కశ్మీర్ సమస్య పరిష్కారం కానిదే దక్షిణ ఆసియాలో శాంతి లేదు: ఐక్యరాజ్యసమితిలో ఇమ్రాన్ ఖాన్

నరేంద్రమోదీ, ఇమ్రాన్ ఖాన్

ఫొటో సోర్స్, Getty Images

ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో భారత్ - పాకిస్తాన్‌ల మధ్య జమ్ము-కశ్మీర్, ఉగ్రవాద సమస్యలపై మరోసారి వివాదం చెలరేగింది.

75వ వార్షిక సమావేశాల్లో శుక్రవారం పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ వర్చువల్‌గా ప్రసంగించారు. జమ్మూ-కశ్మీర్ వివాదం, మైనారిటీల వ్యవహారం, ఆర్ఎస్ఎస్ హిందుత్వ ఎజెండాలపై భారత్‌ను లక్ష్యంగా చేసుకుంటూ మాట్లాడారు.

కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన, సైనికులను మోహరించడం లాంటి విషయాలపై ఆరోపణలు చేశారు.

ఇమ్రాన్ ఖాన్ ఆరోపణలపై భారత ప్రతినిధి రైట్ టు రిప్లై కింద స్పందిస్తూ.. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పోషిస్తోందని, మైనారిటీలతో సహా ఇతర వర్గాల ముస్లింలను హింసిస్తోందని ఆరోపించారు.

ఐరాస సర్వసభ్య సమావేశంలో శనివారం నాడు మోదీ ప్రసంగించనున్నారు.

ఇమ్రాన్ ఖాన్

ఫొటో సోర్స్, TWITTER / @ PAKPMO

‘‘జమ్ము-కశ్మీర్ సమస్యను పరిష్కరించాలి’’

కశ్మీర్ సమస్య గురించి ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ "అంతర్జాతీయ చట్టసమ్మతి ప్రకారం జమ్మూ కశ్మీర్ సమస్య పరిష్కారం కానంతవరకూ దక్షిణ ఆసియాలో శాంతిభద్రతలు నెలకొనడం అసాధ్యమని, భద్రతా మండలి జోక్యం చేసుకుని ఈ సంఘర్షణను నిరోధించాలని" తెలిపారు.

"ఫాసిస్ట్, నిరంకుశ, ఆర్ఎస్ఎస్ నేతృత్వంలోని భారత ప్రభుత్వం పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా దురాక్రమణకు పాల్పడితే, మా దేశం ఎదురుతిరిగి, స్వాతంత్ర్యం కోసం తుది వరకూ పోరాడుతూనే ఉంటుంది" అని అన్నారు.

వీటితోపాటూ గత ఏడాది లేవనెత్తిన అంశాలు.. అభివృద్ధి చెందిన దేశాల నుంచి అక్రమ ఆర్థిక రవాణాలు, వాతావరణ మార్పులు, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఇస్లామోఫోబియా తదితర అంశాల గురించి కూడా పాక్ ప్రధాని మాట్లాడారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడుతూ...

పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్, నాజీల నుంచి ప్రేపణ పొందిందన్నారు.

నాజీలు యూదులను ద్వేషిస్తే, ఆర్ఎస్ఎస్ మద్దతుదారులు ముస్లింలను, కొంత మేరకు క్రిస్టియన్లను ద్వేషిస్తున్నారని, గాంధీ, నెహ్రూ కలలు కన్న లౌకికవాద దేశానికి బదులు హిందూ దేశాన్ని తయారుచేస్తున్నారని విమర్శించారు.

2002 గుజరాత్ అల్లర్ల గురించి కూడా ఇమ్రాన్ ప్రస్తావించారు.

