టోక్యో ఒలింపిక్స్: భారత ఆర్చర్ దీపికా కుమారికి నిరాశ

ఫొటో సోర్స్, Getty Images
భారత మహిళా ఆర్చర్ దీపికా కుమారి క్వార్టర్ ఫైనల్స్‌లో వెనుతిరిగారు. ఆమె టోక్యో ఒలింపిక్స్లో తప్పకుండా పతకం సాధిస్తారని క్రీడాభిమానులు ఆశలు పెట్టుకున్నారు. కానీ, ఆ ఆశలు ఫలించలేదు.
దక్షిణ కొరియా ఆర్చర్ ఆన్ శాన్ దీపికా కుమారిపై వరుసగా మూడు సెట్లలో ఆధిపత్యం ప్రదర్శించి 6-0తో విజయం సాధించారు. దీంతో దీపిక పతకం ఆశలకు తెరపడింది.
బుధవారం జరిగిన 1/32 ఎలిమినేషన్ రౌండ్‌లో ఆమె భూటాన్‌కు చెందిన భూ కర్మాపై 6-0 తో విజయం సాధించిన దీపిక ఆ తర్వాత అమెరికాకు చెందిన జెన్నిఫర్ ముసినో - ఫెర్నాండెజ్‌ను కూడా 6-4 తేడాతో ఓడించారు.
దీపికా, ప్రీ క్వార్టర్ ఫైనల్స్‌లో స్థానం సంపాదించుకున్నారు.
పిక కేవలం 18 ఏళ్లకే వరల్డ్ నంబర్ వన్ ఆర్చర్ అయ్యారు. ఇప్పటివరకు ఎన్నో ప్రపంచకప్ పోటీల్లో పాల్గొన్న ఆమె 9 స్వర్ణ, 12 రజత, ఏడు కాంస్య పతకాలు గెలిచారు.
ఇప్పుడు ఎంతోకాలం నుంచి ఊరిస్తున్న ఒలింపిక్ పతకంపై కన్నేశారు.
టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న భారత ఆర్చర్ల జట్టులో ఒకే ఒక మహిళా ఆర్చర్ దీపికా కుమారి.

ఫొటో సోర్స్, DIWAKAR PRASAD/HINDUSTAN TIMES VIA GETTY IMAGES
నిరుపేద కుటుంబంలో పుట్టి
జార్ఖండ్‌లో పేద కుటుంబంలో పుట్టిన దీపికకు 27 ఏళ్లు. ఆమె గత 14 ఏళ్లలో టాప్ ఆర్చర్‌గా ఎదగడానికి ఎంతో కష్టపడ్డారు.
విలువిద్య నేర్చుకోవడం కోసం ఇల్లు వదిలిన దీపిక, తను ఇంట్లో లేకుంటే కుటుంబంపై భారం తగ్గుతుందనే ఎక్కువ సంతోషించారు.
కానీ ఆర్చరీలో వరుస విజయాలతో దీపిక ఇప్పుడు తన కుటుంబ ఆర్థిక, సామాజిక స్థాయిని ఎంతో ఎత్తుకు తీసుకెళ్లారు.
దీపిక తండ్రి ఆటో డ్రైవర్
దీపిక తండ్రి నారాయణ మహతో ఆటో నడిపేవారు. తల్లి గీత ఒక మెడికల్ కాలేజీలో గ్రూప్ డీ ఉద్యోగి.
ఒలింపిక్ సమాఖ్య రూపొందించిన ఒక షార్ట్ ఫిల్మ్‌లో దీపికా కుమారి ప్రయాణంలో ఎదురైన సవాళ్ల గురించి దీపిక, ఆమె తల్లిదండ్రులు చెప్పారు.
"దీపిక పుట్టినపుడు మా ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉంది. మేం చాలా పేదవాళ్లం. నా భార్య రూ.500 జీతానికి పనిచేస్తోంది. నేను ఒక చిన్న షాపు నడుపుతున్నా" అని ఆమె తండ్రి చెప్పారు.
