మన్‌ కీ బాత్‌లో మోదీ: ‘లద్దాఖ్‌లో మన భూమిపై కన్నేసినవారికి తగిన సమాధానం చెప్పాం’ - చైనా పేరెత్తకుండా వ్యాఖ్యలు

నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, Getty Images

భారత్‌-చైనాల మధ్య ఉద్రిక్తతల గురించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ మన్‌కీబాత్‌లో మాట్లాడారు. భారత భూమిపై కన్నేసిన వారికి తగిన సమాధానం చెప్పామని ఆయన ఈ సందర్భంగా అన్నారు.

భారత సైనిక యోధులు దేశగౌరవాన్ని నిలబెట్టారని మోదీ కొనియాడారు. ''మన సైనికులు సత్తా చూపించారు'' అని అన్నారు. తమ కుమారులను దేశం కోసం అర్పించిన వారి కుటుంబాల త్యాగమే భారత దేశానికి రక్ష అన్నారు ప్రధాని.

‘‘స్నేహాన్ని ఎలా కాపాడుకోవాలో భారత్‌కు తెలుసు. కళ్లలోకి కళ్లు పెట్టి చూసేవారికి తగిన సమాధానం ఇచ్చి తీరతాం. భారతీయ వీర సైనికులు భారత మాత గౌరవానికి ఏమాత్రం భంగం కలగనివ్వరు’’ అని మోదీ అన్నారు.

ఎన్ని సంక్షోభాలు వచ్చినా పొరుగు దేశాల నుంచి భారతదేశానికి ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నామని ప్రధాని మోదీ అన్నారు. దేశం కొత్త మార్గంలోకి అడుగు పెడుతుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ ప్రజల మీద తనకు నమ్మకం ఉందని, కష్ట సమయాల్లో ప్రపంచానికి భారతదేశం ఎన్నోసార్లు సాయం చేసిన విషయాన్ని ప్రపంచం కూడా గుర్తించిందని ఆయన అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

"లద్దాక్‌లో అమరవీరులైన మన సైనిక యోధుల సాహసానికి దేశం మొత్తం నివాళులు అర్పిస్తోంది" అని మోదీ అన్నారు. దేశం మొత్తం వారికి కృతజ్ఞతలు తెలుపుతోందని, తమ సొంత కుటుంబ సభ్యుడు మరణించిన బాధను ప్రతి భారతీయుడు అనుభవిస్తున్నాడని ప్రధాని అన్నారు. తమ కొడుకుల త్యాగాలను చూసి కుటుంబ సభ్యులు గర్విస్తున్నారని, ఇదే దేశానికి బలమని మోదీ మన్‌కీబాత్‌లో వ్యాఖ్యానించారు.

లద్దాక్‌లో చైనాతో జరిగిన ఘర్షణల్లో మరణించిన 20మంది సైనికుల గురించి ప్రధానమంత్రి మాట్లాడారు. బిహార్‌ రాష్ట్రం నుంచి సైనికుడిగా వెళ్లి ప్రాణాలు త్యాగం చేసిన కుందన్‌ కుమార్‌ గురించి, ఆయన తండ్రి అన్న మాటలు తన చెవుల్లో మారుమోగుతున్నాయని మోదీ అన్నారు. ''దేశాన్ని రక్షించడానికి తమ కుటుంబంలో మిగిలిన వారిని, తన మనవళ్లను కూడా సైన్యంలోకి పంపిస్తామని ఆయన అన్నారు. దేశంలో ప్రతి అమరవీరుడి కుటుంబంలో ధైర్యాన్ని నింపే మాటలివి. ఈ కుటుంబాల త్యాగం మరువలేనిది'' అన్నారు మోదీ.

"భారతదేశపు విలువలు నిస్వార్థ సేవకు స్ఫూర్తినింపుతాయి" అని ప్రధాని మోదీ అన్నారు. ఈరోజు కష్టకాలంలో ప్రపంచానికి చేసిన సహాయం, శాంతి, అభివృద్ధిలో భారతదేశపు పాత్రను అందరూ గుర్తించారు. భారతదేశం సోదరభావాన్ని ప్రపంచానికి రుచి చూపించింది'' అన్నారు ప్రధాని. అదే సమయంలో తన సార్వభౌమత్వాన్ని, సరిహద్దులను కాపాడుకోవడంలో భారత్‌ తన బలాన్ని, నిబద్ధతను ఎప్పటికీ చాటుకుంటుంది'' అన్నారు మోదీ.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

అయితే ప్రధాని మోదీ తన మొత్తం ప్రసంగంలో ఎక్కడా చైనా పేరును ప్రస్తావించలేదు. ప్రభుత్వం చేసే ప్రకటనల్లో చైనా పేరు ఎందుకు ప్రస్తావించడంలేదని ప్రతిపక్ష పార్టీ నాయకులు మోదీ ప్రభుత్వానికి ప్రశ్నలు సంధిస్తున్నారు. మన్‌ కీ బాత్ ప్రారంభానికి ముందు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ "జాతీయ రక్షణ, భద్రత గురించి ఎప్పుడు చర్చ జరుగుతుంది?" అని ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)