పెహ్లూ ఖాన్‌పై మూక దాడి కేసు: నిందితులను రాజస్థాన్ కోర్టు ఎందుకు వదిలేసిందంటే..

ఫొటో సోర్స్, Mansi Thapliyal
రాజస్థాన్‌లో రెండేళ్ల క్రితం పాడి రైతు పెహ్లూ ఖాన్ మూక దాడికి గురై మరణించిన కేసులో మొత్తం ఆరుగురు నిందితులనూ నిర్దోషులుగా ప్రకటిస్తూ ఆల్వార్ అదనపు సెషన్స్ కోర్టు బుధవారం తీర్పు చెప్పింది.
నిందితులైన విపిన్ యాదవ్, రవీంద్ర కుమార్, కాలూరామ్, దయానంద్, యోగేశ్ కార్, భీమ్ రాఠీలకు వ్యతిరేకంగా ఆధారాలు లేవని పేర్కొంటూ ఆల్వార్ కోర్టు జడ్డి సరితా స్వామి వెల్లడించిన 92 పేజీల ఈ తీర్పు ప్రతి బీబీసీ చేతికి వచ్చింది.
ఈ కేసు దర్యాప్తు జరిగిన తీరు, దాడిని చిత్రించేందుకు ఉపయోగించినదిగా చెబుతున్న మొబైల్ ఫోన్ విశ్వసనీయతపై ఈ తీర్పులో జడ్జి పలు సందేహాలు వ్యక్తం చేశారు.
నిందితులను దోషులుగా రుజువు చేయడంలో ప్రొసిక్యూషన్ విఫలమైందని, సంశయ లబ్ధి కింద వారికి కేసు నుంచి విముక్తి కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
2017 ఏప్రిల్ 1న పెహ్లూ ఖాన్‌తో పాటు ఆయన ఇద్దరు కుమారులు, మరో నలుగురిపై స్వయంప్రకటిత గోరక్షకులు దాడికి పాల్పడ్డట్లు ప్రొసిక్యూషన్ వాదించింది.
ఈ కేసులో నిందితులపై 302, 341, 308, 323 సెక్షన్ల కింద అభియోగాలు నమోదయ్యాయి. రెండు ఛార్జ్ షీట్‌లు దాఖలయ్యాయి.

ఫొటో సోర్స్, VIDEO GRAB
ఫోన్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపలేదు
దాడి ఘటనను చిత్రించేందుకు ఉపయోగించిందిగా చెబుతున్న ఫోన్ ఎప్పుడూ పోలీసుల స్వాధీనంలో లేదని తీర్పులో జడ్డి వ్యాఖ్యానించారు. ''నిజంగానే ఈ వీడియోను తీశారా? లేక సృష్టించారా? అన్న విషయాలను నిర్ధారించేందుకు ఫోన్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపలేదు'' అని పేర్కొన్నారు.
ఫోన్ పోలీసుల స్వాధీనంలో లేకపోవడం, ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపకపోవడం వల్ల మొదటి వీడియోను సాక్ష్యంగా పరిగణించలేమన్న కోర్టు, దాడికి సంబంధించిన ఇంకో వీడియోను కూడా తిరస్కరించింది.
రెండో వీడియో తీసినప్పుడు చూశానని చెప్పిన సాక్షి, తన సాక్ష్యాన్ని ముందే మార్చుకున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో పెహ్లూ ఖాన్ ఇచ్చిన వాంగ్మూలాన్ని కూడా వైద్యుల సహకారం లేకుండా నమోదు చేశారని కోర్టు తీర్పులో వ్యాఖ్యానించింది. కేసు నమోదైన 16 గంటల తర్వాత ఈ వాంగ్మూలాన్ని సంబంధిత పోలీస్ స్టేషన్‌లో సమర్పించారని తెలిపింది.
''తీవ్రమైన లోపాలున్న ఈ విచారణను విశ్వసంచలేం'' అని తీర్పులో జడ్డి పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
కేసు నేపథ్యం ఇదీ..
ఏప్రిల్ 1న ఆల్వార్ జిల్లాలో మూకదాడికి గురైన 55 ఏళ్ల పెహ్లూ ఖాన్.. రెండు రోజుల తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు.
పెహ్లూ ఖాన్‌ది హరియాణాలోని నూహ్ ప్రాంతం. రాజస్థాన్‌లో ఒక పశువుల సంతలో కొన్న ఆవులను ఓ అద్దె వాహనంలో స్వగ్రామానికి తీసుకువెళ్తుండగా ఆయనపై దాడి జరిగింది. ఆరుగురు వ్యక్తులు మోటార్ సైకిళ్ల మీద వెంబడించి, ఆయనపై దాడి చేశారు. పెహ్లూ ఖాన్‌తోపాటు ఉన్న ఆయన ఇద్దరు కుమారులు కూడా ఘటనలో గాయపడ్డారు.
దాడితో అపస్మారక స్థితిలోకి వెళ్లిన పెహ్లూ ఖాన్ చనిపోవడానికి ముందు కొద్దిగా స్పృహలోకి వచ్చారు. తనపై దాడికి పాల్పడినవారి పేర్లను ఆయన వెల్లడించారు.
అయితే, నిందితులను అరెస్టు చేయడానికి ముందే పోలీసులు.. అక్రమంగా ఆవులను తరలిస్తున్నారన్న అభియోగంతో పెహ్లూ ఖాన్‌తోపాటు ఇతర బాధితులపై కేసు నమోదు చేశారు.
ఇవి కూడా చదవండి:
- గ్రౌండ్ రిపోర్ట్ : అల్వర్‌లో ఆవులు తోలుకెళ్తున్న ముస్లిం యువకుడిని ఎవరు చంపారు?
- ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ఐదుగురు మహిళా గూఢచారులు
- కశ్మీర్లో ఆ 5 రోజుల్లో ఏమేం జరిగాయి
- పోర్న్ స్టార్ మియా ఖలీఫాను వెంటాడుతున్న గతం
- 'సైనిక విన్యాసాలు చేస్తూ శాంతి చర్చలా...' దక్షిణ కొరియాపై ఉత్తర కొరియా ఆగ్రహం..
- కశ్మీర్: 'భారత్ మాతాకీ జై' అనే నినాదాలతో ఉన్న ఈ వీడియో ఎక్కడిది?- Fact Check
- ‘అందరూ నిర్దోషులైతే.. ఈ దళితుల్ని చంపిందెవరు?’
- షార్క్‌లు మనుషులపై ఎందుకు దాడులు చేస్తాయంటే...
- కశ్మీర్: పాకిస్తాన్ అభ్యర్థనను అంతర్జాతీయ సమాజం ఎందుకు వినడం లేదు
- మనుషుల అవయవాలు జంతువుల్లో వృద్ధి - ఈ పరిశోధనల లక్ష్యం ఏంటి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








