భారత్‌కు హార్లీ డేవిడ్‌సన్ గుడ్‌బై... బైకుల తయారీని, విక్రయాలను నిలిపేస్తున్న అమెరికా దిగ్గజ సంస్థ - BBC News reel

ఫొటో సోర్స్, Getty Images
ప్రపంచంలోనే అతిపెద్ద మోటార్ సైకిల్ మార్కెట్ భారత్‌కు అమెరికా దిగ్గజ సంస్థ హార్లీ డేవిడ్‌సన్ గుడ్‌బై చెప్పనుంది.
భారత్‌లో విక్రయాలతోపాటు బైక్‌ల తయారీని నిలిపివేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది.
భారత్‌లో పన్నులు విపరీతంగా వేయడంతో కొత్త షోరూంలు తెరిచే ప్రతిపాదనను పక్కన పెట్టేసినట్లు ఇటీవల టయోటా ప్రకటించింది. అనంతరం కొన్నివారాల్లోనే హార్లీ డేవిడ్‌సన్ తాజా నిర్ణయం తీసుకుంది.
విదేశీ ఆటోమొబైల్ సంస్థలను భారత్‌కు తీసుకురావాలనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లక్ష్యాలకు తాజా పరిణామం ఎదురుదెబ్బని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
హరియాణాలోని బవాల్‌లోని సంస్థ ప్లాంట్‌ను ప్రస్తుతం మూసేస్తున్నారు. 2011లో దీన్ని తెరిచారు. అయితే జపాన్‌కు చెందిన హోండా సంస్థ నుంచి డేవిడ్‌సన్‌కు ఇక్కడ గట్టి పోటీ ఎదురవుతోంది.
భారత్‌లో ఏటా 1.7 కోట్ల మోటార్ సైకిళ్లు, స్కూటర్లు అమ్ముడవుతుంటాయి.
మిగతా అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోలిస్తే.. విదేశీ సంస్థలు భారత్‌లో రాణించడం కొంచెం కష్టమే.
2017లో జనరల్ మోటార్స్.. భారత్ విపణికి గుడ్‌బై చెప్పింది.

ఫొటో సోర్స్, Ani
బిహార్ అసెంబ్లీ ఎన్నికల తేదీల విడుదల
బిహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మూడు దశల్లో ఉంటుందని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా ప్రకటించారు.
అక్టోబరు 28న మొదటి విడత, నవంబరు 3న రెండో విడత, నవంబరు 7న మూడో విడత పోలింగ్ ఉంటుంది. నవంబరు 10న ఫలితాలు వెల్లడిస్తారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
మొదటి దశ
నోటిఫికేషన్ విడుదల: అక్టోబరు 1
నామినేషన్లకు చివరి తేదీ: అక్టోబరు 8
నామినేషన్ల పరిశీలన: అక్టోబరు 9
ఉపసంహరణ గడువు: అక్టోబరు 12
పోలింగ్: అక్టోబరు 28
ఫలితాలు: నవంబరు 10
రెండో దశ
నోటిఫికేషన్ విడుదల: అక్టోబరు 9
నామినేషన్లకు చివరి తేదీ: అక్టోబరు 16
నామినేషన్ల పరిశీలన: అక్టోబరు 17
ఉపసంహరణ గడువు: అక్టోబరు 19
పోలింగ్: నవంబరు 3
ఫలితాలు: నవంబరు 10
మూడో దశ
నోటిఫికేషన్ విడుదల: అక్టోబరు 13
నామినేషన్లకు చివరి తేదీ: అక్టోబరు 20
నామినేషన్ల పరిశీలన: అక్టోబరు 21
ఉపసంహరణ గడువు: అక్టోబరు 23
పోలింగ్: నవంబరు 7
ఫలితాలు: నవంబరు 10
కోవిడ్ జాగ్రత్తలు
కరోనా మహమ్మారి నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నాయకులు, అభ్యర్థులు, ఓటర్ల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రచారం, పోలింగ్‌కు సంబంధించి మార్గదర్శకాలు రూపొందించారు.
7 లక్షల హ్యాండ్ శానిటైజర్లు, 46 లక్షల మాస్కులు, 6.7 లక్షల పీపీఈ కిట్‌లు, 23 లక్షల జతల గ్లోవ్స్ సిద్ధం చేసినట్లు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా చెప్పారు. ఓటర్ల కోసం సింగిల్ యూజ్ హ్యాండ్ గ్లోవ్స్ 7.2 కోట్లు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
243 అసెంబ్లీ స్థానాలున్న బిహార్ అసెంబ్లీ గడువు ఈ ఏడాది అక్టోబరు 29తో ముగియనుంది.

ఫొటో సోర్స్, Kings XI Punjab
IPL 2020: రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై 97 పరుగులతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ విజయం
దుబయిలో జరిగిన ఐపీఎల్ ఆరో మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు 97 పరుగుల భారీ తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును ఓడించింది.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇచ్చిన 207 పరుగుల విజయలక్ష్యాన్ని అందుకోవడంలో విఫలమైన రాయల్ చాలెంజర్స్ జట్టు ఆటగాళ్లు 17 ఓవర్లలో 109 పరుగులు చేసి అంతా అవుటయ్యారు.

