జొవాద్ తుపాను: విశాఖకు 200 కి.మీ దూరంలో జొవాద్ తుపాను, శ్రీకాకుళం జిల్లాలో భారీ గాలులకు కొబ్బరిచెట్టు మీదపడి ఒకరు మృతి

ANI

ఫొటో సోర్స్, ANI

జొవాద్ తుపాను విశాఖకు తూర్పు ఆగ్నేయంగా సుమారు 210 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. గంటకు 6 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న తుపాన్ బలహీనపడుతోందని విశాఖ వాతావరణ కేంద్రం చెబుతోంది.

ఉత్తరాంధ్రలో 45-50 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ విభాగం అధికారులు చెబుతున్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

"శ్రీకాకుళంలో జిల్లా అంతటా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల గంటకు 50కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. శుక్రవారం నుంచి 79 సైక్లోన్ షెల్టర్లను తెరిచాం. ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక బృందాలు అప్రమత్తంగా ఉన్నాయి" అని శ్రీకాకుళం కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ శ్రీకేశ్ బి లత్కర్ తెలిపారు.

కొబ్బరి

ఫొటో సోర్స్, ugc

శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలంలో విషాదం

శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం ఉద్దానం గోపినాధపురంలో తుపాను గాలులకు కొబ్బరి చెట్టు విరిగి పడి ఇంటర్ విద్యార్థిని ఇందు మృతి చెందింది.

ఇంటి ముందు కొబ్బరి తోట వద్ద బాత్రూమ్ ఉండడంతో అక్కడికి వెళ్లింది. భారీ గాలులకు చెట్టు ఒక్కసారిగా కూలి ఆమె మీద పడింది. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

తుపాను తీవ్రత తగ్గేవరకు ప్రజలెవరూ ఇళ్లు విడిచి బయటకు రావద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు.

విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంలోని లోతట్టు ప్రాంతాల నుంచి 54,008 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారని, మూడు జిల్లాల్లో 11 ఎన్‌డీఆర్‌ఎఫ్, 5 ఎస్‌డీఆర్‌ఎఫ్, 6 కోస్టుగార్డ్, 10 మరీన్ పోలీసు బృందాలను మోహరించారని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

జొవాద్ తుపాను ఎదుర్కొనేందుకు ఈస్ట్ కోస్ట్ రైల్వేలోని వాల్తేరు డివిజన్ సిద్ధమైందని ఏఎన్ఐ పేర్కొంది.

"రాష్ట్ర ప్రభుత్వం, ఎస్‌డీఆర్ఎఫ్, ఎన్‌డీఆర్ఎఫ్, ఇతర ఏజెన్సీలతో సంప్రదింపులు జరుపుతున్నాం. మా సిబ్బంది పూర్తి సంసిద్ధతతో అప్రమత్తంగా ఉన్నారు" అని డివిజనల్ రైల్వే మేనేజర్ ఏకే సత్పతి తెలిపారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, ఒడిశాలోని తీర ప్రాంతాల్లో నిన్న సాయంత్రం నుంచి వర్షాలు పడుతున్నాయని భారత వాతావరణ విభాగం డీజీఎం మృత్యుంజయ్ మహాపాత్ర అంతకుముందు చెప్పారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 4

వీడియో క్యాప్షన్, తుపాను హెచ్చరికలకు అర్థమేంటి?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)