నిర్భయ గ్యాంగ్‌ రేప్: వినయ్ శర్మ, ముఖేష్ సింగ్‌ల క్యురేటివ్ పిటిషన్‌ను కొట్టేసిన కోర్టు

నిర్భయ కేసు దోషులు

ఫొటో సోర్స్, Delhi Police

నిర్భయ కేసులో దోషులైన వినయ్ కుమార్ శర్మ, ముకేష్ సింగ్ దాఖలు చేసిన క్యురేటివ్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు మంగళవారం నాడు కొట్టేసింది.

ఉరిశిక్ష అమలుపై స్టే కోరుతూ దాఖలు చేసిన అప్లికేషన్‌ను కూడా కోర్టు కొట్టేసింది.

ఈ పిటిషన్‌పై విచారణ జడ్జి చాంబర్ లోపలే జరిగింది. తరువాత జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం.. ముఖేష్ సింగ్, వినయ్ కుమార్ శర్మల పిటిషన్‌ను కొట్టేసినట్లు తెలిపింది.

ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో జస్టిస్ రమణతో పాటు, జస్టిస్ అరుణ్ మిశ్రా, ఆర్ ఎఫ్ నారీమన్, ఆర్ భానుమతి, అశోక్ భూషణ్ ఉన్నారు.

సుప్రీం కోర్టు నిర్ణయం అనంతరం నిర్భయ తల్లి ఆశా దేవి మాట్లాడుతూ.. ''ఏడేళ్లుగా నేను న్యాయం కోసం ఎదురుచూస్తున్నా. అందుకే దోషులుకు ఉరిశిక్ష అమలయ్యే జనవరి 22 మాకు ఎంతో ముఖ్యమైన రోజు'' అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషులకు దిల్లీలోని పటియాలా కోర్టు ఇటీవల డెత్ వారెంట్ జారీ చేసింది. జనవరి 22న నలుగురు దోషులకూ మరణశిక్షను అమలుచేయాలని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది.

ఆ ఆదేశాలు వెలువడిన అనంతరం దోషి వినయ్ తరఫు న్యాయవాది ఏపీ సింగ్ మాట్లాడుతూ కోర్టులో క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేస్తామని పేర్కొన్నారు.

మొదట జనవరి 8న వినయ్ కుమార్ క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ తరువాత నలుగురు దోషుల్లో ఒకరైన ముఖేష్ కూడా ఆ పిటిషన్ వేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)