తల్లిని ప్రసవం కోసం ఆటోలో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా దారి మధ్యలోనే తాను పుట్టానని దీపిక ఆ ఫిల్మ్‌లో చెప్పారు.
దీపిక ఒలింపిక్ క్రీడలకు ఎంపికయినప్పుడు కూడా ఆమె కుటుంబ ఆర్థిక పరిస్థితి అలాగే ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
14 ఏళ్ల వయసులో విల్లు ఎక్కు పెట్టిన దీపిక
జీవితంలో చాలా విషయాలు అనుకోకుండా జరిగిపోతాయని అంటారు. 14 ఏళ్ల వయసులో మొదటిసారి విల్లు ఎక్కుపెట్టింది దీపిక.
ఆమె ఆర్చరీ ప్రపంచంలోకి అడుగుపెట్టడం కూడా అనుకోకుండానే జరిగింది.
ఆమె మొదట్లో వెదురు విల్లు, బాణాలతో ఆడుకునేవారు.
"నాకు బాణాలు వేయడం ఎంత ఇష్టమంటే, నేను ఆ క్రీడను ఎంచుకోవడం కాదు, అదే నన్ను ఎంచుకుంది" అని దీపిక చెప్పారు.
ఆర్చరీ ప్రపంచంలో తన ఎంట్రీ గురించి మాట్లాడుతూ "2007లో మా అమ్మమ్మ ఇంటికి వెళ్లినపుడు అక్కడ మా కజిన్ తమ ఊళ్లో ఉన్న అర్జున్ ఆర్చరీ అకాడమీ గురించి చెప్పింది. అక్కడ అన్నీ ఫ్రీ అని చెప్పింది. కిట్ కూడా ఫ్రీగా ఇస్తారని, భోజనం కూడా పెడతారని అంది. దాంతో, నేను దీన్లో చేరితే, మా ఇంట్లో నా భారం తగ్గుతుంది అనుకున్నా. ఎందుకంటే అప్పట్లో మా ఆర్థిక పరిస్థితి చాలా ఘోరంగా ఉండేది" అని దీపిక చెప్పారు.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది, 1
కానీ, అకాడమీలో చేరాలనే తన కోరికను తండ్రికి చెప్పిన దీపికకు మొదట నిరాశే ఎదురైంది.
ఆర్చరీ నేర్చుకోడానికి వెళ్లనా అని నేను మా నాన్నను అడిగినప్పుడు ఆయన మొదట ఒప్పుకోలేదు. మన సమాజంలో ఆడపిల్లలను ఇంటికి అంత దూరం పంపించడం మంచిది కాదంటారని చెప్పారు. చిన్నపిల్లని 200 కిలోమీటర్లు దూరంగా పంపిస్తే, జనం ఏమనుకుంటారు. అరే, వాళ్లు బిడ్డ కడుపు కూడా నింపలేకపోయారు, అందుకే పంపించేశారు అంటారు" అన్నారని దీపిక చెప్పారు.
కానీ, దీపిక చివరకు రాంచీకి దాదాపు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖర్‌సావా ఆర్చరీ అకాడమీ వరకూ చేరుకోగలిగారు.
కానీ, అసలు సవాళ్లు అప్పుడే మొదలయ్యాయి. అకాడమీలో ఆమెను మొదట తీసుకోలేమని చెప్పేశారు. ఎందుకంటే దీపిక అప్పుడు చాలా బక్కగా ఉండేవారు. దాంతో దీపిక తనను తాను నిరూపించుకోడానికి అకాడమీని 3 నెలల సమయం అడిగారు.
"నేను మొదట్లో చాలా టెన్షన్ పడిపోయేదాన్ని. అంతా కొత్త కొత్తగా ఉండేది. కానీ కొంతకాలం తర్వాత నాకు చాలా రకాల ఇబ్బందులు ఎదురయ్యాయి. అకాడమీలో బాత్రూం ఉండేది కాదు. స్నానం కోసం నది దగ్గరకు వెళ్లాల్సొచ్చేది. రాత్రి ఎనుగులు తిరిగేవి. అందుకే రాత్రి బాత్రూంకు బయటికి పంపేవారు కాదు. కానీ, మెల్లమెల్లగా విలువిద్య ఆస్వాదిస్తున్నకొద్దీ నాకు అవన్నీ చిన్న సమస్యలుగా అయిపోయాయి. నాకు విల్లు త్వరగానే ఇచ్చారు, వెంటనే షూట్ చేయడం కూడా మొదలెట్టాను. అలా చిన్నగా ఆసక్తి పెరిగింది. తర్వాత విలువిద్య అంటే ఇష్టంగా మారింది" అన్నారు.

