షారుఖ్ ఖాన్ పుట్టినరోజు: తల్లిది హైదరాబాద్, తండ్రిది పెషావర్

ఫొటో సోర్స్, SUNIL VERMA/AFP/Getty Images
- రచయిత, వందన విజయ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్.. 1965లో దిల్లీలో తాజ్ మొహమ్మద్ ఖాన్, లతీఫ్ ఫాతిమా దంపతులకు జన్మించారు. ఆయనకు సంబంధించిన పది ఆసక్తికర విషయాలు..
1. షారుఖ్ తల్లిది హైదరాబాద్(భారత్), తండ్రిది పెషావర్(పాకిస్తాన్), నానమ్మది కశ్మీర్.
2. చిన్నప్పుడు షారుఖ్‌కు సైన్యంలో చేరాలనే కోరిక ఉండేది. అందుకే కోల్‌కతాలోని సైనిక పాఠశాలలో ప్రవేశం కూడా పొందాడు. అతడు సైన్యంలో చేరేందుకు తల్లి ఒప్పుకోలేదు. (షారుఖ్‌కు 15 ఏళ్ల వయసులోనే 1981లో తండ్రి క్యాన్సర్‌తో చనిపోయారు.)
3. పాఠశాల రోజుల్లో హిందీలో వెనకబడి ఉండేవాడు. ఒకసారి పరీక్షలో పదికి పది మార్కులు వస్తే అతడిని తల్లి తొలిసారి సినిమాకు తీసుకెళ్లారు. ఆ చిత్రం- 'జోశీలా'. హీరో దేవ్ ఆనంద్.
4. అతడు కుర్రోడిగా ఉన్నప్పుడు తాను నటుడు కుమార్ గౌరవ్‌లా ఉంటానని, ఆయన్ను కలవాలని అనుకొనేవాడు.
5. రాహుల్ పేరుతో ఉన్న పాత్రలను షారుఖ్ కనీసం తొమ్మిది సినిమాల్లో పోషించారు.

ఫొటో సోర్స్, Instagram
6. 'దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే' (1995) తీసే సమయానికి రొమాంటిక్ సినిమా చేయాలనే ఆసక్తి లేదు.
7. ఒకసారి అభిమానుల తాకిడి నుంచి తప్పించుకొనేందుకు కారు డిక్కీలో ప్రయాణించారు.
8. షారుఖ్‌కు గౌరి (భార్య) పరిచయమయ్యే సమయానికి ఆమె పాఠశాల విద్యార్థిని. గౌరి ఒకసారి స్నేహితులతో కలిసి ముంబయి వెళ్లింది. ఇది తెలిసి అతడు కూడా ముంబయి చేరుకున్నాడు. గౌరి ఎక్కడుందో తెలియక బీచ్‌లన్నీ వెతికాడు. ఆమెకు ఈత కొట్టడమంటే ఇష్టం. అందుకే బీచ్‌లలో వెతికాడు. చివరకు ఒక బీచ్‌లో గౌరి కనిపించింది. ఆ రోజు రాత్రి అతడు రైల్వే స్టేషన్‌లో నిద్రపోవాల్సి వచ్చింది.
9. ఈ ఏడాది కెనడాలోని వాంకోవర్‌లో షారుఖ్ తొలిసారిగా 'టెడ్' టాక్‌లో పాల్గొన్నారు.
10. షారుఖ్‌కు బొమ్మలంటే చాలా ఇష్టం. ఈ వయసులో కూడా.
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








