ఉత్తరాఖండ్ గ్లేసియర్ ప్రమాదం: '18 మృతదేహాలు లభ్యం, 202 మంది కోసం గాలింపు చర్యలు

ఫొటో సోర్స్, Reuters
ఏటీపీసీ సొరంగాల్లో సహాయ కార్యక్రమాల కొనసాగుతున్నాయని ఉత్తరాఖండ్ డీజీపీ చెప్పారు. ఇప్పటివరకూ 18 మృతదేహాలు దొరికాయని, 202 మంది కోసం ఇంకా గాలింపు చర్యల కొనసాగుతున్నాయని చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
సొరంగంలో చిక్కుకున్న బాధితులు
రెండున్నర కిలోమీటర్ల పొడవున్న సొరంగంలో చిక్కుకున్న బాధితులు
చమోలీ జిల్లాలో గ్లేసియర్ ప్రమాదం తర్వాత చాలామంది రెండున్నర కిలోమీటర్ల పొడవున్న సొరంగంలో చిక్కుకుపోయారని జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ డీజీపీ ఎస్ఎన్ ప్రధాన్ చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఇప్పటివరకూ ఒక కిలోమీటర్ వరకూ మట్టిని తొలగించామని, జనాలు చిక్కుకున్న ప్రాంతానికి త్వరలో చేరుకుంటామని ఆయన తెలిపారు.
13 గ్రామాలకు తెగిన రాకపోకలు
గ్లేసియర్ విరిగిపడిన ఘటన తర్వాత వంతెనలు ధ్వంసం కావడంతో 13 గ్రామాలకు రాకపోకలు తెగిపోయాయని ఉత్తరాఖండ్ చమోలీ జిల్లా కలెక్టర్ స్వాతి భదౌరియా చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
స్థానికులు కొండలపై చిక్కుకుపోయారని, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే పనులు కొనసాగుతున్నాయని అన్నారు.

ఫొటో సోర్స్, ITBP
అంతకు ముందు...
చమోలీ జిల్లాలోని రిషిగంగా విద్యుత్ ప్రాజెక్టు సమీపంలో మంచు చరియలు విరిగినపడిన ఘటనలో ఇప్పటి వరకు ఏడుగురి మృతదేహాలను గుర్తించామని, 125 మంది గల్లంతయ్యారని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ ప్రకటించారు.
వీరితోపాటు ఐదుగురు గొర్రెల కాపరులు, 180 గొర్రెలు కూడా వరదకు కొట్టకుపోయినట్లు ఆయన వెల్లడించారు. వారి క్షేమ సమాచారం ఇప్పటి వరకు తెలియదని మీడియా సమావేశంలో రావత్ తెలిపారు.
ఈ రోజు ఆదివారం కావడం వల్ల ప్రమాదం జరిగిన విద్యుత్ కేంద్రం వద్ద ఉద్యోగులు తక్కువగా ఉన్నారని, లేదంటే మృతులు సంఖ్య ఎక్కువగా ఉండేదని రావత్ అన్నారు.
పెద్ద ఎత్తున రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయని, ధౌలిగంగా గ్రామానికి మిగిలిన ప్రపంచంతో సంబంధాలు తెగిపోయానని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ ప్రాంతంలో ఉన్న గ్రామాలలో చలికారణంగా ఏడు గ్రామాల ప్రజలకు ఇప్పటికే వలసపోయారని, 11 గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేశామని సీఎం వెల్లడించారు. మరోవైపు తపోవన్ ప్రాంతంలోని టన్నెల్లో చిక్కుకు పోయిన 16మందిని ఐటీబీపీ రెస్క్యూ టీమ్ రక్షించినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
తపోవన్ సొరంగంలో ఇంకా 30 మంది ...
తపోవన్ వద్ద ఉన్న మొదటి టన్నెల్ లో చిక్కుకున్న 16మందిని రక్షించామని, రెండో టన్నెల్ లో ఇంకా 30మంది ఉన్నట్లు తెలిసిందని, వారిని రక్షించే ప్రయత్నాలు చేస్తున్నామని ఐటీబీపీ పీఆర్వో వివేక్ పాండే వెల్లడించినట్లు ఏఎన్ఐ తెలిపింది.
రాత్రి పూట కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని, వారిని క్షేమంగా తీసుకువస్తామన్న నమ్మకం ఉందని వివేక్ పాండే అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
సురక్షిత ప్రాంతాలకు ప్రజల తరలింపు
చమోలీ జిల్లాలో అలకనంద, ధౌలిగంగ నదులకు అకస్మాత్తుగా భారీ వరదలు ముంచెత్తడంతో అధికారులు ఈ మధ్యాహ్నమే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ఈ వరదల్లో 100- 150 మంది చనిపోయి ఉంటారని ఉత్తరాఖండ్ చీఫ్ సెక్రటరీ ఓం ప్రకాశ్ ఆందోళన వ్యక్తం చేశారని ఏఎన్ఐ తెలిపింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5
వరద ఒక్కసారిగా పోటెత్తడంతో రిషిగంగ పవర్ ప్రాజెక్ట్ దెబ్బతిందని అధికారులు తెలిపారు.
ప్రభావతి ప్రాంతాలలో సహాయ చర్యలు చేపట్టేందుకుగాను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని పంపిస్తున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు.

