‘హాథ్‌రస్’ కేసును సీబీఐకి అప్పగించిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ - BBC Newsreel

ఫొటో సోర్స్, facebook/yogiadityanath
హాథ్‌రస్ దళిత యువతి అత్యాచారం, హత్య కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలు జారీ చేశారు.
ఇప్పటికే దీనిపై విచారణకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఆ బృందం ఆదివారం సాయంత్రంలోగా నివేదిక ఇవ్వాల్సి ఉంది.
ఆ నివేదిక రావడానికి ముందే ముఖ్యమంత్రి సీబీఐ విచారణకు ఆదేశించారు.
కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకలు బాధిత కుటుంబ సభ్యులను కలుసుకున్న కొద్దిసేపటికే యోగి ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1

ఫొటో సోర్స్, Twitter/congress
'హాథ్‌రస్' బాధితురాలి కుటుంబంతో మాట్లాడిన రాహుల్ గాంధీ, ప్రియాంక
కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక వధేరాలు ఉత్తరప్రదేశ్‌లోని హాథ్‌రస్ చేరుకున్నారు. అక్కడ అత్యాచారానికి గురైనట్లు చెబుతున్న దళిత యువతి కుటుంబాన్ని కలిసి మాట్లాడారు.
బాధిత కుటుంబం న్యాయ విచారణ కోరుతోందని.. జిల్లా కలెక్టరును తప్పించాలని డిమాండ్ చేస్తోందని ప్రియాంక చెప్పారు.
బాధిత కుటుంబానికి భద్రత కల్పించాలని కోరారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
శనివారం సాయంత్రం రాహుల్, ప్రియాంకలు దిల్లీ నుంచి హాథ్‌రస్ వెళ్లేందుకు బయలుదేరగా ఉత్తరప్రదేశ్ సరిహద్దుల్లో వారిని పోలీసులు ఆపేశారు. అనంతరం అయిదుగురు మాత్రమే వెళ్లేందుకు అనుమతించారు.
హాథ్‌రస్‌లో దళిత బాలిక కేసు విషయంలో పలుచోట్ల నిరసనలు, కొవ్వొత్తుల ర్యాలీలు జరుగుతున్నాయి. రాహుల్ గాంధీ, యూపీ కాంగ్రెస్ ఇంఛార్జ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రియాంకా గాంధీ కూడా ఈ ఆందోళనల్లో పాలుపంచుకుంటున్నారు. దళిత మహిళ అత్యాచార ఘటన, మృతి వ్యవహారం వెలుగులోకి రాగానే రాహుల్, ప్రియాంకలు బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్‌రస్‌కు బయలురేరారు.
అయితే వారిని గ్రేటర్ నోయిడా ఎక్‌ప్రెస్ వేపై యూపీ పోలీసులు అడ్డుకున్నారు. ఘటన జరిగిన గ్రామంలో సెక్షన్ 144 నడుస్తోందని పోలీసులు ఆయనకు వివరించారు. దీంతో ఆయన ఒంటరిగా కాలినడకన హాథ్‌రస్ వెళ్లడానికి ప్రయత్నించారు. కానీ ఆయన్ను ఆపడంతో పోలీసులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య ఘర్షణ జరిగింది.

ఫొటో సోర్స్, Twitter/sushantsinghrajput
'సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ది హత్య కాదు'.. ఎయిమ్స్ ఫోరెన్సిక్ బోర్డ్ నివేదికలో వెల్లడి
నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ హత్యకు గురయ్యారనేందుకు ఎలాంటి ఆధారాలులేవని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఫోరెన్సిక్ మెడికల్ బోర్డ్ తన నివేదికలో తేల్చిచెప్పింది.
"మేం మా నివేదికను సీబీఐకి అందించాం. ఇది ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న కేసు'' అని ఎయిమ్స్ ఫోరెన్సిక్ విభాగం అధిపతి, మెడికల్ బోర్డ్ చైర్మన్ డాక్టర్ సుధీర్ గుప్తా బీబీసీకి తెలిపారు.
"ఉరి వేసుకున్న ఆనవాళ్లు తప్ప శరీరం మీద మరే గుర్తులు లేవు. అతని దుస్తులను పరిశీలిస్తే పెనుగులాడిన ఆనవాళ్లు కూడా కనిపించలేదు '' అని డాక్టర్ గుప్తా వెల్లడించారు.
మెడ మీద ఉరి వేసుకున్న గుర్తులు తప్ప అతని శరీరంలో ఎలాంటి మత్తు లేదా, ఇతర పదార్ధాల ఆనవాళ్లు అటు బాంబే ఫోరెన్సిక్ ల్యాబ్ పరీశీలనలోగానీ, ఎయిమ్స్ టాక్సికాలజీ ల్యాబ్ పరిశీలనలోగానీ లభించలేదని డాక్టర్ గుప్తా తెలిపారు.