ఫొటో సోర్స్, Ipl
రాయల్ చాలెంజర్స్ ఇన్నింగ్స్ వికెట్ల పతనంతో మొదలైంది. షెల్డన్ కాట్రెల్ వేసిన మొదటి ఓవర్లో దేవదత్త్ ఒక్క పరుగు మాత్రమే చేసి అవుటయ్యాడు.
తర్వాత ఓవర్లోనే రెండో వికెట్ పడింది. జాష్ ఫిలిప్ ఖాతా తెరవకుండానే మహమ్మద్ షమీ బంతికి ఎల్‌బీడబ్ల్యు అయ్యాడు.
మూడో ఓవర్లో టీమ్‌కు కోలుకోలేని దెబ్బ పడింది. ఈసారీ ఐదు బంతులు ఆడిన కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. విరాట్ కోహ్లీ షెల్డన్ కాట్రెల్ బౌలింగ్‌లో రవి బిష్ణోయ్‌కు క్యాచ్ ఇచ్చాడు.
వరసగా మూడు ఓవర్లలో మూడు వికెట్లు పడిపోయాక ఆరోన్ ఫించ్(20), ఏబీ డివిలియర్స్(28) జట్టును కాసేపు ఆదుకున్నారు. 8, 9 ఓవర్లలో ఇద్దరూ అవుటవడంతో జట్టు మళ్లీ కష్టాల్లో పడిపోయింది.
30 పరుగులు చేసిన వాషింగ్టన్ సుందర్ జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. శివం దుబే(12) అవుటయిన తర్వాత బౌలర్లు అందరూ సింగిల్ డిజిట్‌కే పెవిలియన్ చేరడంతో జట్టు 17 ఓవర్లలోనే 109 పరుగులకు అలౌట్ అయ్యింది.

ఫొటో సోర్స్, facebook/Kings XI Punjab
కేఎల్ రాహుల్ సెంచరీ
రాయల్ చాలెంజర్స్ బెంగ9ళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
పంజాబ్ టీమ్ నిర్ధారిత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది.
పంజాబ్ జట్టులో 14 ఫోర్లు, 7 సిక్సర్లతో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన కేఎల్ రాహుల్ 69 బంతుల్లో 132 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
15 పరుగులు చేసిన కరుణ్ నాయర్ చివరి వరకూ కెప్టెన్‌కు అండగా నిలిచాడు. ఇద్దరూ కలిసి జట్టు స్కోరును 200 దాటించారు.
జట్టులో మయాంక్ అగర్వాల్(26), నికొలస్ పూరన్(17), గ్లెన్ మాక్స్‌వెల్(3) పరుగులు చేశారు.
పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఇచ్చిన రెండు క్యాచ్‌లను రాయల్ చాలెంజర్స్ కెప్టెన్ విరాట్ కోహ్లీ డ్రాప్ చేయడం కూడా జట్టు ఓటమికి కారణం అయ్యింది.
17 ఓవర్లో రాహుల్ 87 పరుగులు దగ్గర ఉన్నప్పుడు డేల్ స్టెయిన్ బౌలింగ్‌లో బంతి గాల్లోకి లేచింది. ఆ క్యాచ్ కోహ్లీ డ్రాప్ చేశాడు. నవదీప్ సైనీ వేసిన తర్వాత ఓవర్లోనే వచ్చిన మరో క్యాచ్‌ను కూడా నేలపాలు చేశాడు.
రెండు లైఫ్‌లు రావడంతో చెలరేగిన కేఎల్ రాహుల్ జట్టుకు భారీ స్కోర్ అందించాడు.
ఇవి కూడా చదవండి:
- నగ్నంగా పరుగెడుతున్న మహిళపై 36 రౌండ్లు కాల్పులు జరిపారు...
- చెంచాడు గోధుమ పిండి చాలు మీ శానిటైజర్ మంచిదో కాదో చెప్పడానికి
- చైనాలో మరో ఇన్ఫెక్షన్... 4 వేల మందికి సోకిన బ్రుసెలోసిస్ బ్యాక్టీరియా లక్షణాలేంటి?
- వారంలో ఆరు రోజులు సబ్‌రిజిస్ట్రార్.. ఆదివారం వ్యవసాయ కూలీ
- శ్రీలంక ప్రజలు ఆకలి బారిన పడకుండా పనస కాయలే కాపాడుతున్నాయా...
- కరోనావైరస్ వంటి ప్రాణాంతక మహమ్మారులు సహజంగానే అంతరించిపోతాయా? అదెలా సాధ్యం?
- PCOD: ''తనకు పీరియడ్స్ సరిగా రావు.. ఎప్పుడూ లేటే.. పిల్లలు పుట్టే అవకాశం వుందో లేదో చూడండి’’
- మోదీ ప్రభుత్వం చైనా బ్యాంక్ నుంచి కోట్ల డాలర్ల రుణం తీసుకుందా? నిజం ఏంటి? - BBC Fact Check
- 'కరోనావైరస్ నుంచి కోలుకున్నాను... కానీ, కంప్యూటర్ స్క్రీన్ నన్ను దెయ్యంలా వెంటాడుతోంది'
- ప్రపంచంలో తొలి టీకా ప్రచారాన్ని భారత రాణులే చేపట్టారా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








