మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్: ఆస్ట్రేలియాదే కప్... ఓడిన భారత్

ఫొటో సోర్స్, Getty Images
మహిళల టీ20 ప్రపంచకప్ ఆస్ట్రేలియా సొంతమైంది. ఫైనల్‌లో ఆ జట్టు చేతిలో 85 పరుగుల తేడాతో భారత్ ఘోరంగా ఓడింది.
సొంతగడ్డపై మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ఆదివారం జరిగిన ఈ తుది పోరులో ఆస్ట్రేలియానే మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత ఓవర్లలో నాలుగు కోల్పోయి 184 పరుగులు చేసింది.
బదులుగా భారత్ 19.1 ఓవర్లకు 99 పరుగులు మాత్రమే చేయగలిగింది.
భారత్ ఓటమికి ఆరంభంలోనే పునాదులు పడ్డాయి. 5.4 ఓవర్లకే మొదటి నాలుగు వికెట్లు కోల్పోయింది.
టాప్ ఆర్డర్ బ్యాట్స్‌వుమెన్ పూర్తిగా విఫలమయ్యారు.
ఇన్నింగ్స్‌లో మూడో బంతికే ఓపెనర్ షెఫాలీ వర్మ రెండు పరుగులు చేసి క్యాచౌటవ్వగా, ఆమె స్థానంలో వచ్చిన తాన్యా భాటియా రిటెర్ట్ హట్‌గా వెనుదిరిగింది.
జెమీమా రోడ్రిగ్స్ రెండో ఓవర్ చివరి బంతికి డకౌట్ అయ్యింది. మరో ఓపెనర్ స్మృతీ మందన (11) నాలుగో ఓవర్ తొలి బంతికి క్యాచౌట్‌గా పెవిలియన్‌కు చేరింది.
మహిళల టీ20 ప్రపంచకప్ గెలవడం ఆస్ట్రేలియాకు ఇది ఐదోసారి.
బెత్ మూనీ ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా, ఎలిస్సా హేలీ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచారు.

ఫొటో సోర్స్, Getty Images
కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (4) కూడా జెస్ జొనాస్సెన్ వేసిన ఆరో ఓవర్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచౌట్ అయ్యింది. అప్పటికి భారత్ స్కోరు 30/4.
ఈ దిశలో దీప్తి శర్మ భారత్ ఇన్నింగ్స్‌ను నడిపే బాధ్యత తీసుకుంది.
వేద కృష్ణమూర్తితో కలిసి ఆరో వికెట్‌కు 28 పరుగులు, రిచా ఘోష్‌తో కలిసి ఏడో వికెట్‌కు 30 పరుగులు జోడించింది. భారత ఇన్నింగ్స్‌లో ఇవే అత్యుత్తమ భాగస్వామ్యాలు.
దీంతో 16 ఓవర్లు ముగిసేసరికి భారత్ 88/5తో కాస్త గౌరవప్రదమైన స్కోరుకు చేరుకుంది.
ఈ దశలో నికోలా కారీ వేసిన 17వ ఓవర్ తొలి బంతికి దీప్తి కొట్టిన బంతిని లాంగాన్‌లో మూనీ పట్టేసింది.
ఆ తర్వాత శిఖా పాండే (2), రిచా ఘోష్ (18), రాధా యాదవ్ (1), పూనమ్ యాదవ్ (1) కూడా ఔటయ్యారు.
ఆస్ట్రేలియన్ బౌలర్లలో మేగాన్ స్కట్ నాలుగు వికెట్లు తీయగా, జెస్ జొనాస్సెన్‌కు మూడు వికెట్లు పడ్డాయి. సోఫీ మొలినక్స్, కమిన్స్, కారీ తలో వికెట్ తీశారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆస్ట్రేలియా 184/5
టాస్ గెలిచి, తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది.
ఆస్ట్రేలియా జట్టు ఓపెనర్లు ఎలిస్సా హేలీ (75), బెత్ మూనీ (78 నాటౌట్) ఇద్దరూ అర్థ సెంచరీలతో రాణించారు. 115 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం నమోదు చేశారు.
ఎలిస్సా 12వ ఓవర్‌లో ఔటైనా, మూనీ చివరిదాకా క్రీజులో ఉండి జట్టుకు భారీ స్కోరు అందించింది.
భారత బౌలర్లలో దీప్తి శర్మ రెండు వికెట్లు తీయగా, పూనమ్ యాదవ్, రాధా యాదవ్ చెరో వికెట్ తీశారు.
శిఖా పాండే నాలుగు ఓవర్లలో 52 పరుగులు ఇచ్చింది. మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఒక బౌలర్ అత్యధికంగా ఇచ్చిన పరుగులు ఇవే.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఆస్ట్రేలియా వికెట్లు:
తొలి వికెట్ - అలెస్సా హీలీ (39 బంతుల్లో ఐదు సిక్స్‌లు, ఏడు ఫోర్లతో 75 పరుగులు) 11.4 ఓవర్ల వద్ద రాధా యాదవ్ బౌలింగ్‌లో వేదా కృష్ణమూర్తికి క్యాచ్ ఇచ్చి ఔట్
రెండో వికెట్ - మెగ్ లాన్నింగ్ (15 బంతుల్లో రెండు ఫోర్లతో 16 పరుగులు) 16.2 ఓవర్ల వద్ద దీప్తి శర్మ బౌలింగ్‌లో షిఖా పాండేకు క్యాచ్ ఇచ్చి ఔట్
మూడో వికెట్ - ఆష్ గార్డ్నెర్ (మూడు బంతుల్లో రెండు పరుగులు) 16.5 ఓవర్ల వద్ద దీప్తి శర్మ బౌలింగ్‌లో స్టంపౌట్
నాలుగో వికెట్ - రేచల్ హేన్స్ (ఐదు బంతుల్లో నాలుగు పరుగులు) 18.5 ఓవర్ల వద్ద పూనమ్ యాదవ్ బౌలింగ్‌లో బౌల్డ్
నాలుగుసార్లు విజేత ఆస్ట్రేలియా.. తొలిసారి ఫైనల్స్ చేరిన భారత్
2009లో ప్రారంభమైన టీ20 ఉమెన్స్ వరల్డ్ కప్ ఇప్పటి వరకూ ఆరుసార్లు జరిగింది. ఇప్పుడు ఏడోసారి జరుగుతోంది. తొలి ప్రపంచకప్‌ను ఆతిథ్య ఇంగ్లండ్ గెలిచింది. 2016లో భారత్‌లో జరిగిన ప్రపంచకప్‌ను వెస్టిండీస్ గెలిచింది. మిగతా నాలుగు ప్రపంచకప్‌లను ఆస్ట్రేలియా సొంతం చేసుకుంది.
తొలిసారి ఫైనల్స్ చేరిన భారత జట్టు కప్పు గెలిచి చరిత్ర సృష్టించాలనుకుంటోంది. మూడుసార్లు గ్రూప్ దశలోనే వెనుదిరిగిన భారత జట్టు.. మరో మూడు సార్లు సెమీ ఫైనల్ వరకూ వెళ్లింది.
జట్లు:
భారత్: షెఫాలీ వర్మ, స్మృతి మంథాన, తానియా భాటియా (వికెట్ కీపర్), జెమిమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), వేదా కృష్ణమూర్తి, దీప్తి శర్మ, షిఖా పాండే, రాధా యాదవ్, పూనమ్ యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్
ఆస్ట్రేలియా: అలెస్సా హీలీ (వికెట్ కీపర్), బెత్ మూనీ, మెగ్ లాన్నింగ్ (కెప్టెన్), రేచల్ హేన్స్, ఆష్ గార్డ్నెర్, సోఫీ మొలినక్స్, నికోలా కారీ, జెస్ జొనాస్సెన్, జార్జియా వరెహమ్, డెల్సా కమిన్స్, మేగాన్ స్కట్.
ఒక ప్రపంచకప్ మ్యాచ్‌లో అంపైరింగ్ చేసిన తొలి మహిళా అంపైర్‌గా ఈ మ్యాచ్‌తో కిమ్ కాటన్ (న్యూజీలాండ్) రికార్డు సృష్టించారు.
కేటీపెర్రి ప్రదర్శన
ఫైనల్ మ్యాచ్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రముఖ గాయని కేటీపెర్రి తన సంగీత ప్రదర్శనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
దాదాపు 80 వేల మంది ప్రేక్షకులు స్టేడియంకు వచ్చారని నిర్వాహకులు ప్రకటించారు.

