ఒక్కటైన సైనా - కశ్యప్‌: తండ్రి చెప్పిన లవ్ స్టోరీ

saina

ఫొటో సోర్స్, Saina

భారత బ్యాడ్మింటన్ స్టార్లు సైనా నెహ్వాల్ - పారుపల్లి కశ్యప్‌లు ఇవాళ వివాహం చేసుకున్నారు. హైదరాబాద్‌లోని ఓరియన్ విల్లా 23లో జరిగిన ఈ వివాహానికి ఇరు కుటుంబాలకు చెందిన సుమారు 40 మంది హాజరయ్యారు.

నూతన వధూవరులను గవర్నర్ నరసింహన్ దంపతులు ఆశీర్వదించారు.

బీబీసీ న్యూస్ తెలుగుతో మాట్లాడిన సైనా తండ్రి డాక్టర్ హర్‌వీర్ సింగ్‌ దీన్ని ధ్రువీకరించారు.

డిసెంబర్ 16న ఆదివారం (ఎల్లుండి) విందు కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

saina

ఫొటో సోర్స్, Saina

అలా మొదలైంది

సైనా నెహ్వాల్ - పారుపల్లి కశ్యప్‌లు హైదరాబాద్‌లోని గోపీచంద్ అకాడెమీలో బ్యాడ్మింటన్ శిక్షణ తీసుకున్నారు.

వీరిద్దరి మధ్య ప్రేమ సంగతి మీకెప్పుడు తెలిసిందని సైనా తండ్రిని అడిగినప్పుడు.. ఆయన ఓ చిరునవ్వు నవ్వారు.

పోస్ట్‌ Instagram స్కిప్ చేయండి
Instagram ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of Instagram ముగిసింది

"ఎన్నోఏళ్లుగా వాళ్లిద్దరూ మంచి స్నేహితులని మాకు తెలుసు. తరచూ వాళ్లిద్దరూ బయటకు వెళ్లేవాళ్లు. ఇద్దరూ కలిసి శిక్షణ తీసుకునే వారు. ఇదంతా సహజంగా జరిగిపోయింది. వీళ్ల స్నేహం ప్రేమగా మారొచ్చని గతేడాది నుంచి మాకు అనిపిస్తోంది. ఒకసారి కశ్యప్‌ నాతో ఈ విషయం చర్చించారు. అప్పుడు నేను కశ్యప్ తల్లిదండ్రులను కలిశాను. అప్పుడు తాము కూడా ఇదే ఆలోచనలో ఉన్నట్లు వాళ్లు నాకు చెప్పారు. దాంతో మేము ముందుకెళ్లామని" డాక్టర్ హర్‌వీర్ సింగ్ చెప్పారు.

saina

ఫొటో సోర్స్, Saina

వాళ్ల విషయం నాకు తెలుసు: గోపీచంద్

'వాళ్లిద్దరూ ఇష్టపడుతున్నారని నాకు తెలుసు' అని 2006 నుంచి సైనా నెహ్వాల్ - కశ్యప్‌లకు శిక్షణ ఇస్తున్న కోచ్ గోపీచంద్ అన్నారు.

"వాళ్లిద్దరూ గొప్ప క్రీడాకారులు. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోవడం చాలా బాగుంది. వాళ్లకు నా శుభాకాంక్షలు. వాళ్లు మరిన్ని విజయాలు అందుకోవాలి" అని బీబీసీకి గోపీచంద్ చెప్పారు.

తమ పెళ్లి గురించి సైనా నెహ్వాల్ ట్విటర్‌లో వెల్లడించింది. 'నా జీవితంలో ఇది గొప్ప మ్యాచ్‌' అంటూ.. వాళ్లిద్దరి ఫొటోలను షేర్ చేసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)