ఫొటో సోర్స్, TWITTER@IMDEEPIKAK
దీపికకు ద్రోణాచార్యుడు దొరికాడు
దీపిక మొదట జిల్లా స్థాయి పోటీలతో పాటు మరెన్నో పోటీల్లో పాల్గొన్నారు. కొన్ని పోటీల్లో బహుమతి రూ.100, రూ.250, రూ.500 ఉండేది. కానీ దీపిక వాటికి కూడా చాలా ప్రాధాన్యం ఇచ్చేవారు.
2008లో జూనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్ ట్రయల్స్ జరుగుతున్నప్పుడు దీపిక ధర్మేంద్ర తివారీని కలిశారు. ఆయన టాటా ఆర్చరీ అకాడమీ కోచ్.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది, 2
"ధర్మేంద్ర సర్ నన్ను సెలక్ట్ చేశారు. నన్ను ఖర్‌సావా నుంచి టాటా ఆర్చరీ అకాడమీకి తీసుకెళ్లారు. అది నాకు ఎంత బాగా నచ్చిందంటే, అక్కడకు వెళ్లగానే, దేవుడా నన్ను జీవితాంతం ఇక్కడే ఉండనివ్వు అని ప్రార్థించా. నా కోరిక నెరవేరింది కూడా" అని దీపిక చెప్పారు.
ధర్మేంద్ర తివారీ ప్రస్తుతం దీపికకు కోచ్‌గా ఉన్నారు. ప్రపంచ నంబర్ వన్ ఆర్చర్ అయిన దీపికకు మొదట్లో ఆ ర్యాంక్ ఏంటో కూడా తెలీదు.
2012లో ప్రపంచ నంబర్ వన్ ఆర్చర్ అయినప్పుడు వరల్డ్ ర్యాంకింగ్‌లో నంబర్ వన్ అంటే ఏంటో కూడా తనకు తెలీదని దీపిక ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. తర్వాత తన కోచ్‌ను దాని గురించి అడిగి తన ర్యాంక్ గురించి తెలుసుకున్నారు.

ఒలింపిక్ పతకం కల నెరవేరేనా
కానీ ఆ తర్వాత 2012 లండన్ ఒలింపిక్స్‌లో బ్రిటన్ క్రీడాకారిణి ఎమీ ఓలివర్ చేతిలో 6-2తో ఓడిపోయినప్పుడు దీపిక జీవితంలో మొదటి షాక్ తిన్నారు.
అది తన జీవితంలోనే అత్యంత ఒత్తిడికి గురైన క్షణం అని దీపిక చెప్పారు. మ్యాచ్ తర్వాత ఆమె అప్పుడు బీబీసీతో మాట్లాడారు.
"ఈ మ్యాచ్‌లో గాలి చాలా వేగంగా వీస్తోంది. నాకు మొదటిసారి ఇలాంటి గాలి గురించి తెలిసింది. గాలి నన్ను చాలా కన్‌ఫ్యూజ్ చేసింది. నేను ఆ గాలి వాటం అర్థం చేసుకునేలోపే మ్యాచ్ ముగిసింది" అన్నారు.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది, 3
వరల్డ్ నంబర్ వన్ అవడం వల్ల ఏదైనా ఒత్తిడి ఉందా అని అడిగినప్పుడు "లేదు ఆ రెండూ వేరు వేరు. నేను ఎన్నో గేమ్స్ ఆడి వరల్డ్ నంబర్ వన్ అయ్యాను. కానీ ఒలింపిక్‌లో పోటీపడడం చాలా ప్రత్యేకం. మీరు లోపలికెళ్లి ఆటగాళ్లు ఎలా బాణాలు సంధిస్తారో చూడండి. నేను కూడా మొదటిసారి దీనిని ఎదుర్కుంటున్నా. ఇది నా మొదటి ఒలింపిక్స్. నాపై ఎలాంటి ఒత్తిడి లేదు. మెరుగైన ప్రదర్శన ఇవ్వాలనుకున్నా అంతే" అన్నారు.
