ఇర్ఫాన్ ఖాన్: నాకు అరుదైన వ్యాధి ఉంది

కుమారుడు ఆయాన్‌తో కలిసి మీడియాతో మాట్లాడుతున్న ఇర్ఫాన్ ఖాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ విలక్షణ నటుడిగా పేరు గాంచారు

బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ తనకు ‘అరుదైన వ్యాధి’ ఉందని వెల్లడించారు.

అభిమానులు తన ఆరోగ్య పరిస్థితి మీద ఊహాగానాలు చేయవద్దని, వైద్య పరీక్షలు పూర్తయి వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత తానే మరిన్ని వివరాలు వెల్లడిస్తానని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఇర్ఫాన్ ఖాన్ వయసు ఇప్పుడు 51 సంవత్సరాలు. పీకూ, మక్బూల్, హాసిల్, పాన్ సింగ్ తోమార్ వంటి బాలీవుడ్ హిట్ సినిమాలు సహా 100కు పైగా సినిమాల్లో నటించారు.

తెలుగులో మహేశ్‌బాబు హీరోగా నటించిన సైనికుడు సినిమాలో ఇర్ఫాన్ విలన్ పాత్ర పోషించారు.

భారతదేశంలో మంచి పేరున్న అంతర్జాతీయ నటుడు ఇర్ఫాన్ ఖాన్. లైఫ్ ఆఫ్ పై, స్లమ్‌డాగ్ మిలియనీర్, అమేజింగ్ స్పైడర్-మాన్ వంటి ఇంగ్లిష్ సినిమాల్లోనూ ఆయన నటించారు.

ఆయన తన అనారోగ్యం గురించి సోమవారం ట్విటర్‌లో వెల్లడించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

2013లో పాన్ సింగ్ తోమార్‌ సినిమాలో నటనకు గాను ఆయన భారతదేశపు నేషనల్ ఫిల్మ్ అవార్డ్ అందుకున్నారు. బందిపోటుగా మారిన ఒక అగ్రస్థాయి క్రీడాకారుడి జీవిత కథ ఆ సినిమా ఇతివృత్తం.

2013లోనే విడుదలైన ద లంచ్‌బాక్స్ సినిమాలో.. సహోద్యోగికి ఉద్దేశించిన లంచ్‌బాక్స్‌ను పొరపాటుగా అందుకున్న ఒంటరి అకౌంటెంట్ పాత్రకు గాను కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వ్యూయర్స్ చాయిస్ అవార్డ్ గెలుచుకుననారు.

ఆ ఏడాది లండన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పోటీకి ఎంపికైన ఏకైక భారతీయ సినిమా కూడా అదొక్కటే.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)