మిథాలీ రాజ్ రిటైర్మెంట్: టీ20 వరల్డ్ కప్‌కు ఆరు నెలల ముందు ఈ నిర్ణయం ఎందుకు?

ఫొటో సోర్స్, Reuters
గత ఏడాది భారత మహిళా క్రికెట్ టీమ్ టీ20 వరల్డ్ కప్ ఆడుతున్న సమయంలో పాకిస్తాన్‌పై గెలిచిన తర్వాత టీమ్‌లో అత్యంత అనుభవజ్ఞురాలైన క్రికెటర్ మిథాలీ రాజ్ "ఇది టీ20లో నా ఆఖరి వరల్డ్ కప్ అవుతుందేమో" అన్నారు.
టీ20ల నుంచి రిటైర్ అవుతున్నట్లు సంకేతాలు ఇచ్చిన మిథాలీ రాజ్ "టీమ్‌లో చాలా మార్పులు వస్తున్నాయి. జట్టులోకి చాలామంది అమ్మాయిలు వస్తున్నారు. నాకు ఇప్పుడు టీమ్ సెటిల్ అవుతున్నట్టు అనిపిస్తోంది. అందుకే, టీ-20 ఫార్మాట్‌లో ఇది నా ఆఖరి వరల్డ్ కప్ కావచ్చు" అన్నారు.
అలా చెప్పిన తొమ్మిదిన్నర నెలల తర్వాత, 2020లో జరగబోయే టీ20 వరల్డ్ కప్‌కు సరిగ్గా ఆరు నెలల ముందు మిథాలీ టీ20ల నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
భారత తొలి టీ20 మహిళా కెప్టెన్
2006లో భారత మహిళా క్రికెట్ జట్టు మొదటిసారి అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడడానికి సిద్ధమైనప్పుడు దాని పగ్గాలు మిథాలీ రాజ్‌కు అప్పగించారు. దాంతో, మిథాలీ పేరు టీ20 ఫార్మాట్‌లో మొట్టమొదటి మహిళా కెప్టెన్‌గా నిలిచిపోయింది.
ఆ తర్వాత మిథాలీ 32 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు, మూడు టీ20 వరల్డ్ కప్ టోర్నీల్లో కెప్టెన్‌గా ఉన్నారు. ఆమె శ్రీలంక(2012), బంగ్లాదేశ్(2014), భారత్(2016)లో జట్టును ముందుకు నడిపించారు.
ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫో ప్రకారం మిథాలీ మొత్తం 89 అంతర్జాతీయ టీ20 మ్యాచుల్లో 37.52 సగటుతో 2,364 రన్స్ చేశారు. ఇందులో 17 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఆమె అత్యధిక వ్యక్తిగత స్కోర్ 97 నాటౌట్. ఈ పొట్టి క్రికెట్ ఫార్మాట్‌లో మిథాలీ స్ట్రైక్ రేట్ 96.33.
గత ఏడాది మిథాలీ 105.89 స్ట్రైక్ రేటుతో 22 అంతర్జాతీయ టీ20లు ఆడారు. అందులో 6 హాఫ్ సెంచరీలు, 35.93 యావరేజితో 575 రన్స్ చేశారు. అదే సమయంలో కెరీర్ అత్యధిక స్కోర్(97 నాటౌట్) కూడా సెట్ చేశారు.

ఫొటో సోర్స్, TWITTER @BCCI WOMEN
టీ20లో వెయ్యి పరుగులు పూర్తి చేసిన ఏకైక భారత మహిళా క్రికెటర్
- ఇప్పటివరకూ భారత టీ20 మహిళా క్రికెట్‌లో అత్యధిక రన్స్ చేసిన రికార్డు మిథాలీ రాజ్ పేరునే ఉంది.
- టీ20లో 2 వేల పరుగులు పూర్తి చేసిన మొదటి, ఏకైక భారత మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్.
- అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగుల జాబితాలో మిథాలీ ఆరో స్థానంలో ఉన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
రిటైర్మెంట్ ప్రకటనపై మిథాలీ ఏమన్నారు?
