ఐపీఎల్ 2020: దుబాయ్ నుంచి వచ్చేసిన సురేశ్ రైనా మౌనం వీడాడు.. తన బాధేంటో చెప్పాడు

సురేశ్ రైనా

ఫొటో సోర్స్, ANTHONY AU-YEUNG-ICC

భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా ఇటీవల పతాక శీర్షికల్లో నిలుస్తున్నాడు. కరోనా వల్ల ఈ ఏడాది దుబయిలో జరగబోతున్న ఐపీఎల్ టోర్నీని వదిలి రైనా తిరిగి భారత్ వచ్చేశాడు.

చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం సురేశ్ రైనా వ్యక్తిగత కారణాలతో తిరిగి భారత్ వెళ్లాడని, ఈ ఏడాది అతడు ఐపీఎల్‌లో ఆడడని అధికారికంగా ప్రకటించింది.

రైనా ఐపీఎల్ కోసం దుబయిలో ఉన్నప్పడు, పంజాబ్‌లోని ఆయన మేనత్త ఇంటిపై కొందరు దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో ఆయన మామయ్య చనిపోయారు. అత్తయ్య, ఆమె ఇద్దరు కొడుకులు తీవ్రంగా గాయపడ్డారు.

దుబయి నుంచి తిరిగి వచ్చిన తర్వాత దీనిపై ఏదీ మాట్లాడని సురేశ్ రైనా ఇన్నాళ్లకు మౌనం వీడాడు.

ఒక ట్వీట్ చేసిన రైనా సోమవారం ఈ దాడిలో గాయపడ్డ ఒక కజిన్ కూడా చనిపోయాడని చెప్పాడు. తన అత్తయ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని తెలిపాడు.

సురేశ్ రైనా తన ట్వీట్‌లో పంజాబ్ పోలీసులపై ప్రశ్నలు లేవనెత్తారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

“పంజాబ్‌లో మా కుటుంబానికి చాలా దారుణం జరిగింది. మా మామయ్యను చంపేశారు. మా అత్తయ్య, ఇద్దరు కజిన్‌లు తీవ్రంగా గాయపడ్డారు. దురదృష్టవశాత్తూ కొన్ని రోజులు ప్రాణాలతో పోరాడిన ఒక కజిన్ నిన్న రాత్రి చనిపోయాడు. మా అత్తయ్య పరిస్థితి ఇప్పటికీ విషమంగా ఉంది. ఆమె లైఫ్ సపోర్ట్ మీద ఉన్నారు” అన్నాడు.

"ఆ రోజు రాత్రి ఏం జరిగిందో మాకు ఇప్పటికీ తెలీలేదు. ఈ అంశంపై దృష్టి పెట్టాలని నేను పోలీసులను కోరుతున్నా.. కనీసం, ఈ పని ఎవరు చేశారనేదైనా మాకు తెలుస్తుందని అనుకుంటున్నా. మరిన్ని నేరాలు చేసేలా ఆ నేరస్థులను వదిలిపెట్టకూడదు" అని కూడా ట్విటర్‌లో పెట్టాడు.

రైనా తన ట్వీట్‌లో పంజాబ్ ముఖ్యమంత్రి కార్యాలయం, ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్‌ను కూడా ట్యాగ్ చేశారు. అయితే ఐపీఎల్ వదిలేసి రావడం గురించి రైనా ట్వీటర్‌లో ఏదీ పెట్టలేదు.

పంజాబ్ పఠాన్‌కోట్‌లో ఉంటున్న ఆయన మేనత్త ఇంట్లో ఆగస్టు 19న రాత్రి కొందరు దుండగులు దోపిడీకి ప్రయత్నించారు.

ఆ సమయంలో వారు పదునైన ఆయుధాలతో సురేశ్ రైనా మేనత్త, మామయ్యలను గాయపరిచారు. రైనా మామయ్య 58 ఏళ్ల అశోక్ తరాల్ అదే రాత్రి చనిపోగా, మేనత్తను ఆస్పత్రిలో చేర్పించారు. ఆమెకు డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. కానీ, ఆమె పరిస్థితి విషమంగా ఉంది.

ధోనీతో పాటూ రిటైర్మెంట్ ప్రకటించిన రైనా

ఫొటో సోర్స్, HINDUSTAN TIMES

ఫొటో క్యాప్షన్, ధోనీతో పాటూ రిటైర్మెంట్ ప్రకటించిన రైనా

అంతర్జాతీయ క్రికెట్ నుంచ రిటైర్మెంట్, ఐపీఎల్ వివాదం

మహేంద్ర సింగ్ ధోనీతో కలిసి అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్ అవుతున్నట్టు ఆగస్టు 15న సురేశ్ రైనా ప్రకటించాడు. కానీ ధోనీ కెప్టెన్‌గా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌లో అతడు కూడా భాగం.

