీస్: రూ. 1568.83 కోట్లు
* బీసీ సంక్షేమం: రూ. 20,962.06 కోట్లు
* పర్యావరణ, అటవీ శాఖ: రూ. 685.36 కోట్లు
* ఉన్నత విద్య: రూ. 2,014.30 కోట్లు
* మాధ్యమిక విద్య: రూ. 27,706.66 కోట్లు
* విద్యుత్: రూ. 10,281.04 కోట్లు
* ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు: రూ. 10,201.60 కోట్లు
* పౌర సరఫరాలు: రూ. 3,719.24 కోట్లు
* ఫైనాన్స్: రూ. 58,583.61 కోట్లు
* జీఏడీ: రూ. 998.55 కోట్లు
* సచివాలయ వ్యవస్థ: రూ. 3,396.25 కోట్లు
* వైఎస్సార్ పెన్షన్ కానుక: రూ. 18 వేల కోట్లు
* వైఎస్సార్ రైతు భరోసా రూ. 3,900 కోట్లు
* ఎస్సీ సబ్ ప్లాన్: రూ. 18,518 కోట్లు
* ఎస్టీ సబ్ ప్లాన్: రూ. 6,145 కోట్లు

బడ్జెట్‌ను చూస్తుంటే ముందస్తు ఎన్నికలను కోరుకుంటున్నట్లుగా ఉంది: సోము వీర్రాజు
కాగా బడ్జెట్‌పై టీడీపీ, బీజేపీ నేతలు పెదవి విరుస్తున్నారు. బుగ్గన ప్రవేశపెట్టిన బడ్జెట్ పొంతన లేకుండా ఉందని, బడ్జెట్ అంచనాలు అంచనాకు కూడా అందడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యంగ్యంగా అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అప్పుల వివరాలూ బడ్జెట్‌లో చూపించాలని ఆయన డిమాండ్ చేశారు. పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు ఎందుకు కేటాయించలేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలోని ఏ జిల్లానూ ఈ బడ్జెట్ సంతృప్తిపరచలేదని సోము వీర్రాజు అన్నారు.
ఏపీ బడ్జెట్ చూస్తుంటే రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలను కోరుకుంటున్నట్లుగా అనిపిస్తోందని సోము వీర్రాజు అన్నారు.
ఇవి కూడా చదవండి:
- వ్లాదిమిర్ పుతిన్: ‘అమెరికా చేసిన అత్యంత దారుణమైన పొరపాటును ఆయుధంగా ఎలా మార్చుకున్నారు?’
- ఇమ్రాన్ ఖాన్ అమెరికాతో చెలగాటం ఆడుతున్నారా? ‘నా ఒంట్లో రక్తం ప్రవహిస్తున్నంత వరకూ..’ వ్యాఖ్యలు ఎందుకు?
- యుక్రెయిన్ అధ్యక్షుడి భార్య ఒలేనా జెలెన్స్కా: తెర వెనుక ఉండి భర్తని నడిపిస్తున్న ప్రథమ మహిళ
- రష్యా హెచ్చరిక: ‘ఆయిల్ పైప్‌లైన్ మూసేస్తాం.. క్రూడాయిల్ ధర బ్యారెల్ 300 డాలర్లు చేరుకుంటుంది’
- ఆళ్లగడ్డ పోలీసులు: ‘కేసులు పెరుగుతున్నాయని శాంతి పూజలు చేశారు, దోష నివారణకు గోమూత్రం చల్లారు’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









