టోక్యో ఒలింపిక్స్: సింధు శుభారంభం.. గెలుపు బాటలో మేరీ కోమ్, మనికా బాత్రా

ఫొటో సోర్స్, Getty Images
టోక్యో ఒలింపిక్స్‌లో బాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పీవీ సింధు విజయ పరంపర మొదలైంది.
ఒలింపిక్స్‌లో భాగంగా మూడో రోజు నిర్వహించిన బ్యాడ్మింటన్ ఓపెనింగ్ గ్రూప్ మ్యాచ్‌లో ఇజ్రాయెల్ క్రీడాకారిణి సెనియా పోల్కార్‌పోవాపై సింధు విజయం సాధించారు.
21-7, 21-10తో సెనియాపై సింధు తిరుగులేని ఆధిక్యం కనబరిచారు.

ఫొటో సోర్స్, Getty Images
తొలి మ్యాచ్‌లో మేరీ కోమ్ విజయం
భారత బాక్సింగ్ ఛాంపియన్ మేరీ కోమ్ టోక్యో ఒలింపిక్స్ తొలి మ్యాచ్‌లో విజయం సాధించారు.
డొమినికన్ రిపబ్లిక్‌కు చెందిన మిగులినా హెర్నాండేజ్‌ను 4-1 తేడాతో ఆమె ఓడించారు.
మరోవైపు టేబుల్ టెన్నిస్ ప్లేయర్ మనికా బాత్రా రెండో రౌండ్‌లో మంచి ప్రదర్శన ఇచ్చారు. ఉక్రెయిన్‌కు చెందిన పెస్టోస్కా మార్గరీటాపై ఆమె గెలిచారు.
4-11, 4-11, 11-7, 12-10, 8-11, 11-5, 11-7 స్కోర్‌తో మార్గరీటాపై బాత్రా గెలిచారు.

ఫొటో సోర్స్, Getty Images
మను భాకర్ ఓటమికి పిస్టల్ పాడవడమే కారణమా?
గన్‌లో సాంకేతిక లోపం నడుమ మహిళల పది మీ. ఎయిర్ పిస్టల్ ఈవెంట్ నుంచి భారత షూటర్ మను భాకర్ నిష్క్రమించాల్సి వచ్చింది. ఆమె ఓటమికి కారణాలేంటి? టోక్యో నుంచి బీబీసీ ప్రతినిధి జాహ్నవి మూలే అందిస్తున్న కథనం.
క్వాలిఫైంగ్ మ్యాచ్‌లో మను 12వ స్థానంలో నిలవగా, యశస్విని దేశ్వాల్ 13వ స్థానంలో వచ్చారు.
అసాకా షూటింగ్ రేంజ్‌లో క్వాలిఫైంగ్ రౌండ్‌లో మంచి ప్రదర్శన ఇస్తున్న సమయంలో మను గన్‌లో ఈ సాంకేతిక లోపం తలెత్తింది.
మను భాకర్ మొదటి సిరీస్‌లో మంచి ప్రదర్శన ఇచ్చారు. రెండో సిరీస్‌లో 15 కాల్పులు జరిపిన తర్వాత, గన్ లివర్ విరిగిపోయింది. దాన్ని మరమ్మతు చేసుకోవడానికి ఆమెకు కాస్త సమయం పట్టింది.
మను దగ్గర రెండో గన్ ఉంది. అయితే, దాన్ని సిద్ధం చేసుకోవడానికి కూడా సమయం పట్టేదని ఆమె కోచ్ రౌనక్ చెప్పారు. ఆ తర్వాత సైటర్‌ను అడ్జస్ట్ చేయడానికి ఒలింపిక్ నిర్వాహకులు కూడా సమయం తీసుకున్నారని ఆయన వివరించారు. ఫలితంగా తన విలువైన సమయాన్ని మను కోల్పోవాల్సి వచ్చింది.
అయితే, ఆ సమస్య నుంచి కోలుకుని నాలుగో సిరీస్‌లో మళ్లీ మంచి ప్రదర్శన ఇచ్చేందుకు మను ప్రయత్నించారు.
అయితే, ఫైనల్ సిరీస్‌లో ఆమె 95 స్కోర్ సాధించారు. ఇంకొక రెండు పాయింట్లు వచ్చుంటే క్వాలిఫై అయ్యుండేవారు.
''గన్‌ను లోడ్ చేసేందుకు లివర్ అవసరం అవుతుంది. అది విరిగిపోతే, మీరు కాల్పులు జరపలేరు''అని రౌనక్ అన్నారు. ''వారు రెండో గన్‌ను ఓపెన్ చేసి, అందులోని పార్ట్‌లు తీసి మొదటి గన్‌లో వేశారు. దాని బదులు రెండో గన్ వాడేందుకు అనుమతించాల్సి ఉండేది.''
''ఒకవేళ రెండో గన్‌కు అనుమతించినా, దాన్ని సిద్ధం చేసుకోవడానికి కొంత సమయం పట్టేది. ఇంత జరిగినా, ఆమె మంచి ప్రదర్శనే ఇచ్చింది. కేవలం రెండు పాయింట్ల తేడాతో ఓడిపోయింది.''
ప్రదర్శన అనంతరం మను కుప్పకూలింది. ఆమెను రౌనక్ ఓదారుస్తూ కనిపించారు.
మరోవైపు పురుషుల పది మీ. రైఫిల్ పోటీల క్వాలిఫైంగ్ రౌండ్‌లో దివ్యాన్ష్, దీపక్.. 31, 33 స్థానాల్లో నిలిచారు. దీంతో ఇద్దరూ పోటీ నుంచి నిష్క్రమించారు.