ఫొటో సోర్స్, IRINA SLAVINA/FACEBOOK
'నా మరణానికి ప్రభుత్వమే కారణం' అని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసి ఆత్మహత్య చేసుకున్న రష్యా మహిళా ఎడిటర్
రష్యాలోని నిజ్నీ నావ్‌గొరోడ్ నగరంలో అంతర్గత మంత్రిత్వ శాఖ కార్యాలయం ముందు ఒక రష్యా న్యూస్ ఎడిటర్ తనకు తాను నిప్పు పెట్టుకుని చనిపోయారు.
"నా మృతికి మీరు రష్యా ప్రభుత్వాన్ని నిందించాలని నేను మిమ్మల్ని కోరుతున్నా...’’ అని సంపాదకురాలు ఇరీనా స్లావినా అంతకు ముందు ఫేస్‌బుక్‌లో రాశారు.
ఆమె శరీరంపై కాలిన గాయాలు ఉన్నాయని అధికారులు ధ్రువీకరించారు.
ఇరీనా స్లావీనా చిన్న కోజా ప్రెస్ న్యూస్ వెబ్‌సైట్‌కు ఎడిటర్-ఇన్-చీఫ్‌గా ఉన్నారు. శుక్రవారం ఆమె మరణించినప్పటి నుంచి ఈ వెబ్‌సైట్ పనిచేయడం లేదు.
ఓపెన్ రష్యా అనే ఒక ప్రజాస్వామ్య అనుకూల బృందానికి సంబంధించిన పత్రాల కోసం పోలీసులు తన ఇంట్లో తనిఖీలు చేశారని, కంప్యూటర్లు, డేటాను స్వాధీనం చేసుకున్నారని స్లావీనా గురువారం చెప్పారు.
వీడియోలలో ఆమె గోర్కీ వీధిలోని ఒక బెంచ్ మీద తనకు తాను నిప్పు పెట్టుకుంటున్నట్టు కనిపిస్తోంది. నిజ్నీ నావ్‌గొరోడ్ మంత్రిత్వ శాఖ అక్కడే ఉంది.
ఈ వీడియోలో ఒక వ్యక్తి ఆ మహిళను కాపాడ్డానికి, ఆమె మంటలు ఆర్పడానికి సాయం చేసేందుకు పరుగులు తీస్తున్నారు. ఆమె అతడిని మళ్లీ మళ్లీ వెనక్కు తోసేశారు. చివరికి ఆమె కింద పడిపోయేముందు అతడు తన కోటు ఉపయోగించి మంటలు ఆర్పాలని ప్రయత్నించాడు.
స్లావీనాకు భర్త, కుమార్తె ఉన్నారు. ఆమె ఫ్లాట్‌లో జరిగిన తనిఖీలకు తమకు ఏ సంబంధం లేదని రష్యా దర్యాప్తు బృందం చెప్పింది.

ఫొటో సోర్స్, BCCI / IPL
దుబాయిలో ఆడిన ఐపీఎల్ 2020 14వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ మీద సన్రైజర్స్ హైదరాబాద్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది.
టాస్ గెలిచిన హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించాడు. సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది.
165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 157 పరుగులే చేయగలిగింది. ఇది చెన్నైకి వరుసగా మూడో పరాజయంయ
షాన్ వాట్సన్ ఒక్క పరుగుకే భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో బౌల్డ్ అవుటవడంతో చెన్నైకి మూడో ఓవర్లోనే షాక్ తగిలింది.
ఆ తర్వాత ఆరో ఓవర్లో అంబటి రాయుడు (8) నటరాజ్ బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చాడు. అదే ఒవర్ చివరి బంతికి ఫాఫ్ డుప్లిసిస్ (22) కూడా రనౌట్ అవడంతో చెన్నై 36 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిపోయింది.
వరసగా వికెట్లు పడుతున్న సమయంలో క్రీజ్‌లోకి వచ్చిన కేదార్ జాధవ్ (3) కూడా నిలబడలేకపోయాడు. స్పిన్నర్ అబ్దుల సమద్ బౌలింగ్‌లో డేవిడ్ వార్నర్‌కు క్యాచ్ ఇచ్చాడు.
10 ఓవర్లకు చెన్నై 50 పరుగులు కూడా చేయలేకపోయింది. అలాంటి సమయంలో బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు వచ్చిన ధోనీ బరిలోకి వచ్చాడు. మొదట ఆచితూచి ఆడిన చెన్నై కెప్టెన్ రవీంద్ర జడేజాతో కలిసి స్కోరును వంద పరుగులు దాటించాడు.

