టోక్యో ఒలింపిక్స్‌: డిస్కస్ త్రో ఫైనల్స్‌లో ఆరో స్థానంలో నిలిచిన కమల్‌ప్రీత్ కౌర్

కమల్‌ప్రీత్ కౌర్

ఫొటో సోర్స్, Facebook/KirenRijuju

మహిళల డిస్కస్ త్రోలో ఆశాకిరణంలా నిలిచిన అథ్లెట్ కమల్‌ప్రీత్ కౌర్ ఫైనల్లో నిరాశపరిచారు. సోమవారం జరిగిన ఫైనల్ ఈవెంట్‌లో ఆమె ఆరో స్థానంలో నిలిచారు.

శనివారం నాడు జరిగిన ఈవెంట్‌లో సత్తా చాటడం ద్వారా డిస్కస్ త్రో ఫైనల్లోకి అడుగుపెట్టిన కమల్‌ప్రీత్ కౌర్ ఫైనల్ ఈవెంట్లో పూర్తిస్థాయి ప్రతిభ కనబరచలేకపోయారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

ఉత్కంఠభరితంగా ఫైనల్

తొలి రౌండ్ నుంచి ఫైనల్ ఈవెంట్ ఉత్కంఠభరితంగానే సాగింది. మొదటి రౌండ్‌లో 61.62 మీటర్ల దూరం విసిరిన కమల్ ప్రీత్ ఆరో స్థానంలో నిలిచారు.

తొలి రౌండ్‌లో అమెరికాకు చెందిన వి.అల్‌మాన్ 68.98 మీటర్ల దూరం విసిరి టాప్‌లో నిలవగా, క్యూబాకు చెందిన వై.పెరెజ్ 65.72 మీటర్ల దూరం విసరగలిగారు. పోర్చుగల్‌కు చెందిన ఎల్.కా 63.93 మీటర్ల దూరం విసిరి మూడో స్థానంలో నిలిచారు.

మొదటి ప్రయత్నంలో ఆరో స్థానంలో నిలిచిన కమల్ ప్రీత్ కౌర్, రెండో రౌండ్‌కు వచ్చే సరికి తడబడ్డారు. డిస్క్‌ను విసురుతున్న సమయంలో ఆమె ఫౌల్ అయ్యారు.

మిగిలిన అథ్లెట్లు తమ స్కోరును మెరుగు పరుచుకోవడంతో కమల్ ప్రీత్ వెనకబడ్డారు. సరిగ్గా అదే సమయంలో భారీ వర్షం కురవడంతో మ్యాచ్‌కు కాసేపు అంతరాయం ఏర్పడింది. వర్షం తెరిపినివ్వడంతో మూడో రౌండ్ మొదలైంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

మూడో రౌండ్‌లో కమల్ ప్రీత్ 63.70 మీటర్ల దూరం విసిరి తిరిగి ఆరో స్థానానికి చేరుకున్నారు. అయితే నాలుగో రౌండ్‌లో మళ్లీ ఆమె స్కోరు 61.37కు పడిపోవడంతో ఆమె స్థానం కూడా దిగజారింది. రెండు, నాలుగు, ఆరు రౌండ్లలో కూడా కమల్‌ప్రీత్ ఫౌల్ కావడంతో అప్పటి వరకు ఆమె సాధించిన 63.70 మీటర్ల అత్యధిక స్కోరే బెస్ట్‌‌గా మిగిలింది.

ఫైనల్ ఈవెంట్‌‌లో అమెరికాకు చెందిన అల్‌మాన్ వలరీ (68.98 మీ.)తో గోల్డ్ సాధించగా, జర్మనీకి చెందిన పుడెనెజ్ క్రిస్టీన్ (66.86 మీ)తో రెండో స్థానంలో నిలిచారు. క్యూబాకు చెందిన పెరెజ్ యామీ(65.72 మీ.) మూడో స్థానంలో నిలిచారు.

