వాడి పడేసిన 3 లక్షల కండోమ్‌లు రీసైకిల్ చేసి విక్రయించే ప్రయత్నం... స్వాధీనం చేసుకున్న పోలీసులు

కండోమ్‌

ఫొటో సోర్స్, Reuters

అక్రమంగా విక్రయించేందుకు సిద్ధంచేసిన 3,20,000కుపైగా వాడిన కండోమ్‌లను వియత్నాం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

బిన్ డువాంగ్ ప్రావిన్స్‌లోని ఓ గోదాంలో 360 కేజీలకు పైగా బరువున్న డజన్లకొద్దీ బ్యాగుల్లో లక్షల కండోమ్‌లను పోలీసులు సీజ్‌ చేస్తున్న దృశ్యాలు మీడియాలో కనిపించాయి.

ఈ గోదాం యజమాని అయిన ఓ మహిళను పోలీసులు అరెస్టు చేశారు.

కండోమ్‌లు

ఫొటో సోర్స్, Getty Images

చెక్క డిల్డోల సాయంతో ఈ కండోమ్‌లను శుభ్రపరిచి, కొత్తగా కనిపించేలా మార్పులుచేసి.. విక్రయించేందుకు మళ్లీ ప్యాక్ చేస్తున్నారు.

కేజీ కండోమ్‌లకు తనకు 0.17 డాలర్లు ఇస్తారని అరెస్టయిన మహిళ చెప్పినట్లు వియత్నాం ప్రభుత్వ మీడియా వీటీవీ పేర్కొంది.

ఇలాంటి ఎన్ని కండోమ్‌లను మార్కెట్‌లో విక్రయించారో తెలియడం లేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)