ఫొటో సోర్స్, Getty Images
సానియా, అంకితా ఓటమి
విమెన్స్ డబుల్స్ టెన్నిస్ తొలి రౌండ్‌లో భారత టెన్నిస్ క్రీడాకారిణులు సానియా మీర్జా, అంకితా రైనా జంట ఓటమిని చవిచూసింది.
ఉక్రెయిన్‌కు చెందిన లిడ్మయలా కిచనోక్, నదియా కిచనోక్‌లు.. సానియా జట్టుపై విజయం సాధించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
తొలి సెట్‌లో కిచనోక్ ద్వయంపై సానియా మీర్జా జట్టు ఆధిక్యం ప్రదర్శించింది. అయితే, రెండో సెట్ డ్రా అయ్యింది.
మూడో సెట్‌లో కిచనోక్ ద్వయం విజయం సాధించడంతో గేమ్‌ను సొంతం చేసుకుంది. దీంతో సానియా జట్టు పోటీ నుంచి నిష్క్రమించింది.
Please wait...
ఇవి కూడా చదవండి:
- మీరాబాయి చానూ: రియో ఒలింపిక్స్‌లో ఓటమి నుంచి టోక్యోలో విజయం వరకు
- టోక్యో ఒలింపిక్స్: ఘనంగా ప్రారంభమైన ప్రపంచ క్రీడా వేడుక
- తెలంగాణ: వనపర్తి ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్యకు కారణమేంటి?
- కృష్ణా జల వివాదం: నీటి పంపకాలపై తెలుగు రాష్ట్రాల మధ్య ఎందుకీ వివాదం, దీనికి మూలం ఎక్కడ?
- ఆక్సిజన్ కొరతతో ఎవరూ చనిపోలేదన్న కేంద్రం, మరి రుయా ఆస్పత్రిలో మరణాలెలా సంభవించాయి?
- మొన్న చైనాలో మంకీ బీ వైరస్, ఇప్పుడు అమెరికాలో మంకీపాక్స్ కలకలం
- తెలంగాణలో భారీ వర్షాలు: నిర్మల్‌లో రోడ్ల మీదే చేపల వేట
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








