అన్‌లాక్ 4: మెట్రో రైళ్లు నడుస్తాయి.. సినిమా హాళ్లకు అనుమతి లేదు

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కరోనావైరస్ లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా కొన్ని కొత్త మార్గదర్శకాలు విడుదలు చేసింది. ఈ అన్‌లాక్-4 మార్గదర్శకాలలో అత్యధికం సెప్టెంబరు 1 నుంచి అమల్లోకి వస్తాయి.
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి వచ్చిన సూచనలు స్వీకరిస్తూ ఈ అన్‌లాక్ 4 మార్గదర్శకాలు రూపొందించినట్లు కేంద్రం వెల్లడించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
సెప్టెంబరు 7 నుంచి మెట్రో రైళ్లు తిరుగుతాయి
* సెప్టెంబరు 7 నుంచి దశలవారీగా, ప్రాంతాలవారీగా మెట్రో రైళ్లు తిప్పేందుకు అనుమతిస్తున్నారు.
* సామాజిక, విద్యా, క్రీడా, వినోద, సాంస్కృతిక, మత, రాజకీయపరమైన ఫంక్షన్లకు అనుమతిస్తారు. అయితే, 100 మందికి మించి పాల్గొనడానికి వీల్లేదు. ఇది సెప్టెంబరు 21 నుంచి అమల్లోకి వస్తుంది.
మాస్కు ధరించడం, భౌతిక దూరం తప్పనిసరి. థర్మల్ స్కానింగ్, శానిటైజర్ వంటి ఏర్పాట్లు ఉండాలి.
* సెప్టెంబరు 21 నుంచి ఓపెన్ ఎయిర్ థియేటర్లు తెరిచేందుకు అనుమతిస్తారు. సినిమా థియేటర్లకు మాత్రం అనుమతి లేదు.

ఫొటో సోర్స్, Getty Images
అంతర్రాష్ట్ర ప్రయాణాలపై నిషేధం లేదు
రాష్ట్రాల్లో ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు ప్రయాణించడానికి కానీ.. దేశంలోని వివిధ రాష్ట్రాల మధ్య ప్రయాణానికి కానీ ఎలాంటి నియంత్రణ లేదు.
ఇంతకుముందులా దీనికి ప్రత్యేక అనుమతులు కానీ, ఈ-పర్మిట్లు కానీ అవసరం లేదు.
సెప్టెంబరు 30 వరకు స్కూళ్లు, కాలేజీలు తెరవడానికి వీల్లేదు
* స్కూళ్లు, కాలేజీలు, ఇతర విద్యాసంస్థలేవీ సెప్టెంబరు 30 వరకు తెరవడానికి వీల్లేదని కేంద్రం చెప్పింది. ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించుకోవచ్చు.
* ఆన్ లైన్ క్లాసులు, టెలీ కౌన్సెలింగ్ వంటివాటి కోసం 50 శాతం వరకు సిబ్బందిని ఆయా సంస్థలకు వచ్చి పనిచేసేందుకు అనుమతించొచ్చు.
* కంటెయిన్మెంట్ జోన్ల బయటకు ఉన్న విద్యాసంస్థల్లో చదివే 9 నుంచి 12వ తరగతి విద్యార్థులు ఉపాధ్యాయుల గైడెన్స్ కోసం రావాలనుకుంటే స్వచ్ఛందంగా రావొచ్చు. అయితే, ఇందుకు వారి తల్లిదండ్రులు, సంరక్షకుల నుంచి రాతపూర్వక అనుమతి ఉండాలి.

ఫొటో సోర్స్, Getty Images
సినిమా హాళ్లు, ఎంటర్‌టైన్‌మెంటు పార్కులకు అనుమతుల్లేవు
* అనేక సడలింపులు ఇచ్చినప్పటికీ సినిమా హాళ్లు, స్విమింగ్ పూల్స్, ఎంటర్‌టైన్‌మెంట్ పార్కులు,, థియేటర్లు(ఓపెన్ ఎయిర్ థియేటర్లు కావు) వంటివి కంటెయిన్మెంట్ జోన్ల బయట ఉన్నప్పటికీ వాటిని తెరిచేందుకు అనుమతుల్లేవు.
* హోం మంత్రిత్వ శాఖ అనుమతి లేకుండా అంతర్జాతీయ ప్రయాణాలకు అవకాశం లేదు.
* కంటెయిన్మెంట్ జోన్లలో సెప్టెంబరు 30 వరకు కఠిన లాక్ డౌన్ అమల్లో ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
- ’టెస్ట్ చేయకుండానే కోవిడ్ వార్డులో పెట్టారు... మా అమ్మా, నాన్న మరణంపై విచారణ జరిపించాలి’
- భవిష్యత్తులో ఉద్యోగాల పరిస్థితి ఏమిటి? ఏయే రంగాల్లో అవకాశాలు ఉంటాయి?
- ఫైనల్ పరీక్షలు రాయకుండా విద్యార్థుల్ని ప్రమోట్ చేయొద్దు - సుప్రీం కోర్టు తీర్పు
- రెండో ప్రపంచ యుద్ధం జపాన్ రాజకీయాలను ఎలా ప్రభావితం చేసింది?
- గుండెల్ని పిండేసే వ్యథ: జైలుకు వెళ్లేందుకు పదేపదే నేరాలు చేస్తున్న జపాన్ వృద్ధులు.. ఎందుకంటే...
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
- మరణ శిక్ష అమలుకు ముందు ఖైదీలు కోరుకున్న చివరి భోజనం ఏమిటో తెలుసా
- కరోనావైరస్: స్కూళ్లను కోళ్ల పరిశ్రమల్లా మార్చేస్తున్నారు
- సరకులు కొనేటప్పుడు ఆ ప్యాకెట్లను పట్టుకుంటే కరోనావైరస్ సోకుతుందా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








