స్మార్ట్ ఫోన్ కొంటే కిలో ఉల్లిపాయలు 'ఫ్రీ'

మొబైల్ కొంటే ఉల్లిపాయలు ఉచితం
    • రచయిత, ఎం. నియాస్ అహ్మద్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మొబైల్ ఫోన్లు కొంటే ఉచితంగా ఇచ్చే ఆఫర్లు ఏముంటాయి?

మహా అయితే.. హెడ్‌ఫోన్లు, టెంపర్డ్ గ్లాస్, మెమొరీ కార్డులు. అయితే.. తంజావూరు జిల్లాలోని ఒక మొబైల్ షాపు యజమాని కస్టమర్లను సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాడు.

ఒక స్మార్ట్ ఫోన్ కొంటే కిలో ఉల్లిపాయలు ఉచితం అని ఆఫర్ ప్రకటించారు.

ఆశ్చర్యంగా ఉందా? 'ఉల్లిపాయలు ఉచితం' ఆఫర్‌ వల్ల తన అమ్మకాలు అమాంతం ఐదు రెట్లు పెరిగాయని సదరు షాపు యజమాని చెప్తున్నాడు.

తమిళనాడులోని డెల్టా ప్రాంతమైన తంజావూరు జిల్లాలో పట్టుకొట్టాయ్ వాచ్‌టవర్ దగ్గర ఉంది ఎస్.టీ.ఆర్. మొబైల్ షాప్. ఈ దుకాణంలో గత రెండు రోజులుగా 'ఉచిత ఉల్లిపాయల' ఆఫర్ అందిస్తున్నారు.

మొబైల్ కొంటే ఉల్లిపాయలు ఉచితం

''మా ఆవేదనను వ్యక్తం చేయటం మాత్రమే ఈ ఆఫర్ ఉద్దేశం'' అని యజమాని శ్రావణకుమార్ చెప్పారు.

ఉల్లిపాయల ధరలు కిలో 200 రూపాయలకు ఎగబాకాయని ఆయన ఉటంకించారు. ''మెమొరీ కార్డు కూడా అదే ధరకు లభిస్తుంది. కానీ ఇప్పుడు ప్రజలకు.. మమొరీ కార్డు, హెడ్‌ఫోన్ల కన్నా ఉల్లిపాయలు ఎక్కువ అవసరం. అందుకే మేం ఈ ఆఫర్ ప్రారంభించాం'' అని వివరించారు.

ఇంతకుముందు సగటున రోజుకు రెండు లేదా మూడు ఫోన్లు అమ్మేవాళ్లు. ఉల్లిపాయల ఆఫర్‌తో ఈ షాపు వ్యాపారం ఐదు రెట్లు పెరిగింది.

''గడచిన రెండు రోజుల్లో 15 మొబైల్ ఫోన్ల కన్నా ఎక్కువ అమ్ముడయ్యాయి'' అని శ్రావణకుమార్ తెలిపారు.

మొబైల్ కొంటే ఉల్లిపాయలు ఉచితం

నింగినంటుతున్న ఉల్లి ధరలు

తమిళనాడు వ్యాప్తంగా ఉల్లిపాయల ధరలు కిలో 200 రూపాయలకు చేరాయి.

ఏఎన్‌ఐ వార్తా సంస్థ కథనం ప్రకారం.. సాధారణంగా ఐదు కిలోల ఉల్లిపాయలు కొనే వినియోగదారులు ఇప్పుడు కేవలం రెండు కిలోలు కొంటున్నారని మధురైకి చెందిన మూర్తి అనే విక్రేత చెప్పారు.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)