ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2020: ఫైనల్స్‌కు చేర్చిన భారత బౌలర్ల కథ ఏమిటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, వందన
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఆగ్రా గత వారం రోజులుగా పతాక శీర్షికల్లో ఉంది. అందుకు అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ పర్యటన ఒక కారణం. ఇక తాజ్‌మహల్ ఎలానూ అక్కడే ఉంటుంది. కానీ ఇప్పుడు ఆగ్రా మరో విషయంలో కూడా వార్తల్లోకెక్కింది: భారత మహిళల క్రికెట్ జట్టులో ఇద్దరు అద్భుతమైన బౌలర్లు - పూనమ్ యాదవ్, దీప్తి శర్మ.
భారత మహిళల జట్టు ఆదివారం టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఆడుతుంది. భారత జట్టు ఇక్కడి వరకూ రావటంలో బౌలర్లు ప్రధాన పాత్ర పోషించారు. ఆస్ట్రేలియా క్రీడాకారిణి మేగన్‌తో సమానంగా 9 వికెట్లు తీసిన పూనమ్.. ఈ వరల్డ్ కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన క్రీడాకారిణిగా నిలిచారు.
ఆమె క్రికెట్ ప్రయాణాన్ని తెలుసుకోవటానికి కొంచెం వెనక్కు వెళదాం.
ఆగ్రాలోని ఏకలవ్య స్టేడియం... ఆటగాళ్లు ప్రాక్టీస్ చేయటానికి ఇక్కడికి వచ్చినపుడు లెగ్-స్పిన్ చేయగల క్రికెటర్ ఒకే ఒక్కరు ఉన్నారు.. అది కూడా ఒక బాలిక.
ఆఫ్-స్పిన్ ప్లేయర్ల వరుస ఉంటుంది. లెఫ్ట్-ఆమ్ స్పిన్లర్లు కూడా ఉంటారు. కానీ లెగ్-స్పిన్నర్లు దొరకటం కష్టం.

ఆ క్రీడాకారిణి పూనమ్ యాదవ్. ఆమె బౌలింగ్ సాయంతో ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా (4 వికెట్లు), బంగ్లాదేశ్ (3 వికెట్లు) జట్ల మీద భారత జట్టు విజయం సాధించింది.
మహిళా లెగ్-స్పిన్ బౌలర్లు చాలా తక్కువ మంది ఉన్నారు. కానీ పూనమ్ ఆరంభం నుంచే అద్భుత ప్రతిభ చాటారు.
ఆమె ఎత్తు కేవలం 4 అడుగుల 11 అంగుళాలు మాత్రమే అయినప్పటికీ.. ఆమె తన చిన్న చేతుల్లో బంతి పట్టుకుంటే చాలు.. క్రికెట్ స్టేడియంలో జగజ్జేతలకు ముచ్చెమటలు పడతాయి.
పూనమ్ 1991లో పుట్టింది. ఆమె కుటుంబం గ్రామం నుంచి ఆగ్రాకు మారినపుడు ఆమెకు క్రికెట్ మీద ఆసక్తి మొదలైంది. కానీ.. తొలుత ఆమె కుటుంబ సభ్యులకు ఇది నచ్చలేదు.
అయినాకానీ పూనమ్ అంకితభావం, కష్టం ఫలించాయి. ఆమె ఉత్తరప్రదేశ్ జట్టు కోసం ఆడటం మొదలుపెట్టారు. 2013లో భారత జట్టులో అరంగేట్రం చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆమెకు గత రెండు సంవత్సరాలూ అద్భుతంగా ఉన్నాయి. బీసీసీఐ 2018-19 సంవత్సరానికి ఉత్తమ మహిళా క్రికెటర్‌గా పూనమ్‌ను ఎంపిక చేసింది. 2017 ఓడీఐ వరల్డ్ కప్‌లో పూనమ్ గూగ్లీ మీద పూర్తి పట్టు సాధించారు. అది ఆమె ప్రత్యేకతగా మారింది.
ఒకప్పుడు రైల్వే జట్టు కోసం ఆడిన పూనమ్ క్లర్కుగా పనిచేశారు. ఇప్పుడామె సూపరింటెండెంట్.
పూనమ్ తన తక్కువ ఎత్తునే తన విశిష్ట అస్త్రంగా మలచుకున్నారు. బ్యాట్స్‌వుమెన్‌కు అతి దగ్గరగా బౌలింగ్ చేయటంలో ఆమె నిష్ణాతురాలు. దానివల్ల బ్యాట్స్‌మెన్ క్రీజ్ నుంచి అడుగు బయట పెట్టలేరు. పెడితే వికెట్ కీపర్ వికెట్ తీస్తారు. అది పూనమ్ ఖాతాలో పడుతుంది.
ఆమెకు అర్జున అవార్డు లభించింది. ఆమెకన్నా ముందు యూపీకి చెందిన మరే మహిళా క్రికెటర్‌కూ ఈ అవార్డు దక్కలేదు.
ఓడీఐ వరల్డ్ కప్ ర్యాంకింగ్స్‌లో ఉత్తమ బౌలర్ల స్థానంలో పూనమ్ ఏడో స్థానంలో ఉన్నారు. టీ20ల్లో భారతదేశం తరఫున అత్యధిక వికెట్ల రికార్డు (92) కూడా ఆమె పేరు మీదే ఉంది.

