రఫేల్‌కు ‘ఆయుధ పూజ’.. ‘దేశాన్ని రక్షించడానికి రఫేల్‌, రఫేల్‌ను రక్షించడానికి నిమ్మకాయలు’.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ చర్యపై నెటిజన్ల కామెంట్లు

రఫేల్ యుద్ధ విమానానికి ఆయుధ పూజ చేస్తున్న కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

ఫొటో సోర్స్, ANI/Twitter

ఫొటో క్యాప్షన్, రఫేల్ యుద్ధ విమానానికి పూజ చేస్తున్న కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

తొలి అధునాతన రఫేల్ యుద్ధ విమానాన్ని భారత్‌కు ఫ్రాన్స్ అప్పగించింది. దీన్ని తీసుకునేందుకు భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. ఫ్రాన్స్‌కు వెళ్లారు. విమానాన్ని స్వీకరించే ముందుగా ఆయన ఆయుధపూజ చేశారు.

విమానంపై కుంకుమతో ఆయన 'ఓంకారం' రాశారు. చక్రాల కింద నిమ్మకాయలు పెట్టి.. టెంకాయనూ కొట్టారు.

దసరా సందర్భంగా ఆయుధ పూజ చేశానని చెబుతూ సంబంధిత ఫోటోలను ఆయన ట్విటర్ వేదికగా పంచుకున్నారు.

మరోవైపు ఆయన కుమారుడు పంకజ్ సింగ్ కూడా ట్విటర్‌లో దీనిపై స్పందించారు. ''దసరా పర్వదినాన భారత్‌కు ఫ్రాన్స్‌ అధికారికంగా అప్పగించిన రఫేల్ యుద్ధ విమానానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ ఆయుధ పూజ చేయడం చూడటమనేది ప్రతిఒక్కరికీ గర్వకారణం'' అని ఆయన ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

రఫేల్‌పై ఓంకారం రాయడం, చక్రాల కింద నిమ్మకాయలు పెట్టడం, టెంకాయ కొట్టడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాజకీయ నాయకులతోపాటు సామాన్యులూ దీనిపై స్పందిస్తున్నారు.

ప్రస్తుతం ట్విటర్‌లో #Rafale #RafalePujaPolitics #ShastraPuja #Nimbu లాంటి హ్యాష్ ట్యాగ్‌లు ట్రెండ్ అవుతున్నాయి.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

రఫేల్‌పై ఓంకారం రాయడాన్ని మూఢనమ్మకంతో కొందరు పోలుస్తుంటే.. మరికొందరు భారత సంస్కృతీ, సంప్రదాయాల్లో ఇది భాగమని అంటున్నారు. ఇంకొందరు చతుర్లు విసురుతున్నారు.

నిరుద్యోగంతో ఆయుధపూజకు ముడిపెడుతూ ఓ ట్విటర్ యూజర్ ట్వీట్ చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లను ఆయన ట్యాగ్ చేశారు. ''నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు, ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు పడేందుకు ఎన్ని నిమ్మకాయలు కావాలి''అని ఆయన ప్రశ్నించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

నిమ్మకాయ ఎలా పనిచేస్తుందంటే.. ''రఫేల్‌లో ఎప్పటికీ ఇంధనం అడుగంటనివ్వదు. ఎలాంటి ప్రమాదం జరగనివ్వదు. టైర్లు పంచర్ కానివ్వదు''అని మరొక యూజర్ రాసుకొచ్చారు. ''అంటే నిమ్మకాయ మనల్ని రక్షిస్తుందని అంటారు''అని ఇంకొక యూజర్ దీనికి సమాధానం ఇచ్చారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 4

''బావుంది. ఈ పూజను భారత ఆర్థిక వ్యవస్థకూ చేయండి. అది కూడా మెరుగు పడుతుంది''అని గురూ జీ పేరుతోవున్న యూజర్ ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 5
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 5