ఫొటో సోర్స్, BCCI / IPL
ఆఖరి నాలుగు ఓవర్లు
ఆఖరి నాలుగు ఓవర్లలో చెన్నై విజయం కోసం 78 పరుగులు చేయాల్సి వచ్చింది.
భువనేశ్వర్ వేసిన 17వ ఓవర్లో రవీంద్ర జడేజా మూడు బౌండరీలు బాదాడు. ఈ ఓవర్లోనే మొత్తం 15 పరుగులు వచ్చాయి.
నటరాజన్ వేసిన తర్వాత ఓవర్లో సిక్స్ కొట్టిన జడేజా తన హాఫ్ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. అదే ఓవర్లో మరో సిక్స్ కొట్టేందుకు ప్రయత్నించి అవుటయ్యాడు. తర్వాత వచ్చిన శామ కరన్ సిక్స్ కొట్టడంతో ఈ ఓవర్లో 19 పరుగులు వచ్చాయి.
తర్వాత మహేంద్ర సింగ్ ధోనీ, శామ్ కరన్‌ను జట్టుకు విజయం అందించేందుకు చివరి వరకూ పోరాడారు.

ఫొటో సోర్స్, BCCI / IPL
ఆఖరి ఆరు బంతుల్లో చెన్నైకి 28 పరుగులు అవసరమయ్యాయి. అబ్దుల్ సమద్ వేసిన ఈ ఓవర్లో మొదటి బంతి వైడ్ కావడంతోపాటూ ఫోర్ వెళ్లింది.
తర్వాత మూడు బంతుల్లో ఒక ఫోర్ కూడా కొట్టిన ధోనీ ఏడు పరుగులు చేశాడు. చివరి బంతిని శామ్ కరన్ సిక్స్ కొట్టాడు.
చివరకు, చెన్నై ఏడు పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
ధోనీ 36 బంతుల్లో ఒక సిక్సర్‌తో 47 పరుగులు, శామ్ కరన్ 5 బంతుల్లో 15 పరుగులు చివరి వరకూ నాటౌట్‌గా నిలిచారు.

ఫొటో సోర్స్, BCCI / IPL
హైదరాబాద్ ఇన్నింగ్స్
అంతకు ముంకు బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ దీపక్ చాహర్ వేసిన మొదటి ఓవర్లోనే ఓపెనర్ జానీ బెయిర్ స్టో వికెట్(0) కోల్పోయింది.
తర్వాత వచ్చిన మనీష్ పాండే, డేవిడ్ వార్నర్ స్కోరును ముందుకు కదిలించారు. 47 పరుగుల దగ్గర మనీష్ పాండే(29) అవుటయ్యాడు.
మెల్లగా ఆడుతూ 28 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్, పీయూష్ చావ్లా బౌలింగ్‌లో సిక్స్ కొట్టాలని ప్రయత్నించాడు.
కానీ బౌండరీ లైన్ దగ్గర ఫాఫ్ డిప్లెసీ అద్భుతమైన క్యాచ్‌తో అతడి ఇన్నింగ్స్ ముగిసింది.
తర్వాత బంతికే కేన్ విలియమ్సన్ (9) కూడా రనౌట్ అయ్యాడు.
11వ ఓవర్లకు 69 పరుగులే చేసి, టాప్ వికెట్లు కోల్పోయిన సన్ రైజర్స్ ను యువ ఆటగాళ్లు ప్రియం గార్గ్, అభిషేక్ శర్మ ఆదుకున్నారు. స్కోరును 140 పరుగులు దాటించారు.
అభిషేక్ (31) అవుటైనా ప్రియం గార్గ్ తన జోరు కొనసాగించాడు. 26 బంతుల్లో 1 సిక్సర్ సహా 51 పరుగులు చేసి జట్టు స్కోరును 164కు చేర్చారు.
ఇది ఐపీఎల్‌లో ప్రియం గార్గ్ కు మొదటి హాఫ్ సెంచరీ.
ఇవి కూడా చదవండి:
- కోకాకోలా, మొసలిపేడ, పంది పేగులు... గర్భం రాకుండా పూర్వం వీటితో ఏం చేసేవారో తెలుసా?
- కొళాయి నీళ్లలో మెదడును తినేసే సూక్ష్మజీవులు.. ఆ నీళ్లు వాడొద్దంటూ అధికారుల వార్నింగ్
- కశ్మీర్ సమస్య పరిష్కారం కానిదే దక్షిణాసియాలో శాంతి అసాధ్యం: ఐక్యరాజ్యసమితిలో ఇమ్రాన్ ఖాన్
- ఐక్యరాజ్యసమితి అంటే ఏమిటి? అది ఏం చేస్తుంది?
- బంగారం వ్యాపారానికి ప్రొద్దుటూరు ఎలా కేంద్రంగా మారింది? ఈ ఊరిని రెండో ముంబై అని ఎందుకు అంటారు?
- ఓ డొక్కు టీవీ ఊరు మొత్తానికీ ఇంటర్నెట్ రాకుండా చేసింది.. ఎలాగంటే...
- వాడి పడేసిన 3 లక్షల కండోమ్‌లు రీసైకిల్ చేసి విక్రయించే ప్రయత్నం...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