కమల్‌ప్రీత్ కౌర్

ఫొటో సోర్స్, Getty Images

ఒలింపిక్స్‌కు వెళ్లకముందు బీబీసీ కరస్పాండెంట్ వందన కమల్‌ప్రీత్‌‌తో మాట్లాడారు. ఆ ఇంటర్వ్యూ విశేషాలు.

వందన:మీ మనసులో ఏముంది?

కమల్‌ప్రీత్‌: ఒలింపిక్స్‌లో పతకం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నా. నా ఆటతీరును కూడా మెరుగు పరచుకోవాలి. మిగతాది దేవుడికే వదిలేస్తున్నా.

వందన:నేటి యువతలో చాలా మందికి క్రికెట్ గురించి తెలుసు. కానీ డిస్కస్ త్రో గురించి మాత్రం చాలా కొద్ది మందికే తెలుసు. దీని గురించి యువతకు ఏమైనా చెప్పాలని అనుకుంటున్నారా?

కమల్‌ప్రీత్‌: దాదాపు అందరికీ క్రికెట్ గురించి తెలుసు. కానీ డిస్కస్ త్రో గురించి చాలా మందికి తెలియదు. నేను పతకాలు సాధించినప్పుడు కొందరు ఫోన్‌చేసి మరీ అభినందనలు చెబుతాయి.

అయితే, డిస్కస్ త్రో అంటే ఏమిటి అని అడుతుంటారు. దాన్ని నువ్వు ఎలా విసురుతున్నావ్ అని అడుగుతారు. దీని గురించి తెలుసుకోవడం చాలా తేలిక. ఒక చక్రాన్ని వీలైనంత దూరం విసరడమే.

కమల్‌ప్రీత్ కౌర్

ఫొటో సోర్స్, Getty Images

వందన:మీకు క్రికెట్ అంటే ఇష్టమని, మీరు క్రికెట్ కూడా ఆడాలని అనుకున్నారని విన్నాను. అది నిజమేనా?

కమల్‌ప్రీత్‌: అవును. నాకు సమయం దొరికినప్పుడు క్రికెట్ ఆడతాను. నిజంగా నాకు క్రికెట్ ఒక ప్యాషన్‌ లాంటిది. ఎప్పుడు సమయం దొరికినా, ఆడేందుకు ప్రయత్నిస్తుంటా.

వందన:స్పోర్ట్స్‌లో పురుషులతో పోలిస్తే, మహిళలకు ఎక్కువ సవాళ్లు ఎదురవుతుంటాయి. మీకు అలాంటి సవాళ్లు ఏమైనా ఎదురయ్యాయా?

కమల్‌ప్రీత్‌: అమ్మాయిలకు పెళ్లి చేయడం గురించే అందరూ ఆలోచిస్తుంటారు. డిగ్రీ పూర్తయిన వెంటనే పెళ్లి చేసేయాలని అనుకుంటారు. స్పోర్ట్స్ వద్దని చెబుతారు. ఇంటి పనులు చేసుకోవాలని సూచిస్తారు. ‘‘స్పోర్ట్స్ వల్ల నీకు ఏం వస్తుంది?’’అని అడుగుతారు. నా జీవితంలోనూ ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయి.

కమల్‌ప్రీత్ కౌర్

వందన:మీరు మారుమూల గ్రామం నుంచి వచ్చారు. మీకు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి?

కమల్‌ప్రీత్‌: మా కుటుంబ సభ్యుల్ని ఒప్పించడమే అన్నింటికంటే పెద్ద సవాల్. చదువుపైనే దృష్టిపెట్టమని వారు చెప్పేవారు. కానీ నేను పట్టుబట్టేదాన్ని. దీంతో స్పోర్ట్స్‌లో కొనసాగేందుకు వారు అనుమతించారు.

మా ప్రాంతంలో ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌ల గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. నాకు శిక్షణ ఎక్కడ దొరుకుతుందో తెలుసుకోవడానికి కొంత సమయం పట్టింది. నాకు ముందే, ఇలాంటి ఇన్‌స్టిట్యూట్‌ల గురించి తెలుసుంటే, నేను 2016లోనే ఒలింపిక్స్‌కు వెళ్లుండేదాన్ని.

Please wait...

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)