ఇర్ఫాన్ ఖాన్ కుమారుడు బాబిల్: సిక్స్ ప్యాక్ హీరోల చేతిలో మా నాన్న ఓడిపోయాడు

ఫొటో సోర్స్, Babil.I.K
ఇర్ఫాన్ ఖాన్.. కొద్దిరోజుల కిందట క్యాన్సర్‌తో కన్నుమూసిన బాలీవుడ్ విలక్షణ నటుడు.
ఇప్పుడాయన తనయుడు తన తండ్రికి చిత్ర పరిశ్రమలో ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయో, అందుకు కారకులెవరో ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వెల్లడించాడు.
అయితే, ప్రత్యేకంగా ఆయన ఎవరి పేరు చెప్పనప్పటికీ బాలీవుడ్‌లో రాజ్యమేలుతున్న ఆశ్రిత పక్షపాతం, దాని ఫలితంగా తన తండ్రి వంటి నటులు ఎలా నష్టపోయారో వివరించాడు.
''సిక్స్ ప్యాక్ శరీరం, ఫొటోషాప్ చేసిన ఐటెం పాటల హీరోల చేతిలో మా నాన్న బాక్స్ ఆఫీస్ దగ్గర ఓడిపోయాడు'' అంటూ ఇర్ఫాన్ తనయుడు బాబిల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
ఇర్ఫాన్ తనయుడు బాబిల్ తన తండ్రికి సంబంధించిన రెండు అరుదైన పొటోలతో పాటు హృదయాన్ని పిండేసేలా రాసిన కొన్ని మాటలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.
ఆ పోస్ట్‌లో ఆయన అనేక అంశాలను ప్రస్తావించాడు. సినీ విద్యార్థిగా తనను తాను ఆవిష్కరించుకున్న బాబిల్.. ప్రపంచ సినిమాలో బాలీవుడ్‌కు అంతగా గౌరవం లేదని అన్నాడు.

ఫొటో సోర్స్, Instagram/babil
బాబిల్ ఇన్‌స్టా పోస్ట్‌లో ఏముందంటే..
''ఒక సినీ విద్యార్థిగా నాకు మా నాన్న చెప్పిన అత్యంత ముఖ్యమైన విషయమేంటో తెలుసా?
నేను ఫిలిం స్కూల్‌కు వెళ్లడానికి ముందు ఆయన ఈ మాట చెప్పారు. ప్రపంచ సినిమాలో బాలీవుడ్ అరుదుగా గౌరవం అందుకుంటుంది కాబట్టి అక్కడ నన్ను నేను నిరూపించుకోవాలని ఆయన హెచ్చరించారు. అయితే, నియంత్రిత పరిస్థితుల్లో ఉన్న బాలీవుడ్‌తో సంబంధం లేని మిగతా భారతీయ సినిమా గురించి చెప్పాలి.
ప్రపంచ సినిమా విభాగంలో భారతీయ సినిమా గురించి ఒకే ఒక పాఠం ఉండేది.. అది 'బాలీవుడ్, మిగతా భారతీయ సినిమా'. ఆ పాఠం చెబుతున్నప్పుడు క్లాసంతా కిచకిచ నవ్వులు.
సత్యజిత్ రే, కే.ఆసిఫ్ వంటివారి నిజమైన భారతీయ సినిమా గురించి సరైన చర్చకు తెరతీయడమే చాలా కష్టం.
భారతీయ ప్రేక్షకులుగా మనం మార్పు కోరుకోకపోవడమే దానికి కారణం.
ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of Instagram ముగిసింది
బాలీవుడ్‌లో ప్రతికూల పరిస్థితుల మధ్యే నా తండ్రి నటించే కళకు పేరు తేవడానికి తన జీవితాన్ని అంకితం చేశాడు.. కానీ, సిక్స్ ప్యాక్ దేహాలతో, ఫొటో షాప్ చేసిన ఐటెం సాంగులతో మూస సినిమాలు తీసేవారి చేతిలో బాక్సాఫీస్ బరిలో ఓడిపోయాడు. (బాక్సాఫీస్ వద్ద ఓడిపోవడమంటే.. విజేతలుగా చెబుతూ మన చుట్టూ ఆవరించిన దుష్ట చట్రంలోని వారిపైనే బాలీవుడ్‌లో ఎక్కువ శాతం పెట్టుబడులు పెడతారు). ప్రేక్షకులుగా మనకూ అదే కావాలి.
మానవత, అస్తిత్వవాదాలపై సినిమా ప్రభావాన్ని తెలుసుకోవడానికి చేసిన అన్ని ప్రయత్నాలూ పక్కకుపోయాయి.
ఇప్పుడు మార్పు కనిపిస్తోంది.. గాలి కొత్త పరిమళాన్ని మోసుకొస్తోంది. నూతనార్థాన్ని వెతుకుతూ నవ యువత బయలుదేరారు.
లోతైన అర్థం కోసం వేస్తున్న ఈ దాహం తీరే వరకు ఇక్కడే ఉండాలి'' అని ఆ పోస్ట్‌లో తన ఆవేదనంతా చెప్పుకొచ్చాడు.
సుశాంత్ మరణం తరువాత ఇప్పుడు రాజకీయ చర్చలు ఎక్కువయ్యాయని తాను చికాకుపడినప్పటికీ అది సానుకూల మార్పును తీసుకొస్తే స్వీకరిస్తామని బాబిల్ అన్నాడు.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్ నుంచి కోలుకున్న వందేళ్ల వృద్ధుడు
- టాంజానైట్ రాళ్లు రెండు దొరికాయి.. రాత్రికి రాత్రే కుబేరుడయ్యాడు
- పిల్లలపై కరోనావైరస్ ప్రభావం అంతంత మాత్రమే - తాజా సర్వే
- కరోనావైరస్ లాక్డౌన్: మనుషులు సహజంగా బద్ధకస్తులా?
- కరోనావైరస్: కోవిడ్-19 పరిణామాల అనంతరం భవిష్యత్తులో చదువులు ఎలా ఉంటాయి
- మీకు మీరే కరోనావైరస్ టెస్ట్ చేసుకోవచ్చు.. గంటలోనే ఫలితం తెలిసిపోతుంది
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
- 'పీపీఈ కిట్లోనే రక్త స్రావం అయిపోతోంది' కరోనా రోజుల్లో నర్సుల కష్టాలు
- సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చివరి గంటల్లో ఏం జరిగిందంటే..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