ఫొటో సోర్స్, @T20WORLDCUP
దీప్తి శర్మ
పూనమ్ యాదవ్ లాగానే దీప్తి శర్మ కూడా ఆగ్రా నుంచే వచ్చారు. భారత జట్టులో అత్యుత్తమ బౌలర్లలో ఆమె ఒకరు.
గత ఏడాది దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన ఒక టీ20 మ్యాచ్‌లో దీప్తి మూడు మెయిడెన్ ఓవర్లు వేశారు. ఆ ఘనత సాధించిన తొలి భారత బౌలర్‌గా నిలిచారు.
టీ20 వరల్డ్ ర్యాంకింగ్స్‌లోనూ, ఓడీఐ ఆల్-రౌండర్ ర్యాంకింగ్స్‌లోనూ దీప్తి శర్మ నాలుగో స్థానంలో నిలిచారు.
నాకు 2017 ఇన్నింగ్స్ ఇంకా గుర్తుంది. ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో దీప్తి 188 పరుగులు స్కోర్ చేశారు. అప్పటికి ఒక మహిళ ఓడీఐల్లో చేసిన రెండో అత్యధిక స్కోర్ అది.
ఆస్ట్రేలియాలో ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్‌లో తొలి మ్యాచ్‌లో దీప్తి 46 బంతుల్లో 49 రన్స్ చేయటంతో భారత జట్టు 133 పరుగులు సాధించగలిగింది.
దీప్తి విజయం వెనుక ఆమె సోదరుడి పాత్ర చాలా ఉంది. దీప్తి కెరీర్‌ను నిర్మించటం కోసం ఆయన తన సొంత కెరీర్ వదులేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
శిఖా పాండే
పూనమ్ యాదవ్‌తో పాటు.. భారత జట్టుకు మరో బలమైన అస్త్రం ఫాస్ట్ బౌలర్ శిఖా పాండే. ఈ టీ20 వరల్డ్ కప్‌లో ఏడు వికెట్లు తీసిన శిఖా ఐదో స్థానంలో నిలిచారు.
భారత వైమానిక దళంలో స్క్వాడ్రన్ లీడర్‌గా ఉన్న శిఖా పాండే వయసు 30 సంవత్సరాలు. నిజానికి ఆమె ఆల్-రౌండర్ క్రికెటర్.
ఆమె తండ్రి గోవాలోని కేంద్రీయ విద్యాలయలో హిందీ బోధించేవారు. ఆమెకు చిన్నప్పటి నుంచీ క్రికెట్ మీద అమితమైన ఆసక్తి ఉండేది. కానీ ఆమె తొలిసారిగా కాలేజీలో ఒక లెదర్ బాల్‌తో ఆడారు.
తొలి రోజుల్లో పెద్దగా విజయం సాధించలేకపోయారు. దీంతో 2011లో ఎయిర్ ఫోర్స్‌లో చేరి ఎయిర్-ట్రాఫిక్ కంట్రోలర్‌గా పనిచేశారు.
చివరికి 2014లో శిఖా పాండే భారత జట్టుకు ఎంపికయ్యారు. ప్రస్తుత టీ20 వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌లో ఆమె మూడు కీలకమైన వికెట్లు పడగొట్టారు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు వికెట్లు తీశారు.
భారత మహిళల జట్టు బౌలింగ్ చాలా బలంగా ఉందని పరిగణిస్తుంటారు. ఇది నిజమని భారత బౌలర్లు ఈ వరల్డ్ కప్‌లో నిరూపించారు.

