టోక్యో ఒలింపిక్స్: స్పెయిన్‌పై భారత హాకీ జట్టు గెలుపు

భారత హాకీ జట్టు

ఫొటో సోర్స్, Getty Images

టోక్యో ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు మళ్లీ పుంజుకుంటోంది. మంగళవారం 3-0 తేడాతో స్పెయిన్‌పై మ్యాచ్ గెలిచింది.

రెండు రోజుల క్రితం ఆస్ట్రేలియా చేతిలో భారత పురుషుల హాకీ జట్టు ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు 7-1 తేడాతో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించింది.

భారత హాకీ జట్టు

ఫొటో సోర్స్, HockeyIndia/twitter

‘‘మేం చేసిన తప్పులే ఓటమికి కారణం. దీనికి ఎవరో ఒకరిద్దరిని బాధ్యులను చేయడం సరికాదు. ఈ ఓటమి నుంచి మేం పాఠాలు నేర్చుకున్నాం. మళ్లీ పుంజుకునేందుకు మాకు అవకాశం కూడా ఉంది’’అని బీబీసీతో భారత హాకీ జట్టు సభ్యుడు మన్‌ప్రీత్ సింగ్ చెప్పారు.

తర్వాత దశలో అర్జెంటీనాతో భారత హాకీ జట్టు తలపడనుంది.

Please wait...

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)