IND Vs BAN: మూడో టీ20లో బంగ్లాదేశ్‌పై భారత్ విజయం, హ్యాట్రిక్ హీరో దీపక్ చాహర్

ఫొటో సోర్స్, Deepak chahar/Twitter
నాగపూర్‌లో ఆడిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత్.. బంగ్లాదేశ్‌ను 30 పరుగులతో ఓడించి ఈ సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకుంది.
175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 19.2 ఓవర్లలో 144 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీపక్ చాహర్ ఈ మ్యాచ్‌లో హీరోగా నిలిచాడు. మొత్తం ఆరు వికెట్లు పడగొట్టిన చాహర్ హ్యాట్రిక్ కూడా తీశాడు.
చాహర్ 3.2 ఓవర్లలో 7 పరుగులు ఇచ్చి ఆరుగురు బంగ్లాదేశ్ బ్యాట్స్‌మన్లను అవుట్ చేశాడు. టీ20లో హ్యాట్రిక్ తీసిన మొట్టమొదటి భారత బౌలర్‌గా నిలిచాడు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1

పోస్ట్ of X ముగిసింది, 2
18 ఓవర్ చివరి బంతికి షఫివుల్ ఇస్లాం (6)ను అవుట్ చేసిన చాహర్, 20 ఓవర్ మొదటి రెండు బంతులకు ముస్తాఫిజుర్ రహ్మాన్ (3), అమీనుల్ ఇస్లాం (9) వికెట్లు తీశాడు.
మరో 4 బంతులు మిగిలుండగానే బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌కు తెరదించాడు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
రసవత్తరంగా మ్యాచ్
భారత్, బంగ్లాదేశ్ మధ్య నాగపూర్‌లో ఆదివారం సిరీస్‌లో మూడో, చివరి మ్యాచ్ జరిగింది.
ఈ మ్యాచ్‌లో టాస్ కోల్పోయి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ ప్రత్యర్థికి 175 పరుగుల లక్ష్యాన్ని ఇచ్చింది. బంగ్లాదేశ్ ఆటగాడు మొహమ్మద్ నయీమ్ క్రీజులో ఉన్నప్పుడు ఒక సమయంలో అభిమానులు మ్యాచ్ చేజారిపోయిందనే అనుకున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
నయీమ్ 48 బంతుల్లో 10 ఫోర్లు, రెండు సిక్సర్లతో 81 పరుగులు చేసి జోరు మీద ఉన్నప్పుడు, 16వ ఓవర్ వేసిన శివం దూబే అతడిని బౌల్డ్ చేశాడు. తర్వాత బంతికే అఫిఫ్ హుస్సేన్ (0) వికెట్ తీసి మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పాడు.
నయీమ్‌తో పాటు మొహమ్మద్ మిథున్ కూడా భారత బౌలర్లను ఎదుర్కొని 27 పరుగులు చేయగలిగాడు. కానీ, బంగ్లాదేశ్ మిగతా బ్యాట్స్‌మన్లు రెండంకెల స్కోరు కూడా చేరలేకపోయారు.
ఓపెనర్ లిటన్ దాస్ 9 పరుగులకే పెవిలియన్ చేరగా సౌమ్యా సర్కార్, ముష్ఫికర్ రహీమ్, అఫీఫ్ హుస్సేన్ ముగ్గురూ ఖాతా తెరవకుండానే అవుట్ అయ్యారు.
భారత బౌలర్లలో దీపక్ చాహర్ ఆరు వికెట్లు పడగొడితే, శివమ్ దూబే 3, యుజ్వేంద్ర చాహల్ 1 వికెట్ తీశారు.

ఫొటో సోర్స్, Shreyas Iyer/Twitter
భారత ఇన్నింగ్స్
అంతకు ముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ధారిత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది.
అద్భుతంగా బ్యాటింగ్ చేసిన శ్రేయస్ అయ్యర్ 33 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 62 పరుగులు చేశాడు. సౌమ్యా సర్కార్ బౌలింగ్‌లో లిటన్ దాస్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
అతడితోపాటు కేఎల్ రాహుల్ కూడా 35 బంతుల్లో 7 ఫోర్లతో 52 పరుగులు చేశాడు. అల్ అమీన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.
అంతకు ముందు భారత కెప్టెన్ రోహిత్ శర్మ 2 పరుగులకే షఫీవుల్ ఇస్లామ్ బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మరో ఓపెనర్ శిఖర్ ధవన్ 16 బంతుల్లో నాలుగు ఫోర్లతో 19 పరుగులు చేసి జోరు పెంచుతున్న సమయంలో షపీవుల్ బౌలింగ్‌లోనే అవుట్ అయ్యాడు.
చివరి ఓవర్లలో మనీష్ పాండే భారత రన్‌రేటును వేగంగా పెంచాడు. 13 బంతుల్లో మూడు ఫోర్లతో 22 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
వికెట్ కీపర్ రిషబ్ పంత్ (6) వరుసగా మరోసారి విఫలం అయ్యాడు. సౌమ్యా సర్కార్ బౌలింగ్‌లో షాట్ కొట్టబోయి బౌల్డ్ అయ్యాడు.
బంగ్లాదేశ్ బౌలర్లలో షఫీవుల్ ఇస్లాం, సౌమ్యా సర్కార్ చెరి రెండు వికెట్లు పడగొట్టగా, అల్ అమీన్ హుస్సేన్‌కు ఒక వికెట్ దక్కింది.
భారత్ చాలా రనౌట్ చాన్సులు మిస్ చేయగా, భారత ఆటగాళ్ల క్యాచ్‌లు వదిలిన బంగ్లాదేశ్ దానికి మూల్యం చెల్లించింది.
ఇవి కూడా చదవండి:
- రోహిత్ లాంగ్ ఇన్నింగ్స్ రహస్యమేంటి?
- తక్కువ ఖర్చుతో, స్మార్ట్‌ఫోన్ టెక్నాలజీతో కొండచరియ ప్రమాదాలు గుర్తిస్తున్న ఐఐటీ శాస్త్రవేత్తలు
- భారత నగరాలు ప్రపంచంలోనే అత్యంత కలుషితమైనవి ఎందుకయ్యాయి
- నేపాల్‌తో చైనా స్నేహం భారత్‌కు ప్రమాదమా
- ఈ అమ్మాయిలు మాట్లాడటానికే భయపడేవారు.. కానీ ఒలింపిక్స్‌కు ఎలా అర్హత సాధించారంటే..
- ఆర్సీఈపీలో చేరకూడదని ప్రధాని మోదీ ఎందుకు నిర్ణయం తీసుకున్నారు?
- ఆరాంకో: ప్రపంచంలో అత్యధిక లాభాలు సంపాదించే కంపెనీ షేర్ మార్కెట్లోకి ఎందుకొస్తోంది?
- భూపత్ డాకూ: భారత్‌లో ఎనభై హత్యలు చేసి పాకిస్తాన్ పారిపోయిన దోపిడీ దొంగ
- 'సచిన్ అందరికీ క్రికెట్ దేవుడు... కానీ, నాకు మాత్రం కొడుకులాంటి వాడు'
- తీవ్రవాద సంస్థలకు నిధులు అందకుండా పాకిస్తాన్ అడ్డుకోగలదా...
- పాకిస్తాన్లో ‘గాంధీ’ని కాపాడిన జిన్నా
- సౌరవ్ గంగూలీ: 'దాదాగిరీ' సెకండ్ ఇన్నింగ్స్ మొదలవుతుందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)