ఫొటో సోర్స్, AFP
జోషిమఠ్ సమీపంలో మంచుచరియలు విరిగిపడడంతో ఒక్కసారిగా ధౌలిగంగకు వరదొచ్చిందని, రిషిగంగ పవర్ ప్రాజెక్ట్ వద్ద పనిచేస్తున్న 150 మంది గల్లంతయ్యారని పీటీఐ వార్తాసంస్థ తెలిపింది.
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ తపోవన్ సమీపంలోని రేని గ్రామానికి చేరుకుని రక్షణ సహాయ చర్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఫొటో సోర్స్, ANI
ప్రమాదంలో చిక్కుకున్న ఉద్యోగులు
ప్రమాదం జరిగిన ప్రాంతంలో 20 మంది వరకు ఉద్యోగులు చిక్కుకుపోయారని, వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఐటీబీపీ డీజీ డీడీ దేశ్వాల్ వెల్లడించారు.
నదీ ప్రవాహం నుంచి ఇప్పటి వరకు 9 నుంచి 10 మృతదేహాలను తమ సిబ్బంది వెలికి తీసినట్లు తాజాగా చేసిన ప్రకటనలో దేశ్వాల్ వెల్లడించారు.
అక్కడ వందమంది వరకు పని చేస్తూ ఉండి ఉంటారని ఆయన అన్నారు. 250మంది ఐటీబీపీ సిబ్బంది రక్షణ చర్యల్లో ఉన్నట్లు తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 6
సొరంగంలో కూరుకుపోయిన ఓ వ్యక్తిని బైటికి తీస్తున్న వీడియోను ఐటీబీపీ సిబ్బంది విడుదల చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 7
ప్రమాదం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని తాను భావిస్తున్నానని, ప్రమాదంలో చిక్కుకున్నవారు క్షేమంగా బైటికి రావాలని కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 8
మరోవైపు జరిగిన ప్రమాద ఘటనపట్ల కాంగ్రెస్ అధ్యక్షురాలు విచారం వ్యక్తం చేశారు. ఈ వరదల కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలకు ప్రమాదం పొంచి ఉండొచ్చని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 9
ఎంతమంది గల్లంతయ్యారో చెప్పలేం: చమోలీ జిల్లా అదనపు కలెక్టర్
హిమపాతం కారణంగా ఉత్తరాఖండ్ లోని హృషిగంగా విద్యుత్ ప్రాజెక్టు తీవ్రంగా దెబ్బతిన్నదని చమోలీ జిల్లా అదనపు కలెక్టర్ అనిల్ సైనియాల్ వెల్లడించారు. అక్కడ పని చేసే పలువురు వ్యక్తులు గల్లంతయ్యారని, కొందరు చనిపోయి ఉండే ప్రమాదం కూడా ఉందని సైనియాల్ అన్నారు.
అయితే ఎంతమంది గల్లంతయ్యారు, ఎంతమంది చనిపోయారన్నది ఇప్పుడే చెప్పడం కష్టమని తెలిపారు.

ఫొటో సోర్స్, VINAY, SHAHBAZ ANWAR
ధౌలిగంగా, అలక్ నందా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయని, హరిద్వార్ వద్ద ప్రమాద హెచ్చరికలు జారీ చేశామని అదనపు కలెక్టర్ చెప్పారు. నదీకి సమీపంలో నివసించేవారిని ఖాళీ చేయించామని, సైన్యం, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని ఆయన తెలిపారు.
మంచు చరియలు విరిగిపడి వరదలు రావడంతో రిషిగంగ పవర్ ప్రాజెక్ట్ తీవ్రంగా దెబ్బతిందని.. ప్రాజెక్టు ప్రాంతంలో ఉన్న కొందరు గల్లంతయ్యారని.. ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని చమోలీ జిల్లా అదనపు కలెక్టర్ అనిల్ సైనియాల్ చెప్పారు. తపోవన్ నుంచి హరిద్వార్ వరకు అప్రమత్తం చేశామని అన్నారు.

