దిల్లీ హింస: ఆర్ఎస్ఎస్, అమిత్ షాల పేర్లు చెప్పవద్దన్న జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్

ఫొటో సోర్స్, ANI
దిల్లీలో పౌరసత్వం సవరణ చట్టానికి వ్యతిరేకంగా సాగుతున్న నిరసనలతో పెరుగుతున్న హింసకు ఇప్పటివరకు 32 మంది చనిపోయారు.
ఈశాన్య దిల్లీలో అల్లర్లు చెలరేగి మూడు రోజులు అవుతున్నా పరిస్థితి ఇంకా సద్దుమణగలేదు. బుధవారం నాడు దిల్లీ హైకోర్టు ఈ విషయంలో పోలీసులను మందలించింది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ హింసతో ప్రభావితమైన ప్రాంతాలను సందర్శించారు.
స్థానికులు, పోలీసులతో ఆయన మాట్లాడారు. విధ్వంసానికి గురైన భవనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఒక ముస్లిం వ్యక్తి తమ ప్రాంతంలో ముస్లింలపై దాడులు జరిగాయని, అందుకు కారణం ఆర్ఎస్ఎస్, అమిత్ షాలేనని ఆరోపించారు. దానికి అజిత్ డోభాల్ స్పందిస్తూ, తనతో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలని చెప్పారు. ముస్లింల సంఖ్య తక్కువగా ఉన్న ప్రాంతాల్లో వారిపై దాడులు జరిగాయని, కానీ తాము మాత్రం హిందువులపై ఎలంటి దాడులు జరగకుండా చూసుకున్నామని అంటూ, "ఇదంతా ఆర్ఎస్ఎస్, అమిత్ షాల మాట మీదే నడుస్తోంది" అని ఆ వ్యక్తి చెబుతున్నప్పుడు డోభాల్ అడ్డుకున్నారు. కానీ, అతను మాట్లాడడం ఆపలేదు. దాంతో, డోభాల్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు.
ఆ తరువాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, పరిస్థితులు అదుపులో ఉన్నాయని, పోలీసులపై తనకు నమ్మకం ఉందని, వాళ్లు వాళ్ల పని చేస్తున్నారని చెప్పారు.
‘‘ప్రేమ భావనలతో మెలగండి. మనది ఒకటే దేశం, అంతా కలసి బతకాలి. అంతా కలసి దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలి’’ అని ఆయన ఒక మహిళతో అన్నారు.

ఫొటో సోర్స్, Twitter
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల్లో ఐకమత్య భావన ఉందని, శత్రుత్వం లేదని చెప్పారు. ‘‘కొందరు క్రిమినల్సే ఇలాంటివి చేస్తారు. అలాంటివారిని ఏకాకుల్ని చేసేందుకు ప్రజలంతా ప్రయత్నిస్తున్నారు. పోలీసులు ఇక్కడే ఉన్నారు. వాళ్లపనివాళ్లు చేస్తున్నారు. ప్రధానమంత్రి, హోం మంత్రి ఆదేశాల మేరకే మేం ఇక్కడికి వచ్చాం. దేవుడి దయవల్ల ఇక్కడ అంతా బాగుంటుంది’’ అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
‘‘దేశాన్ని ప్రేమించే వాళ్లు అందరికీ నేనిచ్చే సందేశం ఒకటే.. మీరు మీ చుట్టుపక్కల సమాజాన్ని, పొరుగువారిని కూడా ప్రేమించండి. అంతా ఇరుగుపొరుగు వారితో ప్రేమతో, సామరస్యంతో జీవించాలి. ఒకరి సమస్యలు మరొకరు పరిష్కరించుకునేందుకు ప్రయత్నించాలే తప్ప పెంచుకునేందుకు కాదు’’ అని చెప్పారు.
