#CWG2018: సైనా నెహ్వాల్ విజయం.. భారత్‌కి మరో గోల్డ్

ఫొటో సోర్స్, Getty Images
కామన్వెల్త్ క్రీడల్లో భారత్ పతకాల పంట పండుతోంది. బ్యాడ్మింటన్ మిక్స్డ్ టీం ఈవెంట్‌లో భారత్ బంగారు పతకం సాధించింది.
మలేసియా క్రీడాకారిణి సోనియా చీహ్‌పై.. సైనా నెహ్వాల్ గెలిచింది.
హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో మొదటి మూడో సెట్‌లో గెలిచి.. సైనా విజయం సాధించింది.
మొటి సెట్‌లో 21-11తో ముందంజలో ఉన్న సైనా తర్వాత కాస్త వెనుకబడ్డట్టు కనిపించింది.
రెండో సెట్‌ను చీహ్ గెలిచింది. మూడో సెట్‌లో సైనా 21-9తో సునాయాసంగా విజయం సాధించింది.
ఈ విజయంతో భారత్ పతకాల సంఖ్య 19కి చేరింది. ఇందులో పది స్వర్ణాలు, నాలుగు రజతాలు, అయిదు కాంస్య పతకాలున్నాయి.

ఫొటో సోర్స్, NOAH SEELAM/gettyimages
2010లో దిల్లీలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో సైనా బంగారు పతకం, మిక్స్‌డ్ డబుల్స్‌లో రజతం సాధించింది.
2006 మెల్‌బోర్న్ కామన్వెల్త్ గేమ్స్ మిక్స్‌డ్ డబుల్స్‌లో కాంస్య పతకం గెలుపొందింది.
అయితే, 2014లో గాయాల కారణంగా కామన్వెల్త్ క్రీడల నుంచి తప్పుకుంది.
రియో ఒలింపిక్స్‌లోనూ గాయాల వల్లనే గెలవలేకపోయానని తెలిపింది. మోకాలికి శస్త్రచికిత్స కూడా చేయించుకుంది.
ఉత్తర ప్రదేశ్‌లోని జలాల్‌పూర్‌లో సైనా జన్మించారు. అయితే, ఆమె కుటుంబం హైదరాబాద్‌లో స్థిరపడింది.
ఆమె విద్యాభ్యాసం హైదరాబాద్‌లోనే పూర్తి చేశారు. పుల్లెల గోపీచంద్ వద్ద శిక్షణ తీసుకున్నారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