నితంత్రణ రేఖ వద్ద భారత్ కవ్వింపు చర్యలు చేపట్టినప్పటికీ పాకిస్తాన్ సంయమనంతో వ్యవహరిస్తోందని, శాంతియుత పరిష్కారం కోసం పాకిస్తాన్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

ఐక్యరాజ్యసమితిలో ఇండియా మిషన్ ప్రథమ కార్యదర్శి (ఫస్ట్ సెక్రటరీ) మిజితో వినితో

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, ఇమ్రాన్‌ఖాన్ ప్రసంగానికి ఐక్యరాజ్యసమితిలో ఇండియా మిషన్ ప్రథమ కార్యదర్శి (ఫస్ట్ సెక్రటరీ) మిజితో వినితో బదులిచ్చారు

మత మైనారిటీలను హింసిస్తున్నారు: భారత్

ఇమ్రాన్ ఖాన్ చేసిన ప్రసంగంలోని అంశాలను భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది.

ఐక్యరాజ్య సమితి భారత శాశ్వత ప్రతినిధి టీఎస్‌ తిరుమూర్తి మాట్లాడుతూ.. పాకిస్తాన్ దౌత్యపరంగా మరింత కిందకి దిగజారిందని విమర్శించారు.

‘‘ఇదంతా తప్పుడు ప్రచారాలు, వ్యక్తిగత దాడి, యుద్ధానికి ఉసిగొల్పడం, మైనారిటీలని హింసించడం, సరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని సంరక్షించడానికి చేస్తున్న ప్రయత్నం’’ అని ప్రత్యారోపణలు చేశారు.

ఇమ్రాన్ ఖాన్ ప్రసంగాన్ని ప్రారంభించగానే ఐక్యరాజ్యసమితిలో ఇండియా మిషన్ ప్రథమ కార్యదర్శి (ఫస్ట్ సెక్రటరీ) మిజితో వినితో సభ నుంచి వాకౌట్ చేశారు.

భారతదేశం తరఫున మిజితో వినితో మాట్లాడుతూ "జమ్మూకశ్మీర్ భూభాగం భారతదేశంలో అంతర్భాగం. అక్కడి చట్టాలు, విధానాలు భారత అంతర్గత వ్యవహారాలు. కశ్మీర్‌లో ఉన్న ఒకే ఒక్క సమస్య పాకిస్తాన్ దురాక్రమణ. అక్కడ అక్రమంగా స్వాధీనం చేసుకున్న ప్రాంతాలన్నిటినీ పాకిస్తాన్ విడిచిపెట్టాలని కోరుతున్నాం" అని పేర్కొన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

ఉగ్రవాదానికి నిధులు సమకూర్చే దేశం పాకిస్తాన్ అని.. ఒసామా బిన్ లాడెన్‌ను అమర వీరుడు అని ఇమ్రాన్ ఖాన్ పార్లమెంటులో కొనియాడారని ఆయన తప్పుపట్టారు.

"ఇప్పటికి తమ దేశంలో 30 నుంచీ 40 వేల మంది ఉగ్రవాదులు ఉన్నారని గత ఏడాది అమెరికాలో అంగీకరించారు. దైవదూషణ చట్టం, మత మార్పిడుల ద్వారా తమ దేశంలోని మైనారిటీలైన హిందూ, క్రైస్తవ, సిక్కు మతస్థులను క్రమపద్ధతిలో నాశనం చేస్తున్నారు. పాకిస్తాన్‌లోని ఇతర ముస్లిం సంప్రదాయాలు పాటించేవారిని కూడా హింసిస్తున్నారు" అని ఆరోపించారు.

"తమ గురించి చెప్పుకోడానికి ఏమీ లేని, ప్రపంచానికి విజయాలు, సూచనలు అందించలేని వ్యక్తి మాటలు విన్నాం. అబద్ధాలు, తప్పుడు సూచనలు, ద్వేషాన్ని చూశాం" అని వ్యాఖ్యానించారు.

"పాకిస్తాన్ మామూలు దేశంగా మారాలంటే ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం మానేసి, తమ దేశంలోని సమస్యలపై దృష్టి పెట్టాలి. ఐక్యరాజ్య సమితి వేదికగా తప్పుడు ప్రచారాలు ఆపివేయాలి" అని మిజితో వినితో సూచించారు.

పోస్ట్‌ Facebook స్కిప్ చేయండి

కంటెంట్ అందుబాటులో లేదు

మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of Facebook ముగిసింది

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)