పన్ను సంస్కరణలు: మోదీ చెప్పిన కొత్త విధానంతో వేతన జీవులకు లాభమేనా

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సల్మాన్ రావి
- హోదా, బీబీసీ ప్రతినిధి
కరోనావైరస్‌తో ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమైన సమయంలో పన్నులు లెక్కించే కొత్త విధానాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు.
ఈ కొత్త నిబంధనల తర్వాత కొత్తగా ఎంతమంది ఈ పన్ను వ్యవస్థలోకి వస్తారన్న ప్రశ్నలు అలాగే ఉన్నాయి.
ఇంతకు ముందుతో పోల్చితే ఆదాయ పన్ను శాఖ తన పన్ను వసూళ్ల లక్ష్యాలను అందుకోలేదేమో అనే ఆందోళనా ఆర్థిక రంగ నిపుణుల నుంచి వ్యక్తమవుతోంది.
ఈ కొత్త వ్యవస్థను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ‘పారదర్శక పన్ను వ్యవస్థ’గా చెప్పారు. ఈ వ్యవస్థ న్యాయబద్ధంగా, హేతుబద్ధంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కొత్త వ్యవస్థను వచ్చే సెప్టెంబర్ 25 నుంచి అమల్లోకి వస్తుంది.
కొత్త పన్ను సంస్కరణలను ప్రకటించిన ప్రధాని “టాక్స్ సిస్టమ్ ఇక ఫేస్‌లెస్ అవుతున్నా, ఇది పన్ను చెల్లించేవారికి ఫెయిర్‌నెస్, ఫియర్‌లెస్‌నెస్ భరోసాను అందిస్తుంది. పన్ను చెల్లించగల సామర్థ్యం ఉన్నవారు టాక్స్ నెట్‌లో లేరు. వారు స్వయం ప్రేరణతో ముందుకు రావాలి, ఇది నా అభ్యర్థన, ఆశ కూడా” అన్నారు.
అయితే, ఈ కొత్త వ్యవస్థ నుంచి భారీ కుంభకోణాలు, పన్ను ఎగవేత కేసులు, నల్ల ధనం, బినామీ ఆస్తులు, అంతర్జాతీయ పన్నులను మినహాయించారు.
పన్నులు చెల్లించే ఉద్యోగవర్గాలకూ దీని నుంచి కొంత ప్రయోజనం లభిస్తుంది. కానీ దీనివల్ల వ్యాపారులకే ఎక్కువ లాభం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ప్రధానమంత్రి తన ప్రకటనలో “ఇప్పటివరకూ మనం ఏ నగరంలో ఉన్నామో అక్కడి పన్నుల విభాగమే స్క్రూటినీ, నోటీసులు, సర్వే, స్వాధీనం వంటివన్నీ చూసేది. ఇప్పుడు స్క్రూటినీ కేసులను దేశంలో వేరే ప్రాంతాల్లో, ఏ అధికారికో కేటాయిస్తారు. వచ్చే ఆదేశాలను మరో రాష్ట్రానికి సంబంధించిన టీమ్ సమీక్షిస్తుంద’’ని చెపపారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ఫేస్‌లెస్ మూల్యాంకనం అంటే?
- ఆదాయపన్ను శాఖ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు.
- పన్నుచెల్లింపుదారుల ఎంపిక డేటా అనలిస్టులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కంప్యూటర్ ద్వారా జరుగుతుంది.
- ఒక నగరంలో ఆధాయ పన్ను అసెస్‌మెంట్ ఆదేశం, మరో నగరంలో రివ్యూ, మూడో నగరంలో దానికి తుది రూపం ఇస్తారు.
- ఆదాయపన్ను అధికారులకు కేసును ఆటోమేటిక్ విధానంలో కంప్యూటర్ కేటాయిస్తుంది.
- అధికారుల అధికార పరిధికి తెరపడుతుంది.
- డైరెక్ట్ కాంటాక్ట్ లేకుండా పన్ను నిర్ధరిస్తారు.
- పన్ను చెల్లింపులో ఫిర్యాదులకు ఫేస్‌లెస్ సౌకర్యం అందిస్తారు.
- అధికారితో కాకుండా, అధికారుల బృందం ద్వారా కేసును సమీక్షిస్తారు.
కొత్త పన్ను వ్యవస్థపై ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్‌కు చెందిన చాంద్ వాధ్వా మాట్లాడుతూ “దీనిని సరళంగా చెప్పాలంటే.. జీతం, టీడీఎస్, రెంట్ గురించి ప్రజలు స్వయంగా తమ ఆఫీసులో ఏ వివరాలు ఇస్తారో, ఆ వివరాల మొత్తం సమాచారం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటుంది” అన్నారు.

