దిల్లీ హింస: 20కి చేరిన మృతుల సంఖ్య

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, సల్మాన్ రావి
- హోదా, బీబీసీ ప్రతినిధి
యమునా నదికి అవతల ఈశాన్య దిల్లీలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసన ప్రదర్శనలు రెండో రోజుకు చేరుకున్నాయి. మంగళవారం కూడా పలు ప్రాంతాల్లో రాళ్లదాడులు జరిగాయి.
నిరసనలు హింసాత్మకంగా మారడంతో ఒక పోలీస్ కానిస్టేబుల్‌తో పాటు మొత్తం 20 మంది మృతి చెందారు. ఒక డీసీపీ సహా చాలామంది పోలీసులు గాయపడ్డారు. ఈ నిరసనల్లో మొత్తం వంద మందికి పైగా గాయాలయ్యాయి. వీరిలో దాదాపు 50 మంది పోలీసులు.
ఈ నిరసనలకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి కేజ్రివాల్ రాజ్‌ఘాట్ వద్ద కొద్దిసేపు దీక్ష చేశారు.
పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులతో భేటీ అయ్యారు. ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1



జఫారాబాద్‌లో నివసించే మొహమ్మద్ సుల్తాన్ అనే నిరసనకారుడు కాలికి బుల్లెట్ తగిలి చనిపోయాడు.
"బుల్లెట్ సుల్తాన్ కాలికి తగిలింది. కానీ ఎక్కువ రక్తం పోవడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు" అని పోలీసు అధికారుల బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, Rashid alvi
ఆటో డ్రైవర్ మృతి
అదే నిరసన ప్రదర్శనల సమయంలో షాహిద్ అల్వీ అనే ఆటో డ్రైవర్ కూడా బుల్లెట్ తగలడంతో చనిపోయాడు.
షాహిద్ అల్వీ ఉత్తరప్రదేశ్ బులంద్‌షహర్ జిల్లాలోని డిబాయీ ప్రాంతానికి చెందినవాడు.
అతడి సోదరుడు రషీద్ అల్వీ బీబీసీతో "షాహిద్ ఆటో నడుపుతున్నాడు. గొడవలు జరుగుతున్నప్పుడు అతడి పొట్టలో బుల్లెట్ తగిలింది" అని చెప్పాడు.
అతడి బాడీని పోస్టుమార్టం కోసం జీటీబీ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
షాహిద్‌కు నెల క్రితమే పెళ్లైంది. తను దిల్లీలోని ముస్తఫాబాద్‌లో అద్దెకు ఉంటున్నాడు.

ఫొటో సోర్స్, AFP
ఈ ఘర్షణల్లో ఒక హెడ్ కానిస్టేబుల్ కూడా చనిపోయారని వార్తా సంస్థ పీటీఐ చెప్పింది.
దిల్లీ పోలీసులు ఈశాన్య దిల్లీలోని 10 ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు.
జాఫరాబాద్, మోజ్‌పూర్, సీలంపూర్, చాంద్‌బాగ్ ప్రాంతాల్లో హింస జరిగినట్లు సమాచారం అందుతోంది.
చాలా ప్రాంతాల్లో రాళ్లు రువ్వడం, నిప్పు పెట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది.

హింసకు ప్రభావితమైన ప్రాంతాల ప్రజలు బీజేపీ నేత కపిల్ మిశ్రాపై కేసు పెట్టడానికి డీసీపీ కార్యాలయానికి వెళ్లారు.
మోజ్‌పూర్ కౌన్సిలర్ నదీమ్ బీబీసీతో "రాళ్లు రువ్వింది సీఏఏ మద్దతుదారులే. వారిని కపిల్ మిశ్రా రెచ్చగొట్టారు" అని చెప్పారు.
"కపిల్ మిశ్రా మద్దతుదారులు డీటీసీ బస్సులకు నిప్పు పెట్టారు. ఒక ప్రైవేటు కారుకు నిప్పు పెట్టారు. దిల్లీ పోలీసులు వారిని అడ్డుకోలేదు. దీనిలో పోలీసుల ప్రమేయం కూడా ఉన్నట్టు కనిపించింది" అన్నారు.
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జాఫరాబాద్‌లో వరుసగా రెండో రోజూ ప్రజలు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. రాళ్లు రువ్వడం, నిప్పు పెట్టిన ఘటనలతో ఇక్కడ వాతావరణం ఉద్రిక్తంగా మారింది.