''ఇలాంటి చర్యలు నవభారత్ విలువలను ప్రతిబింబిస్తున్నాయి. గర్వకారణమైన భారత సంస్కృతిని చాటిచెబుతున్నాయి. నిమ్మకాయలు చక్రాల కింద పెట్టడం, టెంకాయ కొట్టడం, కుంకుమ పెట్టడం లాంటివి మూఢనమ్మకాలుకాదని నొక్కిచెప్పిన రాజ్‌నాథ్ గారికి ధన్యవాదాలు''అని ప్రియా శర్మ వ్యాఖ్యానించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 6
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 6

''రఫేల్.. ఆటో, కార్, బైక్ ఏదైనా అవ్వనీ.. మన భారతీయుల దారి ప్రత్యేకమైనది. ఎక్కడికెళ్లినా మన సంప్రదాయాలు, సంస్కృతినీ మనం గౌరవిస్తాం. హజ్ యాత్రకు ఇస్తున్న సబ్సిడీతో మన లౌకికవాద భావన ఎలా ప్రభావితం కాదో.. ఇది కూడా అంతే''అని శ్రీనివాస్ జయ ప్రకాశ్ పేరుతో ఖాతా నిర్వహిస్తున్న మరో నెటిజన్ వ్యాఖ్యానించారు.

''అర్థంపర్థం లేకుండా ఇలా యుద్ధ విమానానికి పూజ చేయడాన్ని ఖండిస్తున్నా. ఇది ఓ మతానికి సంబంధించిన సంప్రదాయం. ఇలా చేయడం అవివేకమే అవుతుంది. పన్నుల ద్వారా సేకరించే డబ్బుతో ఈ విమానాలు కొనుగోలు చేస్తున్నారు. ఆ పన్నులు కట్టేవారిలో నేనూ ఒకడిని. భారత్‌కు సిగ్గుచేటు''అని వైట్ బ్లేజ్ పేరుతో ఖాతా నిర్వహిస్తున్న మరో ట్విటర్ యూజర్ వ్యాఖ్యానించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 7
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 7

''అసలు మత రంగు ఎందుకు పులుముతున్నారో అర్థం కావట్లేదు. మనమంతా గర్వపడాలి. ఇది అద్భుత యుద్ధ విమానం. దీని చిత్రాలు చూస్తుంటే గర్వంగా అనిపిస్తోంది. ఆయుధ పూజలో తప్పేముంది?''అని మారన్ వ్యాఖ్యానించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 8
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 8

చతుర్లు కూడా విసురుతున్నారు

మరోవైపు ఆయుధపూజపై మరికొందరు చతుర్లు విసురుతున్నారు. భారత్‌లో వాహనాలపై సాధారణంగా కనిపించే పేర్ల తరహాలో రఫేల్‌పై చాలా వ్యాఖ్యలు రాసిన కార్టూన్‌ను నెహ్రూవియన్ అజిత్ అనే పేరుతో ఖాతా నిర్వహిస్తున్న వ్యక్తి పోస్ట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 9
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 9

''రఫేల్‌పై స్వస్తిక్ గుర్తును రాజ్‌నాథ్ రాసుండాల్సింది. అయితే దాన్ని చూసిన వెంటనే ఫ్రాన్స్‌కు గుండె పోటు వచ్చుండేది''అని రాజు గులాబ్ ఖత్రి అనే నెటిజన్ వ్యాఖ్యానించారు.

(జర్మనీకి చెందిన నియంత అడాల్ఫ్ హిట్లర్ నేతృత్వం వహించిన నాజీ పార్టీ గుర్తు కూడా స్వస్తిక్. అప్పట్లో జర్మనీని కూడా నాజీ జర్మనీ అని పిలిచేవారు. రెండో ప్రపంచయుద్ధం నేపథ్యంలో 1940 మే-జూన్ మాసాల్లో నాజీ జర్మనీ, ఫ్రాన్స్ దేశాల మధ్య భీకర యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో ఫ్రాన్స్‌పై జర్మనీ గెలుపొందింది.)

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 10
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 10

''మొదట దేశాన్ని రక్షించడానికి రఫేల్‌ను కొనండి. తర్వాత రఫేల్‌ను రక్షించడానికి నిమ్మకాయలు కొనండి. ఇదే మన భారతదేశం''అని అమిత్ కుమార్ సింగ్ చతుర్లు విసిరారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 11
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 11

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)