అయితే, తర్వాత ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఒలింపిక్స్ సమయంలో తాను చాలా ఒత్తిడికి గురయినట్లు ఆమె ఒప్పుకున్నారు. తన ఆరోగ్యం కూడా పాడైందని చెప్పారు.
ఆ తర్వాత 2016 ఒలింపిక్ క్రీడల్లో కూడా దీపిక పతకం ఆశలు నెరవేరలేదు. ఇప్పుడు దీపిక మూడోసారి ఒలింపిక్స్ బరిలో నిలిచారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
2012లోలాగే ఇప్పుడు కూడా ఆమె సరిగ్గా ఒలింపిక్స్‌కు ముందు వరల్డ్ నంబర్ 1 ఆర్చర్‌గా ఉన్నారు.
దీపికా కుమారి గత ఏడాది ప్యారిస్‌లో జరిగిన ఆర్చరీ ప్రపంచ కప్ (స్టేజ్ 3) పోటీల్లో మూడు స్వర్ణ పతకాలు సాధించి వరల్డ్ ర్యాంకింగ్‌లో మొదటి స్థానంలో నిలిచారు.
దీపిక మహిళల వ్యక్తిగత రికర్వ్ పోటీ ఫైనల్ రౌండ్‌లో రష్యా క్రీడాకారిణి ఎలెనా ఒసిపోవాను 6-0తో ఓడించి మూడో గెల్డ్ మెడల్ గెలుచుకున్నారు.
దానికి ముందు మిక్స్‌డ్ రౌండ్, మహిళా టీమ్ రికర్వ్ పోటీల్లో కూడా దీపిక గోల్డ్ మెడల్ అందుకున్నారు. దీపికా కుమారి కేవలం ఐదు గంటల్లోనే ఈ మూడు బంగారు పతకాలు సొంతం చేసుకున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
గత 14 ఏళ్లలో దీపిక ఎన్నో గోల్డ్ మెడల్స్ గెలిచారు. తన కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచారు. 2020లో ఆమె ఆర్చర్ అతాను దాస్‌ను పెళ్లాడారు.
ఖర్‌సవా, టాటా ఆర్చరీ అకాడమీ సహా మొత్తం భారత్‌లో పిల్లలందరూ ఆర్చరీలో దీపికా కుమారిని ఒక రోల్ మోడల్‌లా భావిస్తారు.
మూడు ఒలింపిక్ క్రీడల మధ్య దీపిక ఒక మహిళగా సుదీర్ఘ ప్రయాణం చేస్తున్నారు. అన్ని ఒత్తిడులు, సవాళ్లు ఎదుర్కుని ఒలింపిక్ పతకాన్ని గెలవాలనే కలను నిజం చేసుకునే పనిలో ఉన్నారు.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది, 4
ఇవి కూడా చదవండి:
- కోవిడ్-19 ఎప్పటికీ అంతం కాకపోవచ్చు, దానితో కలిసి జీవించడం ఎలా?
- అందం కోసం సెక్స్ ఒప్పందాలు: ‘నాకు కాస్మోటిక్ సర్జరీ చేయిస్తే నా శరీరం ఆరు నెలలు నీదే’
- కోవిడ్-19ను మనం నోరోవైరస్లా ఎందుకు చూడాలి? అసలు నోరోవైరస్ అంటే ఏమిటి
- ఒకప్పటి భారతదేశానికి ఇప్పటి ఇండియాకు తేడా ఇదే
- తెలంగాణ: ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఇంకా ఎన్ని ఇస్తారు?
- ప్రమాదం అని తెలిసినా చైనాలో ప్లాస్టిక్ సర్జరీల సంఖ్య ఎందుకు పెరుగుతోంది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









