కాదంబినీ గంగూలీ: భారత తొలి మహిళా డాక్టర్‌కు డూడుల్‌తో గూగుల్ నివాళి

ఫొటో సోర్స్, Twitter/Google India
భారత్‌లో శిక్షణ పొందిన తొలి మహిళా డాక్టర్ కాదంబినీ గంగూలీ. ఆదివారం ఆమె 160వ జయంతిని పురస్కరించుకొని ఆమె అందించిన సేవలను ప్రముఖులు కొనియాడారు.
మరోవైపు గూగుల్ కూడా ప్రత్యేక డూడుల్‌తో ఆమెకు నివాళులు అర్పించింది.
కాదంబినీ గంగూలీ 1861 జులై 18న జన్మించారు. భారత్‌లో తొలి మహిళా హక్కుల సంస్థను స్థాపించిన వారిలో ఆమె తండ్రి కూడా ఒకరు.
ఆయనే కాదంబినీని దగ్గర్లోని పాఠశాలలో చేర్పించారు. అప్పట్లో అమ్మాయిలు పాఠశాలలో చేరడాన్ని తప్పుగా చూసేవారు.
తన తండ్రి కల్పించిన అవకాశాన్ని కాదంబినీ సద్వినియోగం చేసుకున్నారు. 1883లో బ్రిటిష్ రాజ్ నుంచి డిగ్రీ పట్టా పొందిన తొలి భారత మహిళలుగా కాదంబినీ, ఆమె స్నేహితురాలు చంద్రముఖి బసూయిన్ చరిత్ర సృష్టించారు.
డిగ్రీ అనంతరం కాదంబినీ.. సామాజిక కార్యకర్త, ప్రొఫెసర్ ద్వారకానాథ్ గంగూలీని పెళ్లి చేసుకున్నారు. ఆయనే ఆమెను వైద్య విద్య చదివే దిశగా ప్రోత్సహించారు.
చాలా వ్యతిరేకత ఎదురైన అనంతరం, చివరగా కలకత్తా మెడికల్ కాలేజీలో కాదంబినీకి మెడిసిన్ సీటు వచ్చింది. దీంతో 1886లో మరోసారి ఆమె చరిత్ర సృష్టించారు. భారత్‌లో వైద్య పట్టా పొందిన తొలి మహిళగా ఆమె రికార్డు నెలకొల్పారు.
అయితే, అక్కడితో ఆమె ఆగిపోలేదు. గైనకాలజీలో ఆమె చదువు కొనసాగించారు. బ్రిటన్‌లో చదువుకుంటూనే ఆమె పనిచేశారు. మొత్తంగా వైద్య పట్టాతోపాటు మూడు అదనపు డిగ్రీలను కూడా ఆమె సంపాదించారు.
1890ల్లో ఆమె మళ్లీ భారత్‌కు వచ్చేశారు. ఆ తర్వాత ఇక్కడే ప్రాక్టీసు మొదలుపెట్టారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
వైద్య సేవలు అందించడంతోపాటు మహిళలకు హక్కులు కల్పించాలని కూడా కాదంబినీ పోరాడేవారు. 1889లో భారత నేషనల్ కాంగ్రెస్‌లో మరో ఆరుగురు మహిళలతో కలిసి ప్రత్యేక మహిళా విభాగాన్ని కూడా ఏర్పాటుచేశారు.
ఆమె జీవితంపై 'ప్రథోమా కాదంబినీ' పేరుతో ఓ టీవీ సిరీస్ కూడా రూపొందించారు.
‘‘ఆరోగ్య సిబ్బందికి మనం మరింత గౌరవమివ్వాలి. వైద్యులు, నర్సులు ఇతర ఆరోగ్య సిబ్బంది అందరినీ మనం గౌరవించాలి. ఈ సందేశం ఇచ్చేందుకే కాదంబినీపై డూడుల్ రూపొందించాను’’అని బెంగళూరుకు చెందిన ఒద్రిజా చెప్పారు. ఆమె గూగుల్ డూడుల్స్‌ను రూపొందిస్తుంటారు.
ఇవి కూడా చదవండి:
- తెలంగాణ: ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఇంకా ఎన్ని ఇస్తారు?
- గోల్డ్‌ఫిష్: చైనాకు చెందిన ఈ అందమైన చేప రాక్షసిలా ఎలా మారుతోంది?
- తెలంగాణ: కరోనా లాక్డౌన్లో పెరిగిన బాల్య వివాహాలు
- వైఎస్ షర్మిల: కృష్ణా నదిపై రెండేళ్లుగా ప్రాజెక్టులు కడుతుంటే కేసీఆర్ ఇప్పుడే తెలివిలోకి వచ్చారా?
- మోదీ కేబినెట్: దళిత, ఓబీసీ మంత్రులు యూపీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించగలరా
- ప్యూ రీసెర్చ్: మతం పట్ల భారతీయుల్లో ఎలాంటి అభిప్రాయం ఉంది
- డెల్టా ప్లస్: ఈ కోవిడ్-19 కొత్త వేరియంట్‌కు ప్రపంచం భయపడాల్సిందేనా
- అయోధ్య: రామ మందిరం ట్రస్ట్ భూముల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయా? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- టవోలారా: ప్రపంచంలోనే అతిచిన్న సామ్రాజ్యమిది.. ఇక్కడ ఎంతమంది నివసిస్తారో తెలుసా?
- మియన్మార్: ''43 మంది పిల్లలను సైన్యం చంపేసింది''
- రష్యా-అమెరికా చర్చల గురించి సైబర్ ముఠాలకు భయమే లేదా?
- కిమ్ జోంగ్ ఉన్: 'అమెరికాతో 'చర్చలకు, ఘర్షణకు' ఉత్తర కొరియా రెడీ అవుతోంది'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