ఇవి కూడా చదవండి:
- షెఫాలీ వర్మ: 16 ఏళ్ల క్రికెట్ రాక్ స్టార్
- ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2020: ఫైనల్స్‌కు చేర్చిన భారత బౌలర్ల కథ ఏమిటి?
- ఒక్కొక్కరిదీ ఒక్కో కథ: భారత మహిళల క్రికెట్ జట్టులోని ఈ ప్లేయర్స్ మీకు తెలుసా...
- టీ20 ఉమెన్స్ వరల్డ్ కప్ 2020: భారత జట్టు చరిత్ర సృష్టిస్తుందా?
- హర్మన్‌ప్రీత్ కౌర్: క్రికెట్ ప్రపంచకప్‌లో సిక్స్ కొట్టినందుకు, డోప్ టెస్టు చేయాలన్నారు
- సరిగ్గా 36 ఏళ్ల క్రితం భారత్ ప్రపంచ కప్ గెలిచిన రోజున దిల్లీలో ఏం జరిగింది..
- BBCISWOTY: క్రీడల్లో మహిళల గురించి భారతీయులు ఏమనుకొంటున్నారు?
- జస్ప్రీత్ బుమ్రా: ఆ కోచ్ కన్ను పడకుంటే ఎక్కడుండేవాడో
- టికెట్ కలెక్టర్ నుంచి ట్రోఫీ కలెక్టర్ వరకూ ఎంఎస్ ధోనీ జర్నీ
- నమ్మకాలు-నిజాలు: కాపురాలు కూల్చేసే తెల్లబట్ట
- ఆస్ట్రేలియాలో విరాట్ కోహ్లీ చెప్పిన మర్యాద కథ
- భారత్‌లో పురుషులతో సమానంగా మహిళలకు హక్కులు ఉన్నాయా?
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు
- వెనెజ్వెలా: మహిళలు ఒక్కొక్కరు ఆరుగురు పిల్లల్ని కనాలని చెప్పిన అధ్యక్షుడు మదురో
- జోసెఫ్ స్టాలిన్: అలనాటి సోవియట్ అధినేత జీవితం... ఇలా ముగిసింది
- చికెన్, గుడ్లు తింటే కరోనావైరస్ వస్తుందా... మీ సందేహాలకు సమాధానాలు
- కరోనావైరస్ టెన్షన్: టాయిలెట్ పేపర్లను జనం వేలం వెర్రిగా ఎందుకు కొంటున్నారు?
- కరోనావైరస్ ఎంత వేగంగా విస్తరిస్తోంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్: కోట్లాది మంది ప్రాణాలు తీసిన స్పానిష్ ఫ్లూ నుంచి మనం నేర్చుకోగల పాఠాలేమిటి?
- కర్నాటక బీజేపీ మంత్రి కుమార్తె పెళ్లి... ప్రపంచాన్ని ఆకట్టుకుంటున్న ఖరీదైన వేడుక
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