ఫొటో సోర్స్, NARENDRA MODI/YOU TUBE
వేతన జీవులకు ఎలాంటి ప్రయోజనాలున్నాయి
ఇవేకాకుండా అన్ని రకాల ఖర్చులకు సంబంధించిన సమాచారం కూడా ఆన్‌లైన్‌లో ఉంచుతారు. అంటే క్రెడిట్ కార్డ్ ద్వారా ఖర్చు చేసిన మొత్తం, ట్రావెల్ సంబంధిత సమాచారం, మిగతా ఖర్చులు లాంటి ఆన్‌లైన్ చెల్లింపుల మొత్తం సమాచారం ఆటోమేటిగ్గా ఆన్‌లైన్‌లో చేరుతుంది.
వేతనాలపై జీవించే సాధారణ పన్నుచెల్లింపుదారులకు ఈ ప్రయోజనాలు అందుతాయి. ఇది వారికి కూడా సౌకర్యంగానే ఉంటుంది. ఆదాయపన్ను శాఖ ఏది నమ్ముతుందో, ఆ మొత్తం సమాచారాన్ని ఇప్పుడు వారే స్వయంగా ఇవ్వాల్సి ఉంటుంది. అంతకు ముందు ప్రజలకు నోటీసులు అందేవి. ఇక అవి రావు. కేవలం స్పష్టత ఇవ్వాలని మాత్రమే అడుగుతారు. ఆ సమాచారం అప్‌డేట్ చేస్తారు” అని వాధ్వా చెప్పారు.
టీడీఎస్ కట్ అయ్యాక తిరిగి రీఫండ్ పొందే మరో రకం పన్నుచెల్లింపుదారులు కూడా ఇదే శ్రేణిలోకి వస్తారు. దేశంలో టీడీఎస్ రీఫండ్ తీసుకునేవారి సంఖ్య 6 కోట్లకు పైనే ఉంది.
“పన్నులు చెల్లించాలని అనుకుంటున్నప్పటికీ, ఆదాయ పన్ను శాఖ దృష్టిలో ఎప్పుడూ ‘ఎగవేతదారులు’గా నిలిచిన వ్యాపారులకు దీనివల్ల ఎక్కువ ప్రయోజనం లభిస్తుంది” అంటారు వాధ్వా.

ఫొటో సోర్స్, EPA
వ్యాపారులకు ప్రయోజనం
వాధ్వా దీనికి ఉదాహరణ కూడా ఇచ్చారు.
“ఎవరైనా ఒక వ్యాపారి స్వచ్చందంగా తన ఆదాయం 5 కోట్ల రూపాయలని ప్రకటించాడని అనుకుందాం. అప్పటికీ, అతడిని గతంలో ఒక నిందితుడిలా చూసేవారు. ఆదాయపన్ను అధికారుల అతడి ఆదాయం 5 కోట్ల కంటే ఎక్కువే ఉంటుందేమో అనుకునేవారు. ఇప్పుడు అలా జరగదు” అని చెప్పారు.
అంతేకాదు, గతంలో ఆదాయ పన్ను శాఖ అధికారులు స్వచ్ఛందంగా ఆదాయం ప్రకటించిన వారితో మీరు మీ మొత్తం రికార్డులు తీసుకుని ఆఫీసుకు రావాలని చెప్పేవారు.
అక్కడే అపనమ్మకం ఏర్పడిందని నిపుణులు చెబుతున్నారు. జనం డబ్బులు ఇచ్చి అసెస్‌మెంట్ చేయించుకునేవారు లేదంటే జరిమానా మొత్తాన్ని తగ్గించుకోడానికి లంచం ఇచ్చేవారు. ఇప్పుడు కొత్త వ్యవస్థలో తమ ఆదాయాన్ని స్వచ్ఛందంగా ప్రకటించేవారిని నిందితుడిలా చూడడం ఉండదు.
ఇక, అలాంటివారి కోసం అసెస్‌మెంట్ కూడా ఆటోమేటిక్ చేస్తారు. అంటే వారు చెల్లించాల్సిన జీఎస్టీ, ఆదాయపన్ను సమాచారం మొత్తం కంప్యూటర్‌లో అందుబాటులో ఉంటుంది. వారు తమ పన్ను చెల్లించడం సులభతరం అవుతుంది.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: బ్రెజిల్లో లక్ష దాటిన కోవిడ్ మరణాలు... భారత్ కూడా అలాంటి తప్పులే చేస్తోందా?
- ఇంటి పనులు చేయడం లేదా? అయితే ఇది చదవండి!
- మహిళల ఆరోగ్యం: ఇంటిపని చేయడం వ్యాయామం కిందకు వస్తుందా?
- 'మోదీజీ, మా ఆయన ఇంటి పనిలో సాయం చేయడం లేదు, మీరైనా చెప్పండి...'
- కరోనావైరస్: వర్క్ ఫ్రమ్ హోమ్ బాటలో కంపెనీలు.. ఇంటి నుంచి ఒంటరిగా పనిచేయటం ఎలా?
- వంట చేశాడు... ఇల్లు ఊడ్చాడు... హింసించే భర్త మనిషిగా మారాడు
- ప్రపంచంలోనే అత్యంత చల్లని కంప్యూటర్... ఇది శత్రు విమానాల్ని అటాక్ చేస్తుందా?
- నిజాయితీగా పన్ను చెల్లించేవారికి కొత్త ప్రయోజనాలు ఉంటాయన్న మోదీ
- కరోనావైరస్: తెలంగాణ, బీహార్, గుజరాత్, యూపీలలో టెస్టులు పెంచాలి - ముఖ్యమంత్రుల సదస్సులో మోదీ
- ముస్లిం పెళ్లి కూతురు, క్రైస్తవ పెళ్లి కొడుకు... హిందూ సంప్రదాయంలో పెళ్లి
- #HisChoice: అవును... నేను హౌజ్ హస్బెండ్‌ని
- కమలా హ్యారిస్ ఎవరు? జో బిడన్ ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఆమెనే ఎందుకు ఎంచుకున్నారు?
- ఇండియా, ఇరాక్, బ్రిటన్, ఆస్ట్రేలియా.. అన్ని చోట్లా అమ్మోనియం నైట్రేట్ టెన్షన్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