అంతర్జాతీయ టీ20ల నుంచి రిటైర్మెంట్ ప్రకటన చేసిన మిథాలీ "నేను 2006 నుంచి టీ20ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాను. 2021 వరల్డ్ కప్ మీద ఫోకస్ పెట్టేందుకు, ఇప్పుడు టీ20 నుంచి రిటైర్ కావాలని అనుకుంటున్నా. దేశం కోసం వన్డే వరల్డ్ కప్ గెలవాలనేది నా కల. నేను దానికోసం నా అత్యుత్తమ ప్రదర్శన అందించాలని అనుకుంటున్నాను. బీసీసీఐ నాకు ఎప్పుడూ అండగా నిలుస్తున్నందుకు ధన్యవాదాలు. స్వదేశంలో త్వరలో దక్షిణాఫ్రికాతో సిరీస్ ఆడబోతున్న భారత టీ20 జట్టుకు నా శుభాకాంక్షలు" అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
రిటైర్మెంట్ ప్రకటన ముందు ఏం జరిగింది
భారత మహిళా క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికాతో సెప్టెంబర్ 24 నుంచి సూరత్‌లో ఐదు టీ20లు, బరోడాలో మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్ ఆడబోతోంది. ఈ సిరీస్ కోసం తను సెలక్టర్లకు అందుబాటులో ఉంటానని ఆగస్టు 27న మిథాలీ చెప్పారు.
ఈ సిరీస్ కోసం సెప్టంబర్ 5న ముంబైలో జట్టును ఎంపిక చేయనున్నారు. కానీ దానికి ముందే మిథాలీ రాజ్ తన రిటైర్మెంట్ నిర్ణయం ప్రకటించారు.

ఫొటో సోర్స్, Reuters
టీ20 వరల్డ్ కప్‌లో తలెత్తిన వివాదం
గత ఏడాది టీ20 వరల్డ్ కప్‌లో మిథాలీ రాజ్, జట్టు కోచ్ రమేష్ పవార్ మధ్య అభిప్రాయ బేధాలు వచ్చాయి. అవి క్లోజ్డ్ రూం నుంచి బయటికి రావడం కలకలం సృష్టించింది.
టీ20 మహిళా వరల్డ్ కప్‌లో పాకిస్తాన్, ఐర్లండ్‌పై హాఫ్ సెంచరీలు చేసినా మిథాలీకి మొదట ఆస్ట్రేలియా, తర్వాత సెమీఫైనల్లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచుల్లో తుది లెవన్‌లో చోటు దక్కలేదు. ఆ తర్వాత సెమీ ఫైనల్లో ఓడిపోయిన టీమ్ వరల్డ్ కప్‌కు దూరమైంది.
నిజానికి ఈ టోర్నీలో ఇన్నింగ్స్ ప్రారంభించాలనుకున్న మిథాలీని టీమ్ మేనేజ్‌మెంట్ మిడిలార్డర్‌లో దింపాలని అనుకోవడంతో ఈ వివాదం వెలుగులోకి వచ్చింది. 36 ఏళ్ల మిథాలీ టీ20 ఫార్మాట్ ఆడ్డానికి అంత ఫిట్‌గా లేరని, పవర్ ప్లేలో ఆమె చాలా డాట్ బాల్స్ ఇస్తున్నారనే వాదనలు కూడా ఉన్నాయి.
అయితే, కాలంతోపాటు ఆ వివాదం కూడా కనుమరుగైంది. ఇంగ్లండ్, న్యూజీలాండ్‌తో జరిగిన గత రెండు సిరీస్‌లలో మిథాలీని జట్టులోకి తీసుకున్నారు. కానీ భారత జట్టు ఈ రెండు సిరీస్‌లలో మొత్తం ఆరు మ్యాచుల్లో ఓడిపోయింది.
మిథాలీ తన చివరి టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ ఇదే ఏడాది గువాహటీలో ఇంగ్లండ్‌తో ఆడారు. అందులో ఆమె 32 బంతుల్లో 30 పరుగులు చేశారు.

ఫొటో సోర్స్, ICC/TWITTER
వరల్డ్ టీ20 కప్‌కు ఆరు నెలల ముందు రిటైర్మెంట్
2019 జులై 31న విడుదలైన ఐసీసీ ర్యాకింగ్స్ ప్రకారం 622 పాయింట్లతో మిథాలీ 11వ స్థానానికి పడిపోయారు. డిసెంబర్‌లో ఆమె 37వ ఏట అడుగుపెడుతారు.
