యస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రాణా కపూర్ అరెస్ట్ :ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, Getty Images
యస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రాణా కపూర్ అరెస్ట్
యస్ బ్యాంకు వ్యవస్థాపకుడు రాణాకపూర్‌ను అరెస్ట్ చేశారంటూ ఆంధ్రజ్యోతి ఓ కథనాన్ని ప్రచురించింది ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
బ్యాంకు సొమ్మును ఇష్టమైన వారికి రుణాలుగా ఇచ్చి ముడుపులు తీసుకున్న కపూర్‌ను ఎన్‌పోర్స్‌మెంట్ డైరక్టరేట్ అధికారులు ఆదివారం అరెస్ట్ చేశారు.
అంతకుముందు ఆయన్ను దాదాపు 20 గంటల సేపు ప్రశ్నించారు.
అక్రమ నగదు లావాదేవీల నిరోధక చట్టం కింద అరెస్ట్ చేసిన కపూర్‌ను ఈ నెల 11 వరకు కస్టడీలో ఉంచి విచారించేందుకు ముంబైలోని సెషన్స్ కోర్టు ఈడీ అధికారులకు అనుమతిచ్చింది.
అటు ఆయన కుమార్తె రోషిణీ కపూర్ లండన్ ప్రయాణాన్ని కూడా అధికారులు అడ్డుకున్నారు.
రాణా కపూర్‌పై నమోదైన కేసులో ఆమెను కూడా ప్రశ్నించాల్సి ఉన్నందున విదేశీ ప్రయాణానికి అనుమతించలేమని ఈడీ అధికారులు చెప్పారు.
ఆమెపై లుకౌట్ నోటీసు ఉన్న విషయాన్ని గుర్తు చేశారు.
రాణా కపూర్‌ని ఈడీ కస్టడీకి అనుమతించిన రోజే ఆమె లండన్‌కు వెళ్లేందుకు ప్రయత్నించడంపై అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయని ఆంధ్రజ్యోతి ఈ కథనంలో తెలిపింది.

ఆంధ్రప్రదేశ్‌లో పురపాలక సంస్థల్లో మహిళకే ప్రాధాన్యం
ఆంధ్రప్రదేశ్‌లోని 103 పురపాలక, నగర పంచాయతీల్లో 51 చైర్మన్ స్థానాలు మహిళలకే ఖరారయ్యాయంటూ ఈనాడు ఓ వార్తను ప్రచురించింది ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
తాజాగా ఖరారైన రిజర్వేషన్ల ప్రకారం ఎస్టీ మహిళ 1, ఎస్సీ మహిళ 7, బీసీ మహిళలకు 17, మహిళ జనరల్ కోటాలో 26 కలిపి మొత్తం 51 స్థానాలను మహిళలకు కేటాయించారు.
పురపాలక శాఖ కమిషనర్ విజయ్ కుమార్ ఆదివారం రిజర్వేషన్లకు సంబంధించిన గెజిట్‌ను విడుదల చేశారు.
ఇదే పురపాలక సంఘాల్లో 2123 వార్డు సభ్యుల స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేశారు.
ఇక పురపాలక, నగర పాలక సంస్థల్లో, నగర పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు ఇవాళ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.

బీసీలకు 34 శాతం సీట్లు
ఇక ఇదే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ పార్టీ తరపున 34శాతం సీట్లను బీసీలకు ఇస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్కొ న్నట్టు సాక్షి ఓ కథనాన్ని ప్రచురించింది .
బీసీలకు రాజ్యాధికారం, సామాజిక న్యాయం దిశగా తీసుకున్న ఈ నిర్ణయం పట్ల బీసీ సంఘాలు, విశ్లేషకులు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఈ వార్తలో తెలిపింది.
న్యాయ స్థానం తాజా ఆదేశాల మేరకు బీసీలకు 24 శాతం మాత్రమే రిజర్వేషన్లు కల్పించాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడిందని ఈ పరిస్థితుల్లో మరోనైత ఎవ్వరైనా అధికారంలో ఉంటే న్యాయపరమైన అంశాన్ని సాకుగా చూపించి బీసీలకు రిజర్వేషన్లను తగ్గించేవారని విశ్లేషకులు పేర్కొంటున్నట్టు ఈ వార్తలో చెప్పుకొచ్చింది.
అటు టీడీపీ కూడా బీసీలకు 34 శాతానికిపైగా స్థానాలకు కేటాయించాలని నిర్ణయించినట్టు ఈనాడు పేర్కొంది.
బీసీలకు టీడీపీ మొదటి నుంచి అండగా ఉంటోందని ఇప్పుడు కూడా వారికే పెద్ద పీట వేస్తున్నామని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పేర్కొన్నారని ఈనాడు తన కథనంలో తెలిపింది.

ఫొటో సోర్స్, NUMBERSUSA
హెచ్1బీ వీసాల్లో మార్పులు
ఐటీ కంపెనీల్లో పని చేసే నిపుణుల కోసం అమెరికా జారీ చేసే హెచ్-1బీ వీసాల్లో మార్పులు చోటు చేసుకున్నాయంటూ నవతెలంగాణ ఓ కథనంలో పేర్కొంది.
ఇవి వచ్చే నెల నుంచి అమల్లోకి రానున్నాయని తెలిపింది.
ఈ వీసాల జారీ, అప్లికేషన్లకు సంబంధించి ఆన్‌లైన్ ప్రక్రియను త్వరలోనే ప్రారంభిస్తామని సంబంధిత అధికారులు వెల్లడించినట్టు ఈ కథనంలో చెప్పుకొచ్చింది.
దీనికి సంబంధించిన అప్లికేషన్లను మార్చి మొదటి వారం నుంచి అధికారులు స్వీకరించనున్నారు.
కొత్త విధానంలో సమాచార సేకరణ, పేపర్ వర్క్‌ను కుదించడంతో పాటు యాజమాన్యాలకు మొత్తం మీద అయ్యే వ్యయాలను కూడా3 తగ్గించనున్నారని తెలిపింది.

ఇవి కూడా చదవండి
- యస్ బ్యాంక్ మీద ఆర్బీఐ మారటోరియం: ఇప్పుడు ఏమవుతుంది? ఖాతాదారుల పరిస్థితి ఏమిటి?
- భారత బ్యాంకుల్లో వేల కోట్ల కుంభకోణాలు... ఈ మోసాలు ఎందుకు పెరుగుతున్నాయి
- మోదీ ప్రభుత్వం ఆర్బీఐ నుంచి రూ. 1.76 లక్షల కోట్ల నిధులు ఎందుకు తీసుకుంది?
- వెనెజ్వెలా: మహిళలు ఒక్కొక్కరు ఆరుగురు పిల్లల్ని కనాలని చెప్పిన అధ్యక్షుడు మదురో
- కరోనావైరస్ టెన్షన్: టాయిలెట్ పేపర్లను జనం వేలం వెర్రిగా ఎందుకు కొంటున్నారు?
- కరోనావైరస్: కోట్లాది మంది ప్రాణాలు తీసిన స్పానిష్ ఫ్లూ నుంచి మనం నేర్చుకోగల పాఠాలేమిటి?
- హ్యాండ్‌షేక్ చరిత్ర.. ఎప్పుడు, ఎందుకు, ఎలా పుట్టింది?
- కరోనా వైరస్ ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా మందుల కొరతకి దారి తీయవచ్చా?
- కరోనావైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత?
- కరోనా వైరస్: ఈ ప్రపంచాన్ని నాశనం చేసే మహమ్మారి ఇదేనా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