ఫొటో సోర్స్, Ani
వేలాది ఆందోళనకారులను అదుపు చేయడానికి పోలీసులు ప్రయత్నించారు. పోలీసుల లాఠీచార్జి తర్వాత ఈ ప్రాంతంలో తొక్కిసలాట లాంటి వాతావరణం చోటుచేసుకుంది. ఆకాశంలో పొగలు కూడా కనిపిస్తున్నాయి.
ఆ ప్రాంతాల్లో రాళ్లు రువ్వడం కూడా జరుగుతోంది. ఆందోళనలు చేస్తున్న వారు పౌరసత్వ సవరణ చట్టాన్ని సమర్థిస్తున్నవారు రాళ్లు సేకరిస్తున్నారని చెబుతున్నారు.
ముఖ్యమంత్రి అపీల్
శాంతిభద్రతలు పునరుద్ధరించాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లెఫ్టినెంట్ గవర్నర్, కేంద్ర హోంమంత్రిని కోరారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
"దిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో అశాంతి చెలరేగిందనే ఆందోళన కలిగించే వార్తలు వస్తున్నాయి. నేను కేంద్ర హోంమంత్రి, లెఫ్టినెంట్ గవర్నర్‌లకు శాంతి భద్రతలు పునరుద్ధరించాలని అపీల్ చేస్తున్నాను" అని ట్వీట్ చేశారు.
పోలీస్ హెడ్ కానిస్టేబుల్ మృతికి కేజ్రీవాల్ సంతాపం తెలిపారు.
దిల్లీలో శాంతిభద్రతలు పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని దిల్లీ పోలీస్ కమిషనర్‌ను లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ కోరారు.
చాలా ఇళ్లకు, వ్యాపార సంస్థలకు నిప్పు పెట్టారు. హింస జరిగి కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా ముస్లిం జనాభా నివసిస్తోంది.

ఫొటో సోర్స్, AFP
హింస తలెత్తడంతో భద్రతా కారణాలతో దిల్లీ మెట్రో ఆ ప్రాంతంలోని ఐదు స్టేషన్లు మూసివేసింది.
ఈ ఘర్షణల్లో దిల్లీ పోలీస్ ఒక ఏసీపీ గాయపడినట్లు సమాచారం అందుతోంది.
అటు బీజేపీ నేత కపిల్ మిశ్రా కూడా ప్రజలు సంయమనంతో వ్యవహరించాలని అపీల్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
ఆయన తన ట్విటర్‌లో "సీఏఏ మద్దతుదారులైనా, సీఏఏను వ్యతిరేకించేవారైనా, ఎవరైనా సరే హింస తక్షణం ఆగిపోవాలి" అన్నారు.

ఫొటో సోర్స్, Ani
ఏసీపీకి గాయాలు
జాయింట్ కమిషనర్ అలోక్ కుమార్ బీబీసీతో "రాళ్లు తగలడం వల్ల ఏసీపీ అమిత్ శర్మ తీవ్రంగా గాయపడ్డారని చెప్పారు.
పోలీసులు కూడా జనాలను అదుపు చేయడానికి టియర్ గ్యాస్ ప్రయోగించారు.
ఆదివారం సాయంత్రం కూడా జాఫరాబాద్ మెట్రో స్టేషన్ దగ్గర పౌరసత్వ సవరణ చట్టం మద్దతుదారులు, వ్యతిరేకుల మధ్య ఘర్షణ జరిగింది.
నిన్న దిల్లీలోని హౌజ్‌రానీ ప్రాంతంలో కూడా ప్రదర్శనలు జరిగాయి, మహిళలపై లాఠీచార్జి చేశారు. అందులో చాలా మంది ప్రదర్శనకారులు గాయపడ్డారు.
చాంద్‌బాగ్ ప్రాంతంలో బయటకు వెళ్తున్న జనాలు, వాహనాలు కనిపిస్తున్నాయని.. రెండు ఫైరింజన్లు లోపలికి రావడం కూడా కనిపించిందని అక్కడే ఉన్న బీబీసీ ప్రతినిధి సల్మాన్ రావి చెప్పారు.