అంతకు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిల్లీ హింసపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
వీలైనంత త్వరగా సాధారణ స్థితి నెలకొనేలా చూడటం ముఖ్యమని, దిల్లీ ప్రజలంతా శాంతిని, సౌభ్రాతృత్వాన్ని కొనసాగించాలని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
కాంగ్రెస్ శాంతి ర్యాలీ
దిల్లీలో హింసకు నిరసనగా ప్రియాంకా గాంధీ వాద్రా ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ గాంధీ స్మృతి వరకూ శాంతి ర్యాలీని చేపట్టింది. అయితే ఈ ర్యాలీని పోలీసులు జన్‌పథ్ వద్దనే అడ్డుకున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
కానిస్టేబుల్ కుటుంబానికి రూ.కోటి పరిహారం - కేజ్రీవాల్
దిల్లీ హింసలో మృతి చెందిన కానిస్టేబుల్ రామ్‌లాల్ కుటుంబానికి రూ.కోటి పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రకటించారు.
బుధవారం రాత్రి ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాతో కలసి అరవింద్ కేజ్రీవాల్ హింస చెలరేగిన ఈశాన్య దిల్లీలో పర్యటించారు. స్థానికులను కలసి వారితో మాట్లాడారు.

ఫొటో సోర్స్, Getty Images
'1984 అల్లర్ల మాదిరి కాకూడదు.. విద్వేష ప్రసంగాలు చేసిన బీజేపీ నాయకులపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయండి' - దిల్లీ హైకోర్టు
దిల్లీలో చెలరేగిన మత ఘర్షణలు, హింసను వీలైనంత త్వరగా అదుపు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను దిల్లీ హైకోర్టు ఆదేశించింది.
ఈ హింసపై దాఖలైన పిటిషన్లను న్యాయమూర్తి జస్టిస్ ఎస్ మురళీధర్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణకు స్వీకరించింది.
విద్వేష ప్రసంగాలు చేసిన బీజేపీ నాయకులపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని, ఈ మేరకు పోలీసు కమిషనర్‌కు సూచించాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు హైకోర్టు తెలిపింది.
బీజేపీ నాయకుడు కపిల్ మిశ్రా వీడియోను కోర్టులో న్యాయవాదులు, పోలీసుల సమక్షంలో ప్రదర్శించి, న్యాయమూర్తులు తిలకించారు.
పోలీసులు సరైన సమయంలో చర్యలు తీసుకుంటారని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చెప్పగా.. జస్టిస్ మురళీధర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ‘‘నగరం తగలబడుతుంటే.. సరైన సమయం ఎప్పుడు? ఇంకా ఎన్ని ప్రాణాలు పోవాలి?’’ అని ప్రశ్నించారు.
హింసను అదుపుచేసేందుకు సైన్యాన్ని రంగంలోకి దించాలన్న అంశంపై తాము దృష్టిసారించదల్చుకోలేదని, విద్వేష వ్యాఖ్యలు చేసిన వారిపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయడమే ముఖ్యమని ధర్మాసనం తెలిపింది.
దిల్లీ హింసలో కుటుంబ సభ్యుల్ని కోల్పోయి బాధితులైన ప్రతి ఒక్కరినీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు వెళ్లి వ్యక్తిగతంగా పరామర్శించాలని, బాధితులకు అండగా నిలబడాలని సూచించింది. అత్యున్నత స్థాయి వ్యక్తులు వెళితేనే బాధితులకు ధైర్యం వస్తుందని, శాంతి సాధ్యమవుతుందని వెల్లడించింది.
అయితే, దిల్లీ హింస 1984 అల్లర్ల మాదిరి కాకూడదని హైకోర్టు అభిప్రాయపడింది.
బాధితులకు సహాయం అందించేందుకు తక్షణం హెల్ప్‌లైన్స్ ఏర్పాటు చేయాలని, ప్రైవేటు అంబులెన్సుల్ని పెట్టాలని, బాధితులు వైద్యం పొందేందుకు సురక్షిత ఏర్పాట్లు చేయాలని తెలిపింది. అదేవిధంగా బాధితులకు కనీస సదుపాయాలతో కూడిన పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించింది.
అలాగే, మృతి చెందినవారి అంత్యక్రియలను వారి కుటుంబ సభ్యులతో చర్చించి, గౌరవ మర్యాదలతో పూర్తి చేసేలా చూడాలని సూచించింది.
