ఛత్తీస్‌గఢ్: దసరా ఊరేగింపులో భక్తులపైకి దూసుకెళ్లిన కారులో గంజాయి

- రచయిత, అలోక్ ప్రకాష్ పుతుల్,
- హోదా, బీబీసీ కోసం
ఛత్తీస్‌గఢ్‌లోని జష్‌పూర్ జిల్లాలో దుర్గామాత విగ్రహాన్ని నిమజ్జనం చేయడానికి ఊరేగింపుగా వెళుతున్న భక్తులపైకి.. వెనకవైపు నుంచి వేగంగా వచ్చిన కారు దూసుకెళ్లింది.
ఈ ఘటనలో ఇప్పటివరకు ఒకరు మరణించగా, మరో 15 మందికిపైగా తీవ్రగాయాలపాలయ్యారు. క్షతగాత్రులను రాయగఢ్‌లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
విగ్రహం నిమజ్జనానికి ఊరేగింపుగా వెళుతున్నప్పుడు ముందుగా కారు ఒక వ్యక్తిని ఢీకొట్టింది. కారు వెనుక జనం పరిగెత్తినప్పుడు కారు డ్రైవర్ వేగాన్ని పెంచాడని ప్రత్యక్ష సాక్షి బీబీసీతో చెప్పారు. అనంతరం 16 మందికి పైగా ఈ కారు ఢీకొట్టింది.
ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిలో వెనుక నుండి వస్తున్న కారు భక్తులను ఢీకొట్టి అలానే ముందుకు దూసుకుపోయినట్టు ఉంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఈ ఘటనపై ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ట్వీట్ చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని జష్‌పూర్ జిల్లాలో ఒక మతపరమైన ఊరేగింపులో ప్రమాదం జరగడం చాలా విచారకరమని తెలిపారు. ఈ ఘటనలో క్షతగాత్రులకు చికిత్స కోసం రాష్ట్ర ప్రభుత్వం పూర్తి ఏర్పాట్లు చేస్తుందని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఫొటో సోర్స్, CG Khabar
ఎవ్వరినీ విడిచిపెట్టం : సీఎం భూపేష్ బాఘెల్
నిందితులను వెంటనే అరెస్టు చేసి విచారణకు ఆదేశించామని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘెల్ చెప్పారు. జష్‌పూర్ సంఘటన చాలా బాధాకరమైనది, హృదయాన్ని కలచివేస్తుందని, నిందితులను వెంటనే అరెస్టు చేశామన్నారు. దోషులుగా తేలిన పోలీసు అధికారులపై కూడా ప్రాథమిక చర్యలు తీసుకున్నాము. దీనిపై విచారణకు ఆదేశించామని తెలిపారు. ఎవరినీ విడిచిపెట్టం. అందరికీ న్యాయం జరుగుతుంది. మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందామని ట్వీటర్‌లో పేర్కొన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
మృతుల కుటుంబాలకు యాభై లక్షల రూపాయలను ఎక్స్‌గ్రేషియాగా ముఖ్యమంత్రి ప్రకటించారు.

ఫొటో సోర్స్, CG Khabar
కారులో గంజాయి
ఈ సంఘటన తరువాత, కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులను అక్కడున్నవారు పట్టుకున్నారు. తరువాత వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు 26 ఏళ్ల శిశుపాల్ సాహు, 21 ఏళ్ల బబ్లూ విశ్వకర్మలను పోలీసులు విచారిస్తున్నారు. ఇద్దరూ మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలి నివాసితులని తెలిసింది.
మరోవైపు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ పాతల్‌గావ్ ప్రాంతంలోని ఒక ఏఎస్‌ఐని సస్పెండ్ చేశారు.
కారులో గంజాయిని గుర్తించినట్టు పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
ఈ ఘటనతో కోపోద్రక్తులైన కొందరు పఠల్‌గావ్ హైవేపై వాహనాలను అడ్డుకుని తమ నిరసన తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- దసరా స్పెషల్: అమలాపురం వీధుల్లో కత్తులు, కర్రల ప్రదర్శన... ఈ ఆచారం ఏనాటిది, ఎలా వచ్చింది?
- రైతుల ఆందోళన: సింఘు బోర్డర్లో బారికేడ్లకు వేలాడుతూ కనిపించిన శవం
- సావర్కర్ బ్రిటిష్ వారిని క్షమాభిక్ష కోరాలని గాంధీ చెప్పారా? - BBC Fact Check
- ఎంఎస్ ధోనీ సీఎస్కేను వదిలేస్తున్నారా? హర్షాభోగ్లేకు ధోనీ ఇచ్చిన సమాధానం ఏంటి?
- ఐపీఎల్ 2021 విన్నర్ సీఎస్కే: కోల్‌కతాను ఓడించి నాలుగోసారి టైటిల్ గెలిచిన చెన్నై
- బ్రిటన్ కన్సర్వేటివ్ ఎంపీ సర్ డేవిడ్ ఆమెస్ హత్య ఉగ్రవాద చర్యే - పోలీసులు
- ఆంధ్రప్రదేశ్: విద్యుత్ సంక్షోభం ముంచుకొస్తోందా, కరెంటు కోతలు ఇంకా పెరుగుతాయా?
- ఉత్తర కొరియాలో డ్రగ్స్, తీవ్రవాదం, ఆయుధ విక్రయాల గుట్టు విప్పిన ఒక సీక్రెట్ ఏజెంట్
- కోవిడ్-19: మా అమ్మను డాక్టర్లు గినియా పిగ్లా భావించి ప్రయోగాలు చేశారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)