ఫొటో సోర్స్, Getty Images
రాధా యాదవ్
ఇక 19 ఏళ్ల రాధా యాదవ్ ఈ టీ-20 వరల్డ్ కప్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో నాలుగు అద్భుతమైన వికెట్లు తీశారు.
రాధ చిన్నప్పుడు పేదరికంలో పెరిగారు. ముంబైలోని కాందీవాలీలో కేవలం 200 చదరపు అడుగుల ఇంటిని చూస్తే.. ఆమె ప్రయాణం ఇక్కడి నుంచే మొదలైందని నమ్మటం కష్టం. ఇప్పుడు ఆమె భారత జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు.
రాధ 2000 సంవత్సరంలో పుట్టారు. ఆమె తండ్రి ఓంప్రకాష్ యూపీలోని జౌన్‌పూర్ నుంచి ఉపాధి కోసం ముంబై వచ్చారు. ఒక చిన్న దుకాణంలో పాలు అమ్మేవారు. రాధ కానీ, ఆమె తండ్రి కానీ పేదరికం తమకు ఒక అవరోధంగా మారనివ్వలేదు.

ప్రపంచ కప్
ఆస్ట్రేలియాలో జరుగుతున్న ఈ వరల్డ్ కప్‌లో భారత జట్టు నాలుగు మ్యాచ్‌లు ఆడింది. అయితే ఈ టోర్నీలో జట్టు పరిస్థితులను మార్చేసింది ఒక బౌలర్.
రాజేశ్వరి గైక్వాడ్, 20 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ పూజా వస్త్రకార్, 22 ఏళ్ల అరుంధతి రెడ్డిలు.. తమ సీనియర్లు, అనుభవజ్ఞులు అయిన బౌలర్లతో కలిసి భారత జట్టును ముందుకు నడిపించారు. ఇక బాట్స్‌వుమన్‌లో షెఫాలీ వర్మ ఒక్కరే తనదైన ముద్ర వేయగలిగారు.
ఇప్పుడు అందరి కళ్లూ మార్చి 8న ఆస్ట్రేలియాతో భారత జట్టు తలపడే ఫైనల్స్ మీద ఉన్నాయి.

ఇవి కూడా చదవండి:
- మిథాలీ రాజ్ రిటైర్మెంట్: టీ20 వరల్డ్ కప్‌కు ఆరు నెలల ముందు ఈ నిర్ణయం ఎందుకు?
- పీతల నీలి రంగు రక్తం ప్రతి ఏటా లక్షలాది ప్రాణాలను కాపాడుతోందని మీకు తెలుసా?
- కరోనావైరస్ టెన్షన్: టాయిలెట్ పేపర్లను జనం వేలం వెర్రిగా ఎందుకు కొంటున్నారు?
- యస్ బ్యాంక్ మీద ఆర్బీఐ మారటోరియం: ఇప్పుడు ఏమవుతుంది? ఖాతాదారుల పరిస్థితి ఏమిటి?
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు
- కరోనావైరస్: తెలంగాణలో ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తే ఎక్కడికి వెళ్లాలి?
- కరోనావైరస్ ప్రభావంతో విమానయాన సంస్థలు దివాలా తీయనున్నాయా...
- కరోనావైరస్లు ఎక్కడి నుంచి వస్తాయి... ఒక్కసారిగా ఎలా వ్యాపిస్తాయి?
- కరోనావైరస్: శశిథరూర్ మెడలోని ఈ గాడ్జెట్ వైరస్‌లను అడ్డుకుంటుందా
- జోసెఫ్ స్టాలిన్: అలనాటి సోవియట్ అధినేత జీవితం... ఇలా ముగిసింది
- BBC ISWOTY: భారత్‌లో మహిళలు క్రీడల్లో ఎక్కడున్నారు... బీబీసీ అధ్యయనంలో ఏం తేలిందంటే...
- కరోనావైరస్: పదేపదే ముఖాన్ని తాకే అలవాటు మానుకోవడం ఎలా?
- మీ స్మార్ట్ ఫోన్ రెండేళ్లకంటే పాతదా? అయితే జాగ్రత్త.. వంద కోట్ల ఆండ్రాయిడ్ డివైజ్‌లకు హ్యాకింగ్ ముప్పు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