ఫొటో సోర్స్, AFP
పోలీసులు, సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న వారి మధ్య ఘర్షణ మధ్యాహ్నం హింసాత్మకంగా మారడంతో ఆ ప్రాతంలోకి ప్రవేశం నిషేధించినట్లు చెప్పారు.
ఇక్కడ హింస గురించి స్పష్టంగా తెలీకపోయినా, సోషల్ మీడియా, భారత టీవీ చానళ్లలో చూపిస్తున్న కొన్ని వీడియోల్లో తగలబడుతున్న వాహనాలు, రాళ్లు రువ్వడాలు, వీధుల్లో అంతా రాళ్లు కనిపిస్తున్నాయి.
దిల్లీ పోలీసులకు, రాళ్లు రవ్వుతున్న ఆందోళనకారులకు మధ్య ఘర్షణ జరుగుతున్న ఈశాన్య దిల్లీలోని వజీరాబాద్‌కు కూడా అదనపు భద్రతాదళాలను పంపించారు.
ప్రజలు వజీరాబాద్ వైపు వెళ్లకుండా పోలీసులు ఆ రహదారులు బ్లాక్ చేశారు.
ఈశాన్య దిల్లీలోని మౌజ్‌పూర్‌లో ముస్లిం మహిళలు సీఏఏకు వ్యతిరేకంగా చేస్తున్న ప్రదర్శనలు ఇవాళ కూడా కొనసాగుతున్నాయి. ఆదివారం సాయంత్రం సీఏఏ సమర్థకులు, వ్యతిరేకులు రాళ్లు రువ్వుకోవడంతో ఈ ప్రదర్శనలు హింసాత్మకంగా మారాయి.

ఇవి కూడా చదవండి:
- బంగారం నిక్షేపాల వల్లే 'సోన్‌భద్ర'కు ఆ పేరొచ్చిందా?
- మాంసం తింటే కరోనావైరస్ వస్తుందంటూ వదంతులు.. పడిపోయిన చికెన్, మటన్ అమ్మకాలు, ధరలు
- హైదరాబాద్‌లో శాకాహారులు ఎంత మంది? మాంసాహారులు ఎంత మంది?
- 'గ్రహాంతర వాసుల అన్వేషణను మరింత సీరియస్‌గా తీసుకోవాలి.. ప్రభుత్వాలు భారీగా నిధులివ్వాలి'
- పురుషులు మూత్రం ఎలా పోస్తే మంచిది? నిలబడి పోయాలా? కూర్చుని పోయాలా?
- ఒక్క మిడత ‘మహమ్మారి'లా ఎలా మారుతుంది
- వుహాన్ డైరీ: మరణించడానికి మూడు గంటల ముందు ఆయనకు హాస్పిటల్ బెడ్ దొరికింది
- కరోనా వైరస్: వూహాన్లో ఏం జరుగుతోందో ప్రపంచానికి చూపించిన రిపోర్టర్స్ మిస్సింగ్
- పాకిస్తాన్లో చక్కెర కొరత... ఇబ్బందులు పడుతున్న ప్రజలు
- హార్ట్ బ్రేక్ గైడ్: లవ్ ఫెయిల్యూర్, బ్రేకప్ బాధ నుంచి బయటపడండి ఇలా..
- కరోనా వైరస్: పిల్లలపై ప్రభావం చూపలేకపోతున్న వైరస్.. కారణాలు చెప్పలేకపోతున్న వైద్య నిపుణులు
- బిర్యానీ హైదరాబాద్‌ది కాదా?
- యువతను శాకాహారం వైపు నడిపిస్తున్న 7 అంశాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