మరోవైపు 2020 ఫిబ్రవరిలో టీ20 వరల్డ్ కప్ జరగడానికి ఇక ఆరు నెలలే ఉంది. గత నెలలో ఆమె దక్షిణాఫ్రికా సిరీస్ కోసం తాను అందుబాటులో ఉంటానని చెప్పారు. దాంతో టీ20 క్రికెట్ ఫార్మాట్ గురించి మీ ప్లాన్ ఏంటి? అని కూడా ఆమెను అడిగారు.
దానికి మిథాలీ "సాధారణంగా నేను ఒకసారి ఒకే సిరీస్‌పై దృష్టి పెడతాను. ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ గురించి ఆలోచించలేను. అవును, నేను కచ్చితంగా వచ్చే నెలలో జరిగే సిరీస్‌కు అందుబాటులో ఉంటాను" అన్నారు.
ఇప్పుడు మిథాలీ టీ20ల నుంచి రిటైర్ కావాలనే నిర్ణయం తీసుకోవడంతో, సోషల్ మీడియాలో దీనిపై రకరకాల స్పందనలు వస్తున్నాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఒక యూజర్ మిథాలీ రిటైర్మెంట్ ప్రకటన చూసి "నాకు చాలా బాధగా ఉంది" అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
మరో యూజర్ "థాంక్స్ మిథాలీ, మీరు మాలో చాలా మందిని మహిళా క్రికెట్ ఫాలో అయ్యేలా చేశారు" అని పెట్టారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
ఆమెకు థాంక్స్ చెబుతూ ట్విటర్‌లో చాలా మెసేజిలు వచ్చాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5
మాజీ మహిళా క్రికెటర్ అంజుమ్ చోప్రా కూడా "మిథాలీ మహిళా క్రికెట్‌కు మీరు చాలా సేవలందించారు" అని ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 6
కామెంట్రేటర్ హర్షా భోగ్లే ఆమెను 'వెల్ ప్లేయ్‌డ్' అంటూ, 2021 వరల్డ్ కప్ కోసం శుభాకాంక్షలు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- కమలాతాల్: "ఒక్క రూపాయికే ఇడ్లీ.. నేను చనిపోయే దాకా అమ్ముతా.. ఎప్పటికీ ధర పెంచను"
- ఇంగ్లిష్ కోసం పోరాటం.. నాలుగేళ్లుగా స్కూళ్లు మూసేశారు.. ఇదేంటని అడిగితే కిడ్నాప్‌లు చేస్తున్నారు
- కొల్లేరు: దేశంలో అతి పెద్ద మంచినీటి సరస్సుకు వచ్చిన ప్రమాదం ఏమిటి? పరిష్కారం ఎలా?
- మహిళలు మద్యం కొనడానికి వెళ్తే ఏమవుతుంది?
- స్మగ్లర్లు ఈ చెక్‌పోస్టులను దాటి ముందుకెళ్లడం అసాధ్యం
- ఎన్ఆర్సీ: ‘ఇక్కడే పుట్టాం.. ఇక్కడే బతికాం.. ఇప్పుడెక్కడికి పోతాం?’
- ఇది భారత ఆర్థికవ్యవస్థ మందగమనమా లేక మాంద్యమా?
- ‘మా నాన్న ఒక గ్యాంగ్‌స్టర్... నా మూలాలు దాచేందుకు నా ముక్కునే మార్చేశాడు’
- దళితుడి శవాన్ని వంతెన మీంచి కిందకు తాళ్ళు కట్టి ఎందుకు దింపారు...
- ఏపీ రాజధాని అమరావతిపై బీబీసీతో బొత్స ఏమన్నారంటే...
- మూర్ఛ వ్యాధికి చంద్రుడి ప్రభావమే కారణమా
- విక్రమ్ సారాభాయ్: ఈ శాస్త్రవేత్త అణుబాంబును వ్యతిరేకించారా
- వరదలో 12 ఏళ్ల బాలుడి సాహసం.. సోషల్ మీడియాలో వైరల్
- ఆర్టోస్: ఇది మా కూల్ డ్రింకండీ
- హైదరాబాద్‌లో అమ్మపాల బ్యాంకు: తల్లుల నుంచి పాల సేకరణ.. ఉచితంగా చిన్నారులకు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)