ఫొటో సోర్స్, Ani
2013లో ఏం జరిగింది?
ఉత్తరాఖండ్ లో తరచూ ఇలాంటి వరదలు సంభవిస్తుంటాయి. 2013లో కురిసిన భారీ వర్షాలకు వేలమంది మరణించగా, అనేకమంది గాయపడ్డారు.
ఎగువన కురిసిన భారీ వర్షాలకు కొండలలో ఉన్న నదులు భారీ ఎత్తున బురద, రాళ్లతో ఒక్కసారిగా విరుచుకుపడ్డాయి. ఈ వరదల తీవ్రతకు అనేక ఇళ్లు, రోడ్లు బ్రిడ్జ్ లు కొట్టుకుపోయాయి. ఈ ఉత్పాతాన్ని హిమాలయన్ సునామీగా అప్పట్లో అభివర్ణించారు.
హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉన్న హిందూ ఆలయాలకు భక్తులు, టూరిస్టులు ఎక్కువగా వచ్చే సీజన్ లోనే ఈ వరదలు సంభవించడంతో ప్రాణనష్టం ఎక్కువగా ఉంది.
నాటి ఘటనల్లో 4వేల గ్రామాలు వరద ముప్పులో చిక్కుకోగా, సుమారు లక్షమందిని అక్కడి నుంచి తరలించాల్సి వచ్చింది. కొన్ని ప్రాంతాలలో గ్రామాలకు గ్రామాలే కొట్టుకుపోయాయి.
వరదల తీవ్రతకు మృతులు వేలల్లో ఉంటారని ప్రకటించారు తప్ప, ఎంతమంది చనిపోయారో అధికారులు కచ్చితంగా చెప్పలేకపోయారు.
వేలమంది ఆర్మీ సిబ్బంది ఈ రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్నారు. కొండల్లో వాహనాల ద్వారా ప్రయాణం కష్టం కావడంతో హెలీకాప్టర్లను ఉపయోగించి భక్తులను, టూరిస్టులను సురక్షిత ప్రాంతాలకు చేర్చారు.
హిమాలయాల్లో 2013నాటి భారీ వర్షాలు వరదలు సుమారు 80 తర్వాత మళ్లీ ఆ స్థాయిలో సంభవించిన ఉత్పాతమని వాతావరణ శాఖ నిపుణులు చెప్పారు.

ఇవి కూడా చదవండి:
- సైన్యంలో చేరాలని రెండు సార్లు ఫెయిలైన వ్యక్తి ఇప్పుడు దేశాన్నే గుప్పిట్లో పెట్టుకున్నాడు
- బుమ్రా, షమీ, ఉమేశ్, ఇషాంత్... ఇంగ్లండ్‌ను భయపెడుతున్న భారత పేసర్లు
- ఎర్రకోటను షాజహాన్ ఎందుకు కట్టించారు.. చరిత్రలో అక్కడ జరిగిన రాజకీయ కుట్రలెన్ని.. తెగిపడిన తలలెన్ని
- దీప్ సిద్ధూ ఎవరు? ఎర్రకోట ఘటన తరువాత చర్చల్లోకి ఎందుకొచ్చారు?
- ‘18 మందిని చంపిన సీరియల్ కిల్లర్’: ఒంటరి మహిళలతో మాట కలుపుతాడు... కోరిక తీర్చుకుని కడతేరుస్తాడు...
- బడ్జెట్ 2021-22: సామాన్యులకు ఈ బడ్జెట్‌తో చేకూరే ప్రయోజనాలు ఇవే..
- పాకిస్తాన్ గురించి నేపాల్ ప్రజలు ఏమనుకుంటారు?
- తీరా కామత్: రూ.16 కోట్ల ఇంజెక్షన్ ఈ పాపాయిని కాపాడుతుందా?
- పదకొండేళ్ల పర్యావరణ ఉద్యమకారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు
- సెక్స్‌కు 'విశ్వగురువు' ప్రాచీన భారతదేశమే
- పేద దేశాలకు దక్కకుండా ధనిక దేశాలు వ్యాక్సీన్‌ను లాగేసుకుంటున్నాయా?
- అంబేడ్కర్ తొలి పత్రిక ''మూక్ నాయక్''కు 101 ఏళ్లు: అప్పట్లో దళితులు మీడియాను ఎలా నడిపించేవారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)