ఇంటెలిజెన్స్ అధికారి మృతి
హింస చెలరేగిన ఈశాన్య దిల్లీలో ఒక ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అధికారి అంకిత్ శర్మ మృతదేహం లభించింది.
ఐబీ అధికారి మరణం విచారకరమని హైకోర్టు తెలిపింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
1984లో ఏం జరిగింది?
1984, అక్టోబరు 31న భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్య జరిగింది. ఆ మరుసటి రోజు నవంబరు 1న సిక్కుల ఊచకోత మొదలైంది.
ఇందిర హత్య జరిగిన రోజే సిక్కులను లక్ష్యంగా చేసుకొని చాలా చోట్ల దాడులు జరిగినప్పటికీ, మొదటి హత్య మాత్రం మరుసటి రోజు, నవంబర్ 1న తెల్లవారుజామున జరిగింది.
నవంబర్ 1 ఉదయం, తూర్పు దిల్లీలో తొలుత ప్రారంభమైన హింసాకాండ హత్యలకు దారితీసింది. గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే ఇందిర హత్య జరిగిన తర్వాత చాలా సేపటికి సిక్కుల ఊచకోత మొదలైంది. అధికారిక లెక్కల ప్రకారం ఈ మారణహోమంలో 2,733 మంది చనిపోయారు.


ఇవి కూడా చదవండి:
- దిల్లీ హింస: సీఏఏ అనుకూల, వ్యతిరేక నిరసనలతో రాత్రంతా భయం గుప్పిట్లో...
- దిల్లీ హింస వెనక కుట్ర ఉందన్న సోనియా గాంధీ; 20కి చేరిన మృతులు
- దిల్లీ హింస: తుపాకీ పట్టుకుని పోలీసులపై కాల్పులు జరుపుతున్న ఈ వ్యక్తి ఎవరు?
- దిల్లీ హింస: ముస్లింలు అధికంగా ఉండే ఈ ప్రాంతంలో హింసకు కారకులెవరు? ప్రత్యక్ష సాక్షులు ఏం చెబుతున్నారు?
- బంగారం ధర ఏడేళ్ళలో ఎన్నడూ లేనంత పెరిగింది... ఎందుకిలా?
- బంగారం నిక్షేపాల వల్లే 'సోన్‌భద్ర'కు ఆ పేరొచ్చిందా?
- మాంసం తింటే కరోనావైరస్ వస్తుందంటూ వదంతులు.. పడిపోయిన చికెన్, మటన్ అమ్మకాలు, ధరలు
- హైదరాబాద్‌లో శాకాహారులు ఎంత మంది? మాంసాహారులు ఎంత మంది?
- 'గ్రహాంతర వాసుల అన్వేషణను మరింత సీరియస్‌గా తీసుకోవాలి.. ప్రభుత్వాలు భారీగా నిధులివ్వాలి'
- పురుషులు మూత్రం ఎలా పోస్తే మంచిది? నిలబడి పోయాలా? కూర్చుని పోయాలా?
- ఒక్క మిడత ‘మహమ్మారి'లా ఎలా మారుతుంది
- వుహాన్ డైరీ: మరణించడానికి మూడు గంటల ముందు ఆయనకు హాస్పిటల్ బెడ్ దొరికింది
- కరోనా వైరస్: వూహాన్లో ఏం జరుగుతోందో ప్రపంచానికి చూపించిన రిపోర్టర్స్ మిస్సింగ్
- పాకిస్తాన్లో చక్కెర కొరత... ఇబ్బందులు పడుతున్న ప్రజలు
- హార్ట్ బ్రేక్ గైడ్: లవ్ ఫెయిల్యూర్, బ్రేకప్ బాధ నుంచి బయటపడండి ఇలా..
- కరోనా వైరస్: పిల్లలపై ప్రభావం చూపలేకపోతున్న వైరస్.. కారణాలు చెప్పలేకపోతున్న వైద్య నిపుణులు
- బిర్యానీ హైదరాబాద్‌ది కాదా?
- యువతను శాకాహారం వైపు నడిపిస్తున్న 7 అంశాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