సురేశ్ రైనా భారత్ తరఫున 18 టెస్టులు, 226 వన్డేలతోపాటూ 78 టీ-20లు ఆడాడు. 226 వన్డేల్లో ఐదు సెంచరీలతో 5,615 పరుగులు చేసిన రైనా, టీ-20 క్రికెట్‌లో ఒక సెంచరీతోపాటూ 1,605 పరుగులు చేశాడు. 18 టెస్ట్ మ్యాచుల్లో 768 పరుగులు చేశాడు.

సురేశ్ రైనాను మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి సన్నిహితుడుగా భావిస్తారు. రైనా రిటైర్మెంట్ పోస్టును చూస్తే మనకు ఆ విషయం అర్థమవుతుంది. ఆగస్టు 15న ధోనీ రిటైర్ అవుతున్నట్టు ప్రకటించిన కొన్ని గంటల్లోనే రైనా కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ ద్వారా తన రిటైర్మెంట్ ప్రకటించాడు.

పోస్ట్‌ Instagram స్కిప్ చేయండి
Instagram ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of Instagram ముగిసింది

రైనా ఆ పోస్టులో “ధోనీ, మీతో ఆడడం చాలా బాగా అనిపించింది. ఎంతో గర్వంతో ఈ ప్రయాణంలో మీతో పాటూ కలవాలనుకుంటున్నా. థాంక్యూ ఇండియా, జైహింద్ అని పెట్టాడు.

తర్వాత రైనా చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌తో జాయిన్ అయ్యారు. దుబయి చేరుకున్నాడు. టీమ్ ప్రస్తుతం అక్కడ ప్రాక్టీస్ చేస్తోంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

ఈలోపు చెన్నై సూపర్ కింగ్స్ హఠాత్తుగా ఒక ట్వీట్ చేసింది. “రైనా వ్యక్తిగత కారణాలతో తిరిగి స్వదేశానికి వెళ్తున్నాడని, ఈ ఏడాది ఐపీఎల్‌లో ఆడలేడ”ని ప్రకటించింది.

అదే సమయంలో ఐపీఎల్‌ కోసం దుబయి వెళ్లిన చాలా మంది ఆటగాళ్లు, అధికారులకు కరోనా వచ్చిందని కూడా వార్తలు వచ్చాయి. తర్వాత, ఈ టోర్నీ కోసం యూఏఈ వెళ్లిన 13 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని, వారిలో ఇద్దరు ఆటగాళ్లని బీసీసీఐ కూడా అంగీకరించింది.

“కరోనా పాజిటివ్ వచ్చిన వారికి, వారికి దగ్గరకా ఉన్నవారిలో ఎలాంటి లక్షణాలు లేవు. వారిని టీమ్‌లో మిగతావారికి దూరంగా ఉంచాం. ఐపీఎల్ మెడికల్ టీమ్ వారి ఆరోగ్యంపై దృష్టి పెట్టింది” అని బీసీసీఐ చెప్పింది.

మిగతా రిపోర్టుల్లో మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు సంబంధించిన 10 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని. వారిలో ఒక భారత క్రికెటర్ కూడా ఉన్నాడని చెప్పారు. వారు ఎవరనేదానిపై ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.

మరోవైపు, సురేశ్ రైనా బంధువులపై దాడి జరిగినట్లు వార్తలు వచ్చాయి. అయితే కొన్ని మీడియా చానళ్లలో మాత్రం దుబయిలో హోటల్ గది గురించి సురేశ్ రైనాకు గొడవ వచ్చిందని చెప్పారు.

అయితే, చెన్నై సూపర్ కింగ్స్ యజమాని ఎన్.శ్రీనివాసన్ మాత్రం తమ జట్టు ఎప్పుడూ సురేశ్ రైనాకు తోడుగా నిలుస్తుందని చెప్పాడు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

“సురేశ్ రైనా చెన్నై సూపర్ కింగ్స్ కు అద్భుత భాగస్వామ్యాలు అందించాడు. ఈ సమయంలో జట్టు నుంచి అతడికి పూర్తి మద్దతు ఉంటుంది” అన్నాడు.

చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఐపీఎల్‌లో 189 ఇన్నింగ్స్ ఆడిన సురేశ్ రైనా 5,368 పరుగులు చేశాడు. వీటిలో ఒక సెంచరీ, 38 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్‌లో రైనా స్ట్రైక్ రేట్ 137.14గా ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)