సైనా నెహ్వాల్: భారతీయ జనతా పార్టీలో చేరిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి

ఫొటో సోర్స్, BJP
ప్రముఖ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ భారతీయ జనతా పార్టీలో చేరారు. సైనాతో పాటు ఆమె సోదరి చంద్రాన్షు నెహ్వాల్ సైతం కాషాయ కండువా కప్పుకున్నారు.
బీజేపీ జాతీయ కార్యదర్శి అరుణ్ సింగ్ బుధవారం దిల్లీలోని పార్టీ జాతీయ కార్యాలయంలో సైనా నెహ్వాల్, ఆమె అక్క చంద్రాన్షు నెహ్వాల్లకు పార్టీ ప్రాథమిక సభ్యత్వం ఇచ్చి, కాషాయ కండువా కప్పారు.
ఈ సందర్భంగా సైనా నెహ్వాల్ మాట్లాడుతూ.. దేశం కోసం కష్టపడుతున్న పార్టీ బీజేపీ అని, అలాంటి పార్టీలో చేరటం పట్ల సంతోషంగా ఉందని చెప్పారు.
తాను కష్టపడే స్వభవం గల వ్యక్తినని, కష్టపడేవాళ్లంటే తనకు ఇష్టమని.. నరేంద్ర మోదీ దేశం కోసం రాత్రి, పగలు కష్టపడుతుంటారని, ఆయనతో పాటుగా తాను కూడా దేశం కోసం కష్టపడతానని తెలిపారు.


తనకు రాజకీయం కొత్త అని, అయితే.. రాజకీయాలపైన కూడా అవగాహన తెచ్చుకోవడం, రాజకీయాలను పరిశీలించడం తనకు నచ్చుతుందని చెప్పారు.
నరేంద్ర మోదీ క్రీడల కోసం కూడా చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారని, ‘ఖేలో ఇండియా’ ద్వారా క్రీడాకారులు పెద్దపెద్ద అకాడమీల్లో చేరే అవకాశం లభిస్తోందని వివరించారు.
దేశానికి మంచి చేస్తున్న పార్టీలో చేరటం పట్ల తనకు చాలా సంతోషంగా ఉందని, నరేంద్ర మోదీ ద్వారా తాను చాలా స్ఫూర్తి పొందుతుంటానని, ఆయనలాగే తాను కూడా దేశానికి మంచి చేయాలనుకుంటున్నానని, అందుకు తన శాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు.
ఈరోజు ఉదయం సైనా నెహ్వాల్, ఆమె సోదరి చంద్రాన్షులు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు.
కంటెంట్ అందుబాటులో లేదు
మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.పోస్ట్ of Facebook ముగిసింది
ఇవి కూడా చదవండి:
- BBC EXCLUSIVE: సైనా నెహ్వాల్ ఇంటర్వ్యూ.. ‘సింధు టాప్ ప్లేయరే, కానీ ఈరోజు నాది’
- #CWG2018: సైనా నెహ్వాల్ విజయం.. భారత్కి మరో గోల్డ్
- ఒక్కటైన సైనా - కశ్యప్: తండ్రి చెప్పిన లవ్ స్టోరీ
- సైనా-సింధు: ఒకరు విప్లవం తెచ్చారు.. మరొకరు ముందుకు తీసుకెళ్తున్నారు
- కరోనా వైరస్: 'తుమ్మినా, దగ్గినా ఇతరులకు సోకుతుంది.. దగ్గు, జ్వరంతో మొదలై అవయవాలు పనిచేయకుండా చేస్తుంది'
- మాస్క్లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
- వీడియో: కరోనా వైరస్.. చేపల మార్కెట్లో మొదలైంది.. చైనా మొత్తం పాకింది
- కరోనావైరస్లు ఎక్కడి నుంచి వస్తాయి... ఒక్కసారిగా ఎలా వ్యాపిస్తాయి?
- కరోనా వైరస్: ‘భయమేస్తోంది.. దీనిపై అదుపు లేదు, మాస్కులు దొరకడం లేదు’
- చైనా కరోనా వైరస్: 'ఇప్పటికే వందలాది మందికి సోకింది... ఇతర దేశాలకు విస్తరిస్తోంది'
- నంబి నారాయణన్: ఒక నకిలీ ‘గూఢచార కుంభకోణం’ ఈ సైంటిస్టు జీవితాన్ని ఎలా నాశనం చేసిందంటే..
- కరోనా వైరస్: ఇన్ఫెక్షన్ సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆరు మ్యాపుల్లో...
- ఆశిమా ఛిబ్బర్ :మగాడి తోడు లేకుండానే తల్లి అయిన మహిళ కథ
- విక్టోరియా మహారాణి, ఆమె భారత గుమస్తా అబ్దుల్ కరీమ్ మధ్య అంతుపట్టని ఆ బంధాన్ని ఏమనాలి
- ఉత్తర కొరియా భారీ ఎత్తున రిసార్టులు, స్పాలు ఎందుకు నిర్మిస్తోంది
- ‘వీళ్లు అధికారంలో లేకపోతే ప్రపంచం మెరుగ్గా ఉండేది’.. ట్రంప్, జిన్పింగ్ పాలనపై జార్జ్ సోరస్ విమర్శలు
- కరోనా వైరస్-వుహాన్ : ఒక నగరాన్ని మూసేయడం సాధ్యమా? చైనా చర్యతో వైరస్ వ్యాప్తి ఆగిపోతుందా?
- ఉత్తర కొరియా: కిమ్ జాంగ్ ఉన్ మేనత్త బతికే ఉన్నారు... ఆరేళ్ళ ఊహాగానాలకు తెర
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)









